Telangana

News September 15, 2024

రుద్రూర్: గణనాథునికి 108 రకాల నైవేద్యాలు

image

రుద్రూర్ మండల కేంద్రంలోని అంగడి బజార్ నవయుగ గణేశ్ మండలి ఆధ్వర్యంలో ప్రతిష్ఠించిన వినాయకునికి భక్తులు ఆదివారం 108 రకాల నైవేద్యాలు సమర్పించారు. లడ్డూలు, గారెలు, చెకోడీలు, అరిసెలు, బొబ్బట్లు, పండ్లు ,పాయసం, పులిహోర, స్వీట్లు ఇతర రకాల నైవేద్యాలను భక్తులు తయారుచేసి గణనాథునికి నైవేద్యంగా సమర్పించారు. ఉదయం కుంకుమార్చన నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు.

News September 15, 2024

నిమజ్జనం సందర్భంగా వరంగల్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

image

గణపతి నిమజ్జనం సందర్భంగా వరంగల్ ట్రైసిటీస్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝూ తెలిపారు. ఈ ఆంక్షలు సోమవారం మధ్యాహ్నం 12 నుంచి మంగళవారం ఉదయం 10 గంటల వరకు కొనసాగుతాయని తెలిపారు. ఖమ్మం, ములుగు, నర్సంపేట, హైదరాబాద్ ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్లు ఆంక్షలు తప్పక పాటించాలని తెలిపారు.

News September 15, 2024

MBNR: విద్యార్థులకు గుడ్ న్యూస్.. FREE కోచింగ్.!

image

ఉమ్మడి MBNR జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో MPC, BIPC విద్యార్థులకు ఇటీవలే విద్యాశాఖ ఆదేశాల మేరకు నీట్, JEE, ఎఫ్ సెట్ పై ఉచిత శిక్షణ ప్రారంభించారు. మొత్తం 56 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉండగా.. దాదాపు 17,300 మంది చదువుతున్నారు. ప్రతిరోజు ఏడో పిరియడ్‌లో శిక్షణ ఇస్తున్నారు. ఆయా కళాశాల ప్రిన్సిపాల్‌లు విద్యార్థులపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News September 15, 2024

ఉమ్మడి KNR జిల్లాలో పాఠశాలల వివరాలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల సంఖ్య ఈ విధంగా ఉంది. పెద్దపల్లి జిల్లాలో మొత్తం 784 పాఠశాలల్లో 98,240 విద్యార్థులు, కరీంనగర్ జిల్లాలో 1,071 పాఠశాలల్లో 1,57,648 విద్యార్థులు, జగిత్యాల జిల్లాలో 1,165 పాఠశాలల్లో 1,59,585 విద్యార్థులు, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 659 పాఠశాలల్లో 87,390 విద్యార్థులు ఉన్నారు.

News September 15, 2024

వరంగల్: రేపే నిమజ్జనం.. జర భద్రం

image

గణేశ్ నవరాత్రి ఉత్సవాలు ముగిస్తుండటంతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం గణనాథుడి నిమజ్జన వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. గ్రేటర్ పరిధిలోని పద్మాక్షి గుండం, బంధం చెరువు, చిన్న వడ్డేపల్లి, ఉర్సు, కోట, బెస్తం చెరువు, ఇతర ప్రాంతాల్లో నిమజ్జనానికి అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. మరి మీ గణేశుడి నిమజ్జనం ఎప్పుడు? కామెంట్ చేయండి.

News September 15, 2024

నల్గొండ: అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

image

దామరచర్ల మండలం పుట్టలగడ్డతండాలో ఓ యువతి అనుమానాస్పద స్థితితో మృతిచెందింది. స్థానికుల వివరాలిలా.. మాల్‌తండా వాసి మౌనిక, పుట్టలగడ్డ తండాకు చెందిన రంగా ప్రేమించుకున్నారు. పెళ్లిచేసుకోవాలని అమ్మాయి కోరడంతో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఇంతలోనే ఈ తెల్లవారుజామున మౌనిక విగతజీవిగా కనిపించింది. అమ్మాయి కుటుంబ సభ్యులు రంగా మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 15, 2024

ఆర్సీపురం: గుండెపోటుతో యువకుడు మృతి

image

గుండెపోటుతో ఓ యువకుడు మృతి చెందిన ఘటన రామచంద్రపురంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. సిర్గాపూర్ మండలం సుర్త్యా నాయక్ తాండకు చెందిన జైపాల్ (28) కుటుంబ సభ్యులతో ఆర్సీపురంలో ఉంటున్నారు. అయితే స్థానిక వినాయక మండపంలో శనివారం రాత్రి డాన్స్ చేసి నీరసించిపోయి. ఇంటికి వచ్చి నిద్రించాడు. ఈరోజు తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు.

News September 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా గణేశ్ నిమజ్జన ఏర్పాట్లు పూర్తి
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పాల్వంచలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
∆} ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటన

News September 15, 2024

HYD: 16న నాగపూర్-సికింద్రాబాద్‌ ‘వందే భారత్’ ప్రారంభం

image

నాగపూర్ నుంచి సికింద్రాబాద్(SEC) మార్గంలో ఈ నెల 16న వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాగపూర్ నుంచి ఉ.5 గంటలకు బయలుదేరి మ.12:15కు SEC చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SEC నుంచి మ.1 గంటకు బయలుదేరి రా.8:20కు నాగపూర్ చేరుకుంటుంది.కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాంలో హాల్టింగ్ ఉంటుంది.

News September 15, 2024

HYD: 16న నాగపూర్-సికింద్రాబాద్‌ ‘వందే భారత్’ ప్రారంభం

image

నాగపూర్ నుంచి సికింద్రాబాద్(SEC) మార్గంలో ఈ నెల 16న వందే భారత్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ పద్ధతిలో ప్రారంభిస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. నాగపూర్ నుంచి ఉ.5 గంటలకు బయలుదేరి మ.12:15కు SEC చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో SEC నుంచి మ.1 గంటకు బయలుదేరి రా.8:20కు నాగపూర్ చేరుకుంటుంది.కాజీపేట, రామగుండం, బల్లార్ష, చంద్రాపూర్, సేవగ్రాంలో హాల్టింగ్ ఉంటుంది.