Telangana

News May 23, 2024

HYDలో ఎక్కడ చూసినా ఆహార కల్తీనే..!

image

HYDలో ఇన్ని రోజులు చిన్న హోటళ్లలో ఆహారకల్తీని అధికారులు గుర్తించగా ఇప్పుడు పెద్ద వాటిల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. బుధవారం సోమాజిగూడ క్రుతుంగ రెస్టారెంట్, రెస్ట్ ఓ బార్, KFCలో నాసిరకం, పాడైన ఆహారపదార్థాలు గుర్తించామని, వాటి నమూనాలను ల్యాబ్‌కు పంపామని అధికారులు తెలిపారు. HYD, ఉమ్మడి RR పరిధిలోని పలు హోటళ్లలో బిర్యానీకి పాడైన, నిల్వ చేసిన చికెన్ వాడుతున్నారని అధికారులు గుర్తించారు.
SHARE IT

News May 23, 2024

కరీంనగర్: రేపటి నుంచి ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

image

ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 24 నుంచి 31వ తేదీ వరకు కరీంనగర్ జిల్లాలో పరీక్షలను నిర్వహిస్తున్నారు. పరీక్షల కోసం 31 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరంలో 10,073 మంది, ద్వితీయ సంవత్సరంలో 4,907 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్ష కేంద్రాలకు గంట ముందు విద్యార్థులు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News May 23, 2024

పాలెంలో ఈనెల 24న విత్తన మేళా..!

image

నాగర్ కర్నూల్ జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రంలో ఈనెల 24న విత్తనమేళా నిర్వహిస్తున్నట్లు ప్రాంతీయ వ్యవసాయ సహాయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ మల్లారెడ్డి బుధవారం తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని రైతులు పాల్గొని వివిధ పంటల సాగు పద్ధతులపై వ్యవసాయ శాస్త్రవేత్తలు అందించే సలహాలు సూచనలు పొందాలన్నారు. అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన రైతులు కొనుగోలు చేసుకోవచ్చని తెలిపారు.

News May 23, 2024

HYD: ఆ తల్లి ఆరుగురికి జీవం పోసింది

image

HYD నగరంలో ఓ తల్లి మరణించినా.. అవయవ దానం ద్వారా ఆరుగురికి ప్రాణం పోశారు. ఆలేరు మండలానికి చెందిన జంపాల సుజాత అపస్మారక స్థితిలో ఇటీవల కింద పడిపోయారు. వెంటనే ఆమెను HYD మేడిపల్లిలోని ఓ ఆసుపత్రికి తరలించగా, తాజాగా.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు తెలిపారు. కుటుంబీకుల అంగీకారంతో సుజాత గుండె, నేత్రాలు, కాలేయం తీసుకుని ఆరుగురికి అమర్చి, ప్రాణం పోసినట్లు జీవన్ దాన్ బృందం తెలిపింది.

News May 23, 2024

కడ్తాల్: ‘పెండింగ్ బిల్లులు చెల్లించి ఎన్నికలు నిర్వహించాలి’

image

పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథికి బుధవారం రాష్ట్ర సర్పంచుల సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. గ్రామాల అభివృద్ధి కోసం, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు,వైకుంఠధామాలు, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలు సొంత నిధులతో నిర్మించామని వారు పేర్కొన్నారు. లక్ష్మీనరసింహారెడ్డి, చందర్ మధుసూదన్ రెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.

News May 23, 2024

ఎంతమందికి స్కూటీలు, తులం బంగారం ఇచ్చారో చెప్పాలి: KTR

image

కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే మహిళలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని అన్నారు. ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.

News May 23, 2024

ఎంతమందికి స్కూటీలు, తులం బంగారం ఇచ్చారో చెప్పాలి: KTR

image

కాకతీయ యూనివర్సిటీ బీఆర్ఎస్వీ నేతలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తాము అధికారంలోకి రాగానే మహిళలకు స్కూటీలు, కళ్యాణ లక్ష్మి పథకంలో భాగంగా రూ.లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారని అన్నారు. ఎంతమందికి ఇచ్చారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు.

News May 23, 2024

నాగర్‌కర్నూల్ జిల్లాలో కల్తీ విత్తనాలపై స్పెషల్ టీం

image

నాగర్ కర్నూల్ జిల్లాలో కల్తీ విత్తనాల మీద నిఘా పెట్టినట్లు ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ బుధవారం తెలిపారు. ఇందులో భాగంగా 10 మంది పోలీసు అధికారులతో కూడిన ఒక స్పెషల్ టీం ఏర్పాటు చేశామన్నారు. ఈ టీం అగ్రికల్చర్ ఆఫీసర్లతో కలిసి పనిచేస్తుందని చెప్పారు. రైతులు మోసపోకుండా విత్తనాలను కొనుగోలు చేయాలని సూచించారు.

News May 23, 2024

ఖమ్మం: నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు: సీపీ

image

రైతులకు నకిలీ విత్తనాలు అమ్మితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఖమ్మం పోలీస్ కమీషనర్ సునీల్ దత్ హెచ్చరించారు. నకిలీలను అరికట్టేందుకు 21 టాస్క్ ఫోర్స్ పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. లైసెన్స్ లేకుండా వ్యాపారాలు చేయొద్దన్నారు. అక్రమ‌రవాణను అడ్డుకునేందుకు సరిహద్దు ప్రాంతాలలో చెక్ పోస్ట్ లను ఉంచామని పేర్కొన్నారు. తరుచూ నకిలీ విత్తనాలు అమ్మి పట్టుబడితే పీడీయాక్ట్ నమోదు చేస్తామన్నారు.

News May 23, 2024

ADB: ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను అభివృద్ధి చేస్తాం: పీవో

image

ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని ఐటీడీఏ ఉద్యాన నర్సరీలను బలోపేతం చేయటంతో పాటు అభివృద్ధి చేస్తామని ఉట్నూర్ ఐటీడీఏ పీవో కుష్బూ గుప్తా అన్నారు. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలంలోని జంబుగాలో ఉన్న ఐటీడీఏ ఉద్యాన నర్సరీ, శిక్షణా కేంద్రాన్ని పరిశీలించారు. నర్సరీ ద్వారా మెరుగైన ఆదాయం పొందటంతో పాటు, దినసరి కూలీలకు ఉపయోగపడే కార్యక్రమాలను చేపట్టాలన్నారు. అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని పీఓ సూచించారు.