Telangana

News May 22, 2024

RR: చేవెళ్ల పార్లమెంట్ ఓటర్లకు ధన్యవాదాలు: కలెక్టర్

image

చేవెళ్ల పార్లమెంట్‌ ఎన్నికల్లో 16.57 లక్షల మంది ఓటు వేసి 56.40 ఓటింగ్ శాతం నమోదు చేయటం పట్ల రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంక సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల పార్లమెంటు ఓటర్లకు ధన్యవాదాలు తెలుపుతూ X వేదికగా ట్వీట్ చేశారు. 2019 ఎన్నికలతో పోలిస్తే 2024లో 3.58 లక్షల మంది అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకున్నట్లు తెలిపారు.

News May 22, 2024

FLASH: ఓయూ వీసీగా బాధ్యతలు స్వీకరించిన దాన కిషోర్

image

HYD ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి దాన కిషోర్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా ఇన్ని రోజులు కొనసాగిన ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం మంగళవారంతో ముగియడంతో తెలంగాణ ప్రభుత్వం దాన కిషోర్‌ను వీసీగా నియమించింది. ఈ మేరకు ఓయూ చేరుకున్న ఆయన వీసీగా బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలిపారు.

వరంగల్: పచ్చిరొట్ట విత్తనాల ధరలు ఖరారు

image

పచ్చిరొట్ట విత్తనాల ధరలను ఖరారు చేస్తూ రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వర్షాలు కురుస్తుండటంతో వ్యవసాయశాఖ అధికారులు ఈసారి ముందస్తుగా పచ్చిరొట్ట విత్తనాలు తెప్పించారు. జీలుగు విత్తనాలు 22,000 క్వింటాళ్లు, 450 క్వింటాళ్ల పిల్లిపెసర, 2,300 క్వింటాళ్ల జనుము విత్తనాలను సాగును అనుసరించి మండలాలకు కేటాయించారు. వీటిని 60 శాతం రాయితీపై రైతులకు ఇవ్వనున్నారు.

News May 22, 2024

HYD: సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలి: రాచకొండ సీపీ

image

రాచకొండ కమిషనరేట్ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించాలని సీపీ తరుణ్ జోషి సూచించారు. రూ.1.33 కోట్ల వ్యయంతో కొనుగోలు చేసిన 170 ట్యాబ్స్, 18 ల్యాప్ టాప్స్, 80 అధునాతన డిస్క్ టాప్‌లను స్టేషన్ హౌస్ అధికారులు, పెట్రోమొబైల్స్ సిబ్బందికి నేరేడ్‌మెట్‌లోని సీపీ కార్యాలయంలో అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు సత్వర సేవలు అందించే లక్ష్యంతో పని చేయాలన్నారు.

HYD: లాడ్జిలో బాలికపై యువకుడి అత్యాచారం

image

బాలికపై ఓ యువకుడు అత్యాచారం చేశాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సికింద్రాబాద్ తుకారంగేట్ PS పరిధిలో ఉండే బాలిక(16) తరచూ ఫోన్‌లో మాట్లాడుతుందని తల్లిదండ్రులు మందలించారు. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకెళ్లింది. రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా అదే సమయంలో బైక్ వస్తున్న సందీప్ రెడ్డి(28) ఆమెను ఆపాడు. మాయమాటలు చెప్పి బైక్ ఎక్కించుకుని కాచిగూడలోని ఓ లాడ్జికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. కేసు నమోదైంది.

HYD: ఆరు మార్గాల్లో నిర్మించనున్న మెట్రో రెండో దశ!

image

మెట్రో రెండో దశపై అడుగులు వేగంగా పడుతున్నాయి. ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే కార్యాచరణ ప్రారంభం కానుంది. HYDలోని 6 మార్గాల్లో నిర్మించనున్న మెట్రో రెండో దశపై సమగ్రమైన ప్రాజెక్టు నివేదికను సీఎం రేవంత్ రెడ్డికి అందజేయనున్నారు. జూన్‌లోనే DPR సిద్ధం చేయనున్నట్లు HMRL అధికారులు తెలిపారు. రెండో దశ మెట్రో నిర్మాణంలో భాగంగా మొదట ఎయిర్‌పోర్ట్ కారిడార్‌ను చేపట్టనున్నారు.