Telangana

News April 6, 2025

HNK: వ్యభిచార గృహంపై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి

image

వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మహిళతో పాటు వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు టాస్క్‌ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ రంజిత్ కుమార్ తెలిపారు. హనుమకొండ బాలసముద్రం అంబేడ్కర్‌ నగర్‌కు చెందిన రాజీవ్(32) గవిచర్ల రోడ్డులోని ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. కాశికుండకు చెందిన ఆటో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. వారి వద్ద నుంచి 2 ఫోన్‌లు, రూ.1500 స్వాధీనం చేసుకున్నారు.

News April 6, 2025

లక్ష్య సాధనకు కృషి చేయాలి: ఖమ్మం కలెక్టర్

image

పోటీ పరీక్షల్లో అభ్యర్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటి సాధనకు ప్రణాళికాయుతంగా కృషి చేయాలని ఖమ్మం కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ అన్నారు. శనివారం ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్లో గ్రూప్-డీ, జూనియర్ లెక్చరర్, ఆర్ఆర్‌బీ, ఐడీబీసీ వంటి వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారితో ఆయన మాట్లాడారు. పరీక్షలకు ఎలా సన్నద్ధమవుతున్నారు, ఎలాంటి పుస్తకాలు కావాలి, ఇంకేమైనా అవసరాలు ఉన్నాయా? అని అడిగి తెలుసుకున్నారు.

News April 6, 2025

MBNR: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతిచెందిన ఘటన నవాబుపేట మండలంలో నిన్న జరిగింది. స్థానికుల వివరాలు.. కారుకొండకి చెందిన యాదమ్మ తన కుమారుడితో కలిసి బైక్‌పై పనిమీద బయటికెళ్లి తిరిగివస్తున్నారు. షాద్‌నగర్ సమీపంలోకి రాగానే బైక్ అదుపు తప్పి కిందపడ్డారు. ఈ ప్రమాదంలో మహిళ తలకు తీవ్రగాయాలవటంతో అక్కడికక్కడే మృతిచెందారు.

News April 6, 2025

మెదక్: విద్యుత్ షాక్‌తో ఒకరి మృతి

image

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి చెందిన ఘటన కొల్చారం మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ మహమ్మద్ గౌస్ తెలిపిన వివరాలు.. వరిగుంతం గ్రామానికి చెందిన పోచయ్య(39) నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి నీరు పడుతున్నాడు. ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌తో గాయాలపాలయ్యాడు. ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

News April 6, 2025

‘జై శ్రీరాం’: నేడు హైదరాబాద్‌లో ఒకటే స్లోగన్

image

శ్రీ రామ నవమి వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశ్‌పురి హనుమాన్ టెంపుల్‌ నుంచి భారీ శోభాయాత్రలకు సర్వం సిద్ధమైంది. హనుమాన్ టేక్డీ వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక అన్ని రామాలయాల్లో‌ కళ్యాణానికి ముహూర్తం పెట్టారు. నేడు ‘జై శ్రీరాం’ నినాదాలతో హైదరాబాద్‌ హోరెత్తనుంది.

News April 6, 2025

‘జై శ్రీరాం’: నేడు హైదరాబాద్‌లో ఒకటే స్లోగన్

image

శ్రీ రామ నవమి వేడుకలకు హైదరాబాద్ ముస్తాబైంది. సీతారాంబాగ్ టెంపుల్, ఆకాశ్‌పురి హనుమాన్ టెంపుల్‌ నుంచి భారీ శోభాయాత్రలకు సర్వం సిద్ధమైంది. హనుమాన్ టేక్డీ వద్ద ఈ యాత్ర ముగుస్తుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సిటీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ రూట్‌లో ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. ఇక అన్ని రామాలయాల్లో‌ కళ్యాణానికి ముహూర్తం పెట్టారు. నేడు ‘జై శ్రీరాం’ నినాదాలతో హైదరాబాద్‌ హోరెత్తనుంది.

News April 6, 2025

NLG: రాములోరి కళ్యాణానికి సర్వం సిద్ధం

image

సీతారాముడి కళ్యాణోత్సవానికి జిల్లా ముస్తాబైంది. జిల్లాలోని అన్ని ఆలయాలల్లో నేడు శ్రీరామనవమి వేడుకలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తిచేశారు. ఆలయాలను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించి చలువ పందిళ్లు వేశారు. కళ్యాణ వేడుకల అనంతరం అన్నదానం నిర్వహించనున్నారు. సాయంత్రం కళ్యాణమూర్తులను ఊరేగించనున్నారు. జిల్లా కేంద్రం రామగిరి రామాలయంలో శ్రీరామనవమి వేడుకలకు నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు.

News April 6, 2025

కరీంనగర్: లోయర్ మానేరు డ్యాం నీటి విడుదల నిలిపివేత

image

లోయర్ మానేరు డ్యామ్ నుంచి వచ్చే నీరును ఆదివారం నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. కాలువ ద్వారా యాసంగి సాగుకు నీటి విడుదల మార్చి 31 వరకు ఉండగా అదనంగా ఆరు రోజులు ఎక్కువ ఇచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం LMDలో 5.81టీఎంసీ నీరు మాత్రమే ఉందని, కరీంనగర్ నగరానికి కావలసిన తాగునీటికి ఇబ్బంది కాకుండా దిగువకు నీటి సరఫరాను నిలిపివేసినట్లు తెలిపారు.

News April 6, 2025

ADB: పాలిటెక్నిక్‌లో ప్రవేశాలకు POLYCET

image

పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందేందుకు పాలిసెట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ఆదిలాబాద్ సంజయ్ గాంధీ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ బండి రాంబాబు తెలిపారు. ఏప్రిల్ 20లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 13న పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు. పదోతరగతి పూర్తయిన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News April 6, 2025

NZB: చోరీలకు పాల్పడుతున్న నిందితుడి అరెస్ట్

image

జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ACP రాజా వెంకట్ రెడ్డి శనివారం తెలిపారు. నాందేడ్ జిల్లాకు చెందిన నాందేవ్ ఆనందరావు జిల్లాలోని పలు చోట్ల దొంగతనాలకు పాల్పడ్డాడన్నారు. గత నెల 5న మాక్లూర్ మండలం మాదాపూర్‌లో పరశు దేవానందం ఇంట్లో చోరీ జరిగింది. సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్ట్ చేసి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

error: Content is protected !!