Telangana

News May 22, 2024

ఆదిలాబాద్: సైబర్‌‌క్రైంపై అవగాహన కల్పించాలి: ఎస్పీ

image

సైబర్ క్రైం నేరాలపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదిలాబాద్ ఎస్పీ గౌష్ ఆలం అన్నారు. సైబర్ క్రైంకు గురికాకుండా ఉండటానికి సూచనలతో ముద్రించిన గోడప్రతులను పోలీసు కార్యాలయంలో పోలీసు అధికారులతో కలిసి ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల్లో అవగాహన కల్పించటానికి గోడప్రతులను ప్రధాన కూడళ్లలో ప్రదర్శించాలన్నారు. అదేవిధంగా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి వివరించాలన్నారు.

News May 22, 2024

KNR: గ్రామాల్లో మొదలైన పంచాయతీ ఎన్నికల సందడి

image

మొన్నటి వరకు లోక్‌సభ ఎన్నికల హడావిడిలో మునిగి తేలిన నాయకులకు.. ఇక పంచాయితీ ఎన్నికల సందడి ప్రారంభం కానుంది. జనవరి 31తో సర్పంచుల పదవీకాలం ముగియడంతో ఫిబ్రవరి 2 నుంచి పల్లెలో ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతుంది. సైదాపూర్ మండలంలో మొత్తం 26 గ్రామపంచాయతీలు, 234 వార్డులు ఉండగా.. వీటికి సంబంధించిన వివరాలు అధికారులు సేకరిస్తున్నారు.

News May 22, 2024

రిపోర్టు అందజేసిన వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్

image

పాలమూరు యూనివర్సిటీలో మూడేళ్లు ఉపకులపతిగా లక్ష్మీకాంత్ రాథోడ్ విధులు నిర్వహించారు. బుధవారం తన పదవి విరమణ రిపోర్టును ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్టర్ లక్ష్మీనారాయణకు సమర్పించారు. తాను పీయూలో విధులు నిర్వహించిన కాలంలో చాలా అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. అనంతరం ఓయూ ఇన్ ఛార్జీ వీసీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

News May 22, 2024

వెల్దుర్తి: ఇంట్లో ఉరేసుకొని యువతి సూసైడ్

image

మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన కావుడే శ్రీను, యాదమ్మ దంపతుల 3వ కుమార్తె పావని బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లి విచారణ చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే పావని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. బంధువుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 22, 2024

కిర్గిస్తాన్‌లో తెలుగు వారు సురక్షితంగా ఉన్నారు: విద్య కుమార్

image

కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్‌లో చోటు చేసుకుంటున్న ఘటనలపై భారతీయ విద్యార్థులందరూ క్షేమంగా ఉన్నారని, అక్కడ సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని జీవీకే ఎడ్యుటెక్ డైరెక్టర్ విద్య కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు నమ్మవద్దని విద్య కుమార్ పేర్కొన్నారు.

BREAKING.. HYD: నడిరోడ్డు పై మద్యం వాహనం బోల్తా

image

సికింద్రాబాద్ బోయినపల్లిలో మద్యం లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. టైర్ పంక్చర్ కావడంతో డివైడర్‌ను ఢీకొట్టి వాహనం బోల్తా పడి దాదాపు రూ.3 లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసం అయినట్లు సమాచారం. రోడ్డుపై మద్యం సీసాలు పడడంతో వాహనదారులు వాటిని పట్టుకెళ్లేందుకు పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 22, 2024

BREAKING.. HYD: నడిరోడ్డుపై మద్యం వాహనం బోల్తా

image

సికింద్రాబాద్ బోయినపల్లిలో మద్యం లోడుతో వెళ్తున్న వాహనం బోల్తా పడింది. టైర్ పంక్చర్ కావడంతో డివైడర్‌ను ఢీకొట్టి వాహనం బోల్తా పడి దాదాపు రూ.3 లక్షల విలువైన మద్యం సీసాలు ధ్వంసం అయినట్లు సమాచారం. రోడ్డుపై మద్యం సీసాలు పడడంతో వాహనదారులు వాటిని పట్టుకెళ్లేందుకు పోటీపడ్డారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ప్రమాదస్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపు చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 22, 2024

KMM: మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం

image

NLG -KMM-WGL పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హీటెక్కిస్తోంది. ఈ ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ప్రచారం హోరెత్తుతోంది. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకోవాలని BRS, ఈసారి ఎలాగైనా పాగా వేయాలని కాంగ్రెస్ పట్టుదలతో వ్యవహరిస్తున్నాయి. ఈ ఎన్నికల్లోనూ బలమైన ఓట్లు సాధించాలని BJP భావిస్తోంది. ప్రచారానికి ఇంకా మూడు రోజులే గడువు ఉండడంతో అభ్యర్థుల తరఫున కీలక నేతలను రంగంలోకి దింపారు.

News May 22, 2024

NLG: మూడు పార్టీలకు ప్రతిష్ఠాత్మకం