Telangana

News May 22, 2024

REWIND: పాలమూరులో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ స్పష్టమైన మెజార్టీ సాధించింది. MBNR పార్లమెంట్ పరిధిలోని 7అసెంబ్లీ స్థానాల్లో, NGKL పరిధిలోని 5 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకుంది. BRS 2 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ ఖాతా తెరవలేదు. కాగా ప్రస్తుత ఓటింగ్ కలిసోస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే.. రాజకీయ సమీకరణాలు మారాయని BRS, BJP అంటున్నాయి. తుది ఫలితాల కోసం జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. దీనిపై మీ కామెంట్

News May 22, 2024

ఓయూ కొత్త వీసీ MEETING

image

ఉస్మానియా యూనివర్సిటీ వైస్ ఛాన్స్‌లర్‌గా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ ఓయూ పరిపాలన భవనంలో వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో బుధవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా యూనివర్సిటీలో నెలకొని ఉన్న సమస్యలను విద్యార్థి నేతలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.

KMR: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

image

KMR, BKNR రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైనట్టు రైల్వే SI తావునాయక్ తెలిపారు. గుర్తుతెలియని రైలులో డోర్ వద్ద ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడన్నారు. మృతుడు 35 – 40 సం.ల మధ్య వయస్సు కలిగి తెల్లచొక్కా, నల్ల ప్యాంటు ధరించాడన్నారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. మృతుడి వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఎస్సై సూచించారు.

News May 22, 2024

ADB: ధరణి, ప్రజావాణి పెండింగ్ సమస్యలు పరిష్కరించాలి: కలెక్టర్

image

ధరణి, ప్రజావాణి పెండింగ్ దరఖాస్తులను పరిశీలించి వారంలోగా పరిష్కరించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న ధరణి, ప్రజావాణి దరఖాస్తులను వారంలోగా పరిశీలించి పరిష్కరించాలని తహసీల్దార్‌లను ఆదేశించారు. ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.

News May 22, 2024

కంటోన్మెంట్ ఆసుపత్రి వద్ద మృతుడి బంధువుల ఆందోళన

image

సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఆసుపత్రిలో దంపతులపై చెట్టు కూలి వింజాపురం రవీందర్ మృతిచెందగా భార్య సరళాదేవి తీవ్ర గాయాల పాలైన విషయం తెలిసిందే. కాగా ఆస్పత్రి నిర్వాహకులు, కంటోన్మెంట్ అధికార సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ బంధుమిత్రులు, ఉపాధ్యాయ సంఘాలు ఈరోజు ఆందోళనకు దిగారు. గాంధీ ఆసుపత్రిలో మృతుడి ఇద్దరు కూతుళ్లు పడ్డ ఆవేదన వర్ణనాతీతం అని, మృతుడి కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు.

హైకోర్టు ఆదేశాలు.. మునగాల జడ్పీటీసీగా జ్యోతి 

image

హైకోర్టు ఆదేశాలతో మునగాల మండలం నూతన జడ్పీటీసీగా నారాయణగూడెం గ్రామానికి చెందిన దేశి రెడ్డి జ్యోతి ప్రమాణ స్వీకారం చేశారు. ప్రస్తుత జడ్పీటీసీ నల్లపాటి ప్రమీల ఎన్నిక చెల్లదంటూ జ్యోతి న్యాయ స్థానాన్ని ఆశ్రయించారు. గత ఐదేళ్లుగా పలు కోర్టుల్లో ఈ కేసు విచారణ కొనసాగింది. చివరకు ఆమె హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు విచారణ చేసి జ్యోతిని జడ్పీటీసీగా కొనసాగాలని ఆదేశించింది.

News May 22, 2024

KTDM: కారు డోరు లాక్.. ఊపిరాడక చిన్నారి మృతి

image

కారులో ఆడుకుంటూ చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం కొండయిగూడెంకి చెందిన చిన్నారి కల్నిషా (3) ఇంటి ముందు ఆడుకుంటూ ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులోకి వెళ్లింది.డోర్ ఆటోమేటిక్‌గా లాక్ అయి ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News May 22, 2024

HYD: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీకి వీడ్కోలు

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ 25వ వీసీగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ పదవీ కాలం మే 21న ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక వీడ్కోలు సమావేశం నిర్వహించి, ప్రొఫెసర్, డాక్టర్ రవీందర్ దంపతులను ఘనంగా సన్మానించిన యూనివర్సిటీ బృందం ఘన వీడ్కోలు పలికింది. కాగా నూతన వీసీగా దాన కిషోర్ IASని ప్రభుత్వం నియమించగా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.