Telangana

News May 22, 2024

ADB: నకిలీ విత్తనాలు అరికట్టేందుకు టాస్క్‌ఫోర్స్

image

ఆదిలాబాద్ వ్యవసాయ, పోలీస్ శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ రాజర్షి షా బుధవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వానాకాలం సాగు చేసేందుకు రైతులు సన్నద్ధమవుతున్న సమయంలో నకిలీ విత్తనాలను విక్రయించేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. వారిని అరికట్టడంలో భాగంగా వ్యవసాయశాఖ, టాస్క్‌ఫోర్స్, ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బందితో టాస్క్‌ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.

News May 22, 2024

బెస్ట్ అవైలబుల్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానం: కలెక్టర్

image

వరంగల్ జిల్లాలోని అర్హత గల గిరిజన విద్యార్థుల నుంచి 2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం కింద 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య తెలిపారు. జూన్ 6లోగా హన్మకొండలోని అంబేద్కర్ భవన్ ఎదురుగా ఉన్న జిల్లా గిరిజన అభివృద్ధి కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. జూన్ 12న కలెక్టరేట్లో డ్రా పద్ధతిన విద్యార్థుల ఎంపిక ఉంటుందన్నారు.

News May 22, 2024

KNR: అమ్మ ఆదర్శ పాఠశాల పనుల పురోగతిపై జిల్లా కలెక్టర్ సమీక్ష

image

పాఠశాలలో ఎలాంటి లోపాలు లేకుండా విద్యార్థులకు అన్ని వసతులు, సౌకర్యాలతో కూడిన విద్యను అందించే దిశగా ప్రభుత్వం చేపడుతున్న అమ్మ ఆదర్శ పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి కావాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో విద్యాశాఖ, ఆర్ ఆండ్ బి., ప్రత్యేకాధికారులతో అమ్మ ఆదర్శపాఠశాల అభివృద్ధి పనుల ప్రగతిపై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

News May 22, 2024

ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్

image

ఏసీపీ ఉమా మహేశ్వర్ రావును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. ఉమా మహేశ్వర్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏసీబీ కోర్టు విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ కొనసాగనుంది. మరికాసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించనున్నారు.

News May 22, 2024

ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్

image

ఏసీపీ ఉమా మహేశ్వర్ రావును ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట ఏసీబీ అధికారులు హాజరుపరిచారు. టీఎస్ ఉమా మహేశ్వర్ రావుకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ ఏసీబీ కోర్టు విధించింది. జూన్ 5 వరకు రిమాండ్ కొనసాగనుంది. మరికాసేపట్లో నాంపల్లి ఏసీబీ కోర్టు నుంచి చంచల్ గూడ జైలుకు ఏసీబీ అధికారులు తరలించనున్నారు.

News May 22, 2024

రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారి మన HYDలో..!

image

నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ మెట్రో‌పై అధికారులు గుడ్ న్యూస్ తెలిపారు. ప్రతిపాదిత ఎల్బీనగర్ జంక్షన్ స్టేషన్, కూడలికి కుడి వైపు వస్తుందని, దీన్ని ప్రస్తుత ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ వరకు విశాలమైన స్కై వాక్‌తో అనుసంధానం చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా తొలిసారిగా స్కై వాక్‌‌లోనే సమతలంగా ఉండే వాకలేటర్ ( దీని పై నిల్చుంటే చాలు అదే తీసుకెళుతుంది) ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

OU: ఎంబీఏ (ఈవినింగ్) పరీక్ష ఫీజు స్వీకరణ

image

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ (ఈవినింగ్) కోర్సు పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సు ఆరో సెమిస్టర్ రెగ్యులర్, అన్ని సెమిస్టర్ల బ్యాక్లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈనెల 30లోగా సంబంధిత కళాశాలలో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో వచ్చే 6 వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు. ఈ పరీక్షలను వచ్చే నెలలోనే నిర్వహిస్తామన్నారు.

విద్యార్థి సంఘాలతో ఓయూ కొత్త వీసీ MEETING

image

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఓయూ పరిపాలన భవనంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను విద్యార్థి నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.