Telangana

News May 22, 2024

RR: జిల్లాల్లో రెండు రోజులు వర్షాలు.. అలర్ట్

image

HYD, RR, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్ జిల్లాలలో ఉరుముల మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు రేపటి నుంచి రెండు రోజులపాటు కురిసే అవకాశం ఉన్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఎల్లో అలర్ట్ జారీ చేశారు. రూరల్ ప్రాంతాల్లో ఉండేవారు అప్రమత్తంగా ఉండటం మంచిదని సూచించారు.

News May 22, 2024

HYD: CDFDలో ఇంక్యుబేషన్ దరఖాస్తులు ఆహ్వానం

image

ఉప్పల్ పరిధిలోని సెంటర్ ఫర్ ఫింగర్ ప్రింట్ డిటెక్టివ్ సెంటర్లో లైఫ్ సైన్సెస్ ఇంక్యుబేషన్ ప్రోగ్రాం సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. జూన్ 5 వరకు ఈ అవకాశం ఉందని, ఆసక్తి గల అభ్యర్థులు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. లైఫ్ సైన్సెస్ పై ఆసక్తి గల వారికి నెట్వర్కింగ్, ల్యాబ్ అంశాల పై ట్రైనింగ్ అందిస్తారు.

పిట్లం: రోడ్డుపై పడిన భారీవృక్షం

image

పిట్లం మండలంలో బుధవారం మధ్యాహ్నం తీవ్రమైన గాలిదుమారంతో కూడిన అకాల వర్షం రావడంతో మండలంలోని పలు ప్రాంతాల్లో మొక్కజొన్న, జొన్న కుప్పలు తడిసిపోయాయి. సిద్దాపూర్ నుంచి రాంపూర్ వైపు వెళ్లేదారిలో చెరువు కట్టపై ఒక చెట్టు, నర్సరీ వద్ద మరోచెట్టు కూలిపోయింది. రోడ్డుకు అడ్డంగా చెట్టు పడటంతో భారీసంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. వాహనదారులే చెట్టును తొలగించే ప్రయత్నం చేశారు.

News May 22, 2024

HYD: 10TH పాసైన వారికి సువర్ణ అవకాశం..!

image

SSC పూర్తి పాసైన వారికి సెంట్రల్ అధికారులు శుభవార్త తెలిపారు. HYD నగరం చర్లపల్లిలోని CIPET కేంద్ర విద్యాసంస్థలో పలు ప్లాస్టిక్ టెక్నాలజీ డిప్లమా కోర్సులు చేసేందుకు ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నారు.మే 31 వరకు https://cipet24.onlineregistrationform.org/CIPET/LoginAction_registerCandidate.action లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులకు స్కాలర్షిప్ సైతం వస్తుంది.

ఎనుమాముల మార్కెట్ యార్డులో ఏర్పాట్ల పరిశీలన

image

ఎనుమాముల మార్కెట్ యార్డులో నిర్వహించనున్న వరంగల్ మెంట్ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ల కౌంటింగ్ ఏర్పాట్లను కలెక్టర్ ప్రావీణ్య, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీనివాస్‌తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పారదర్శకతతో కూడిన ఏర్పాట్ల విషయంలో ఖచ్చితత్వం పాటించే విధానంలో చేపట్టవలసిన వాటిపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద నిర్వహించే విధులపై చర్చించారు.

News May 22, 2024

మెదక్: సైలెంట్ మోడ్‌లో నాయకులు..!

image

పార్లమెంట్ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన నాయకులు సైలెంట్ మోడ్‌లోకి వెళ్లిపోయారు. ఈసారి ఓటరు నాడి తెలియకపోవడంతో మెదక్‌ ఎంపీగా ఎవరు గెలుస్తారో అంచనా వేయలేని పరిస్థితి. ఎవరికి వారుగా గెలుపు పై ధీమాతో ఉన్నప్పటికీ లోలోపల రిజల్ట్‌పై ఆందోళనలో ఉన్నారు. పోటాపోటీగా ప్రచారం చేసినా గెలుపుపై అభ్యర్థులు, నాయకులతోపాటు ప్రజల్లోనూ ఉత్కంఠ నెలకొంది. అయితే తుది ఫలితాల కోసం జూన్ 4వ వరకు వేచి చూడాల్సిందే.

News May 22, 2024

HYD: TISS విద్యాసంస్థలో పీజీ కోర్స్

image

తుర్కయంజాల TISS విద్యా సంస్థలు పీజీ కోర్సులకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. M.A స్కూలు ఆఫ్ ఎడ్యుకేషన్ స్టడీస్, స్కూల్ ఆఫ్ జెండర్ అండ్ లైవ్ హడ్స్ , స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ అండ్ గవర్నెన్స్ సంబంధించిన కోర్సులు అందుబాటులో ఉన్నట్లుగా పేర్కొన్నారు. జూన్ 3 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.