Telangana

News May 23, 2024

HYD: వీడియో తీసిన యువకుడు.. యువతి ఆత్మహత్యాయత్నం

image

యువతి ఆత్మహత్యకు యత్నించింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బాపట్లకు చెందిన యువతి HYDలో ఉంటోంది. ఈ క్రమంలో ఆమె స్నానం చేస్తుండగా పొరుగింటి యువకుడు వీడియో తీశాడు. తర్వాత ఆ వీడియోను ఆమెకు పంపి డబ్బు కావాలని బెదిరించగా రూ.40 వేలు పంపింది. కొన్ని రోజులకు మళ్లీ డబ్బు కావాలని అడగడంతో భయపడిన యువతి బాపట్లకు వెళుతూ బస్సులోనే పురుగు మందు తాగింది. తోటి ప్రయాణికుల సమాచారంతో పోలీసులు ఆమెను ఆస్పత్రికి తరలించారు.

వరంగల్: ఐటీఐలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

వరంగల్ ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఈ విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు పొందుటకు ఆన్లైన్లో దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపల్ జుమ్లానాయక్ తెలిపారు. వచ్చే నెల 10లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేటప్పుడు ప్రాధాన్య క్రమంలో ట్రేడ్లను ఎంపిక చేసుకోవాలని సూచించారు. 14 ఏళ్ల వయసు కలిగి 10వ తరగతి ఉత్తీర్ణత సాధించాలన్నారు. అభ్యర్థులు వాడుకలో ఉన్న ఫోన్ నంబరును అందజేయాలన్నారు.

News May 23, 2024

శ్రీధర్ రెడ్డి హత్యపై మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి

image

చిన్నంబాయి మండలం లక్ష్మీ పల్లికి చెందిన బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్య పై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జిల్లాలో ఐదు నెలల కాలంలో ఇద్దరు బీఆర్ఎస్ నేతలు హత్యకు గురయ్యారని ఆయన ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. హంతకులను కఠినంగా శిక్షించాలని ఎస్పీకి విజ్ఞప్తి చేశారు. జిల్లా మీడియా సెల్ కన్వీనర్ అశోక్ నిందితులను శిక్షించాలన్నారు.

News May 23, 2024

పోస్టింగుల కోసం గురుకుల అభ్యర్థులు ఎదురుచూపు!

image

గురుకుల నోటిఫికేషన్‌లో ఇచ్చిన 9210 ఖాళీలను నింపే సదుద్దేశంతో 2 నెలల క్రితం ప్రభుత్వం ఎంపికైన అభ్యర్ధులను గురుకుల సొసైటీలకు కేటాయిస్తూ అభ్యర్థులకు అలాట్మెంట్ ఆర్డర్స్ అందజేసి నిరుద్యోగుల జీవితాలలో ఆశలు చిగురించేలా చేసింది. ఇదే ఆర్డర్‌లో ప్లేస్ అఫ్ పోస్టింగ్‌ను విడిగా అందజేస్తామని చెప్పినప్పటికీ ఎలక్షన్ కోడ్ వల్ల అది ఇప్పటివరకు అభ్యర్థులకు అందజేయలేదు. వందలాది మంది పోస్టింగ్‌ల కోసం ఎదురుచూస్తున్నారు.

News May 23, 2024

యాదాద్రి జిల్లాలో రియాక్టర్ లీక్.. వ్యక్తి మృతి

image

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలోని ఎస్వీ ల్యాబ్ పరిశ్రమలో ప్రమాదం జరిగింది. రియాక్టర్ వద్ద లీకేజీ అవడంతో ప్లాంట్ ఇన్‌ఛార్జ్ నాగరాజు (34) మృతి చెందాడు పరిశ్రమలో పని చేస్తున్న మరో ఇద్దరికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో వారిని హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

రామగుండం- మణుగూరు రైల్వే లైను 207.80 కి.మీ

image

రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక <<13298191>>రైల్వే కోర్ కారిడార్ <<>>ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.

News May 23, 2024

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్షుడిగా కవి యాకుబ్‌

image

హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కవి యాకుబ్‌, ఆర్‌.వాసు ఎన్నికయ్యారు. హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌ జనరల్‌ బాడీ సమావేశాన్ని బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా శోభన్‌ బాబు, మలుపు బాల్‌రెడ్డి, సహాయ కార్యదర్శులుగా సూరిబాబు, సురేశ్‌, కోశాధికారిగా నారాయణరెడ్డి ఎన్నికయ్యారు.

HYD: టీ-వర్క్స్, టీ-హబ్‌కు సీఈవోల నియామకం

image

రాష్ట్ర ప్రభుత్వం టీ-వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, టీ-హబ్ సీఈవోగా సీతా పల్లచోళ్లను నియమించింది. ఈ మేరకు ఐటీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జయేశ్ రంజన్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరు ఈ పదవుల్లో మూడేళ్లపాటు కొనసాగనున్నారు. కాగా టీ- వర్క్స్ అనేది ఎలక్ట్రానిక్ అండ్ హార్డ్వేర్ రంగంలో నూతన ఆవిష్కరణలు ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రం.