Telangana

News May 22, 2024

ఆదిలాబాద్: ట్రాక్‌పై చెట్టు.. రైళ్లకు అంతరాయం

image

జిల్లాలోని తలమడుగు మండలం కోసాయి వద్ద గాలివాన కారణంగా చెట్లు రైలు పట్టాలపై పడిపోయాయి. దీంతో రాత్రి 7 గంటల వరకు ఆదిలాబాద్‌కు చేరుకోవాల్సిన ఇంటర్‌సిటీ రైలును మహారాష్ట్రలోని కిన్వట్ వద్ద నిలిపివేశారు. ఇదే రైలు ఆదిలాబాద్‌కు వచ్చి కృష్ణ ఎక్స్‌ప్రెస్‌గా 9 గంటలకు బయలుదేరాల్సి ఉంది. రైలు పట్టాలపై చెట్లు విరిగిపడటంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు రైల్వేస్టేషన్‌లో పడిగాపులు కాస్తున్నారు.

News May 22, 2024

రేవంత్ రెడ్డిది మాటల గారడీ ప్రభుత్వం: డీకే అరుణ

image

రేవంత్ రెడ్డిది మాటల గారడీ ప్రభుత్వమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారంలో ఆమె మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాము 30వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో ఎవరికీ తెలియదన్నారు. గాల్లో మాటలు చెప్పి కాగితాల మీద రాతలు చూపించి ప్రజలను మోసం చేయడం తప్ప నిరుద్యోగులకు చేసిందేమి లేదని ఆమె విమర్శించారు.

News May 22, 2024

ఉమ్మడి వరంగల్ జిల్లాలో TODAY హైలెట్స్

image

> WGL, HNK, NSPTలో MLC సన్నాహక సమావేశంలో పాల్గొన్న కేటీఆర్
> సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో తొక్కించిన పోలీసులు
> స్ట్రాంగ్ రూములను పరిశీలించిన HNK, WGL జిల్లాల కలెక్టర్లు
> జనగామలో సీఎం రేవంత్ దిష్టిబొమ్మ దహనం
> మేడిగడ్డను సందర్శించిన పూణే సైంటిస్ట్ బృందం
> WGL: రోడ్డు ప్రమాద బాధితున్ని ఆసుపత్రికి తరలించిన KTR
> జిల్లాలో 3 ప్రధాన పార్టీల విస్తృత ప్రచారం
> MGMను సందర్శించిన వరంగల్ జిల్లా కలెక్టర్

News May 22, 2024

WGL: వివాహేతర సంబంధం.. SI సస్పెండ్

image

వివాహేతర సంబంధం వ్యవహారంలో కొమురవెల్లి ఎస్సై నాగరాజును సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్ 1 ఐజీ ఏవీ రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. వివరాల్లోకి వెళ్తే.. నాగరాజు వేరే మహిళలతో సహజీవనం చేస్తున్నట్లుగా ఆరోపణలు రావడంతో పాటు, నాగరాజు భార్య పీఎస్ ముందు మంగళవారం ధర్నా చేసినట్లుగా వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చింది. దీంతో ఈ ఘటనపై సిద్దిపేట సీపీ విచారణ జరిపించారు. ఆరోపణలు నిజమవడంతో అతన్ని సస్పెండ్ చేశారు.

News May 22, 2024

HYD: వాయిస్ మార్చి పోలీసులకు ఫోన్ చేశాడు!

image

AP హైకోర్టు న్యాయమూర్తి పేరు చెప్పి మోసానికి పాల్పడుతున్న నిందితుడిని KPHB పోలీసులు అరెస్టు చేశారు. SI సుమన్ వివరాల ప్రకారం.. సందీప్ అనే వ్యక్తి KPHB పీఎస్ పరిధిలో దర్యాప్తులో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించి తాను న్యాయం చేస్తానంటూ బాధితుల నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఓ యాప్ ద్వారా న్యాయమూర్తిలాగ వాయిస్ మార్చి పోలీసులకు కాల్ చేశాడు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News May 22, 2024

HYD: వాయిస్ మార్చి పోలీసులకు ఫోన్ చేశాడు!

image

AP హైకోర్టు న్యాయమూర్తి పేరు చెప్పి మోసానికి పాల్పడుతున్న నిందితుడిని KPHB పోలీసులు అరెస్టు చేశారు. SI సుమన్ వివరాల ప్రకారం.. సందీప్ అనే వ్యక్తి KPHB పీఎస్ పరిధిలో దర్యాప్తులో ఉన్న క్రిమినల్ కేసుకు సంబంధించి తాను న్యాయం చేస్తానంటూ బాధితుల నుంచి రూ.50 వేలు తీసుకున్నాడు. ఓ యాప్ ద్వారా న్యాయమూర్తిలాగ వాయిస్ మార్చి పోలీసులకు కాల్ చేశాడు. నిందితుడు నేరం ఒప్పుకోవడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

News May 22, 2024

NGKL: గిరిజన విద్యార్థులకు గుడ్ న్యూస్.. దరఖాస్తు చేసుకోండి !

image

బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ 2024-25 విద్యాసంవత్సరం 3,5,8 తరగతుల్లో ప్రవేశానికి గాను జిల్లాకు చెందిన గిరిజన బాలబాలికలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కమలాకర్ రెడ్డి తెలిపారు. 3వ తరగతిలో 10 సీట్లు 5లో 6 సీట్లు, 8లో 4 సీట్లు ఉన్నట్లు పేర్కొన్నారు. ఆసక్తిగల విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News May 22, 2024

సిద్దిపేట: కొమురవెల్లి ఎస్ఐ నాగరాజు సస్పెన్షన్

image

సిద్దిపేట జిల్లా కొమురవెల్లి SI <<13292456>>నాగరాజును సస్పెండ్<<>> చేస్తూ మల్టీజోన్-1 ఐజీ రంగనాథ్ ఉత్తర్వులు జారీచేశారు. వివిధ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన ఆరోపణలపై విచారణకు ఆదేశించిన ఐజీ నిజమని తేలడంతో సస్పెండ్ చేసినట్లు తెలిసింది. కొమురవెల్లి పోలీస్ స్టేషన్ ఎదుట ఎస్ఐ భార్య మానస తనను కాదని మరో మహిళను పెళ్లి చేసుకుని కుమారులను ఇవ్వడం లేదని ఆరోపిస్తూ ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే.

News May 22, 2024

BREAKING: బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌ సస్పెండ్

image

బాన్సువాడ మున్సిపల్ కమిషనర్‌ అలీంపై వేటుపడింది. ఆయన్ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీఅయ్యాయి. భైంసా మున్సిపల్ కమిషనర్‌గా చేసినప్పుడు అలీంపై అవినీతికి ఆరోపణలు వచ్చాయి. విచారణ అనంతరం అలీంను ఈరోజు సీడీఎంఏ దివ్య సస్పెండ్ చేశారు.

News May 22, 2024

 ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి..

image

చెరువులో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన ఘటన దామరచర్లలో బుధవారం చోటుచేసుకుంది. ఎస్సై రవి తెలిపిన వివరాల ప్రకారం.. మండల కేంద్రంలోని నాగరాజు పెద్ద కుమారుడు నాగధనుష్, ఆయన మరదలు కుమారుడు పెద్ది శెట్టి సాత్విక్ కొంతమంది పిల్లలతో కలిసి గ్రామ శివారులోని నాగుల చెరువు వద్దకు ఈతకు వెళ్లారు. ఈక్రమంలో వారికి ఈత రాక మునిగి మృతి చెందినట్లు తెలిపారు.