Telangana

News May 22, 2024

KTDM: కారు డోరు లాక్.. ఊపిరాడక చిన్నారి మృతి

image

కారులో ఆడుకుంటూ చిన్నారి మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం మధ్యాహ్నం కొండయిగూడెంకి చెందిన చిన్నారి కల్నిషా (3) ఇంటి ముందు ఆడుకుంటూ ఇంటి పక్కనే నిలిపి ఉన్న కారులోకి వెళ్లింది.డోర్ ఆటోమేటిక్‌గా లాక్ అయి ఊపిరాడక మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.

News May 22, 2024

HYD: ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీకి వీడ్కోలు

image

HYD ఉస్మానియా యూనివర్సిటీ 25వ వీసీగా ఉన్న ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ పదవీ కాలం మే 21న ముగిసింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక వీడ్కోలు సమావేశం నిర్వహించి, ప్రొఫెసర్, డాక్టర్ రవీందర్ దంపతులను ఘనంగా సన్మానించిన యూనివర్సిటీ బృందం ఘన వీడ్కోలు పలికింది. కాగా నూతన వీసీగా దాన కిషోర్ IASని ప్రభుత్వం నియమించగా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.

News May 22, 2024

ఉస్మానియా యూనివర్సిటీ మాజీ వీసీకి వీడ్కోలు

రాచకొండ: అసలే విత్తనాల సీజన్.. నకిలీ పట్ల జర జాగ్రత్త..!

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో కొద్దిరోజుల క్రితం మోస్తారు చిరుజల్లులు కురిశాయి. దీంతో దుక్కులు దున్నుతున్న రైతన్న వర్షాకాలం సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఇదే సమయంలో విత్తనాలకు ఫుల్ డిమాండ్ ఉన్న నేపథ్యంలో కొందరు నకిలీ విత్తనాలు తయారు చేసి, విక్రయించేందుకు తెరలేపుతున్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు నకిలీవని అనుమానం వస్తే వెంటనే 8712662111కు కాల్ చేయాలన్నారు.

News May 22, 2024

HYD: రోడ్లపై పేరుకుపోయిన ఇసుక మేటలు

image

ఇటీవలే కురిసిన వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాల్లో రోడ్లపై ఇసుకమేటలు పేరుకుపోయాయి. ఎగువ నుంచి లోతట్టు ప్రాంతాలకు ఇసుక కొట్టుకురావడంతో అవి కట్టగా ఏర్పడి వాహనదారులకు ఇబ్బందిగా ఉన్నాయి. అంతేకాకుండా దుమ్ము, ధూళితో అసౌకర్యంగా మారాయి. ద్విచక్ర వాహనదారులు ఒకానొక సందర్భంలో స్కిడ్ అయి పడిపోతున్నామని అంటున్నారు. ఇసుక మేటలను తొలగించాలని కోరుతున్నారు.

వేములవాడ: తప్పిన పెను ప్రమాదం.. ఊడిపోయిన టిప్పర్ టైర్లు

image

వేములవాడ పట్టణంలోని కోరుట్ల బస్టాండ్ ప్రధాన చౌరస్తా మూలమలుపు వద్ద బుధవారం ఉదయం బండల లోడ్‌తో వెళ్తున్న టిప్పర్ వెనుక టైర్లు ఒక్కసారిగా ఊడిపోయాయి. ప్రమాద సమయంలో టిప్పర్ దగ్గర ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీంతో కాసేపు ఆ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ ఎస్ఐ దిలీప్ ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.

News May 22, 2024

మెదక్: రాయారావు చెరువు సమీపంలో జంట హత్య

image

మెదక్ జిల్లా నర్సాపూర్ శివారులోని రామారావు చెరువు సమీపంలో జంట హత్య సంచలనం సృష్టించింది. గుర్తుతెలియని ఆడ, మగ వ్యక్తులను హత్య చేసిన గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి దహనం చేశారు. మృతదేహాలను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎక్కడో హత్య చేసి ఇక్కడ పెట్రోల్ పోసి దహనం చేసినట్టు అనుమానిస్తున్నారు.

News May 22, 2024

అచ్చంపేట: చెట్టు పై నుంచి కిందపడి వ్యక్తి మృతి

image

పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో బుధవారం ఓ ఇంటి వద్ద ఉన్న చెట్లను తొలగించేందుకు వెళ్ళిన రాములు(40) అనే వ్యక్తి చెట్టు పై నుంచి కాలుజారి కిందపడి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్ నిర్దారించారు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.