Telangana

News May 23, 2024

పంటల సాగుకు సిద్ధమవుతున్న ఖమ్మం జిల్లా రైతులు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటీవల భారీ వర్షాలు కురవడంతో పంటలను సాగు చేసేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. రేపటి నుంచి రోహిణి కార్తీ రానుంది. ఈ నేపథ్యంలో కార్తి వచ్చిన వెంటనే పంటలు సాగు చేసేందుకు ఇప్పటికే జిల్లాలోని పలు ప్రాంతాలలో రైతులు దుక్కులు దున్ని సిద్ధం చేసి ఉంచారు. సకాలంలో వర్షాలు కురుస్తుండడం వల్ల రైతులు పెద్ద ఎత్తున మెట్ట పంటల సాగుకు సిద్ధమవుతున్నారు.

News May 23, 2024

నెన్నెల వాసికి రూ.కోటి జీతంతో ఉద్యోగం

image

నెన్నెల మండలం గుడిపేటకు చెందిన మాలోతు తిరుపతి (28) ఏడాదికి రూ.కోటి జీతంతో ఉద్యోగానికి ఎంపికయ్యారు. ఆయన అమెరికాలోని జాన్స్ హోప్‌కిన్స్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో PHD పట్టా పొందారు. దీంతో బుధవారం ధర్డ్ వేవ్స్ సిస్టమ్ రీసెర్చ్ మేనేజర్‌గా ఏడాదికి రూ.కోటి జీతంతో ఉద్యోగం లభించింది. తిరుపతి తల్లిదండ్రులు రాంచందర్, శకుంతల నిరక్షరాస్యులు. వ్యవసాయం చేస్తూ వారి ఇద్దరు కుమారులను చదివించారు.

News May 23, 2024

తీన్మార్ మల్లన్న గెలుపు కోసం రంగంలోకి రేవంత్ రెడ్డి

image

ఉమ్మడి నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం సీఎం రేవంత్ రెడ్డి చేశారు. బుధవారం రాత్రి సీఎం రేవంత్‌ రెడ్డి నిర్వహించిన జూమ్ సమావేశంలో అభ్యర్థి తీన్మార్ మల్లన్న (చింతపండు నవీన్ కుమార్), మూడు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్లమెంట్ ఇంచార్జీలు, అసెంబ్లీ నియోజక వర్గ ఇంఛార్జీలు, కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

News May 23, 2024

భూపాలపల్లి, ములుగు మీదుగా రైల్వే లైను 207.80 కి.మీ

image

రామగుండం- మణుగూరు రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైల్వే కోర్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఈ మేరకు 207.80 కి.మీ మేర ఈ నడవా విస్తరించిన ప్రాంతాల్లో నూతనంగా బ్రాడ్ గేజ్ నిర్మించాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో భూ సేకరణ చేపట్టాలని SCR అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. దీంతో 142 కి.మీ. దూరం తగ్గనుంది.

News May 23, 2024

NLG: నేడు ఎడ్ సెట్ ప్రవేశ పరీక్ష

image

ఎడ్ సెట్ ప్రవేశ పరీక్షను గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్నారు. ఇందు కోసం సూర్యాపేటలో 1, కోదాడలో 2, నల్గొండలో 1 మొత్తం 4 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. రెండు సెషన్లలో నిర్వహించే ఈ పరీక్షకు అన్ని కేంద్రాల్లో కలిపి మొత్తం 1100 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎడ్ సెట్ ఛైర్మన్ ఆచార్య గోపాల్రెడ్డి పేర్కొన్నారు.

News May 23, 2024

ఖమ్మం జిల్లా అంతటా గట్టి నిఘా..!

image

పత్తి విత్తనాలపై ఖమ్మం జిల్లా వ్యవసాయ శాఖతో పాటు టాస్క్ ఫోర్స్ కమిటీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. గతంలో అనేకసార్లు జిల్లాలో రైతులు నకిలీ విత్తనాలను కొని మోసపోయి దిగుబడి రాక నష్టాల పాలైన ఘటనలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ప్రస్తుత సీజన్లో నకిలీ విత్తనాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విత్తనాల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబ్‌కు పంపించనున్నారు.

News May 23, 2024

కరీంనగర్: సన్నాల వైపు రైతుల చూపు!

image

సన్న వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్‌‌ను వచ్చే వానాకాలం సీజన్‌ నుంచే అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సన్న రకం వరి సాగు పెరగనుంది. సాధారణ వరి సాగు విస్తీర్ణం కన్నా అదనంగా 15 నుంచి 20 శాతం పెరగవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కువ నీరు, సానుకూల వాతావరణం దృష్ట్యా ఖరీఫ్‌లో రైతులు సన్న రకం వరి సాగు వైపు మక్కువ చూపుతారు.

News May 23, 2024

బడి కొత్తదనం.. మారుతున్న రూపురేఖలు

image

ఖమ్మం జిల్లాలోని పాఠశాలల్లో కనీస మౌలిక వసతులైన టాయిలెట్ల నిర్మాణం, తాగునీరు, విద్యుత్ సౌకర్యాల కల్పనపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. ఈమేరకు ప్రణాళిక సిద్ధం చేసి పనులు చేపడుతుండగా.. అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో ఇప్పటికే 217పాఠశాలల్లో పనులు పూర్తి కావడంతో కళకళలాడుతున్నాయి. మిగతా పాఠశాలల్లో కూడా విద్యాసంవత్సరం ప్రారంభమయ్యే నాటికి పూర్తిచేయాలనే లక్ష్యంతో అధికారులు ఉన్నారు.

News May 23, 2024

వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్య

image

వనపర్తి జిల్లాలో దారుణ హత్య జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. చిన్నంబావి మండలం లక్ష్మీపల్లిలో స్థానిక బీఆర్ఎస్ నాయకుడు శ్రీధర్ రెడ్డి(45) ఆరుబయట నిద్రిస్తున్నాడు. ఈ క్రమంలో దుండగులు గొడ్డలితో నరికి చంపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 23, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాలో చిరుత సంచారం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో చిరుతపులి సంచారం తీవ్ర కలకలం సృష్టించింది. బుధవారం జిల్లాలోని తూడుకుర్తి గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు స్థానికులు గుర్తించారు. దీంతో తూడుకుర్తి, సల్కర పేట గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అటవీశాఖ అధికారులు స్పందించి చిరుత బారి నుంచి తమను కాపాడాలని స్థానికులు కోరుతున్నారు.