Telangana

News May 22, 2024

HYD: సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్ల గాలం.. జర జాగ్రత్త!

image

సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా యూజర్లను టార్గెట్ చేశారని, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, X వంటి వాటిల్లో ఫేక్ ప్రకటనలు పెట్టి గాలం వేసి, మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తాజాగా HYD నాంపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన రీల్స్ ఆధారంగా ఒక యాప్‌లో విడతల వారీగా రూ.33.26 లక్షల పెట్టుబడి పెట్టి, మోసపోయి HYD CCS పోలీసులను ఆశ్రయించాడు.

News May 22, 2024

HYD: సోషల్ మీడియాలో సైబర్ నేరగాళ్ల గాలం.. జర జాగ్రత్త!

image

సైబర్ నేరగాళ్లు సోషల్ మీడియా యూజర్లను టార్గెట్ చేశారని, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, X వంటి వాటిల్లో ఫేక్ ప్రకటనలు పెట్టి గాలం వేసి, మోసం చేస్తున్నారని పోలీసులు తెలిపారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. తాజాగా HYD నాంపల్లికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఇన్‌స్టాగ్రామ్‌లో వచ్చిన రీల్స్ ఆధారంగా ఒక యాప్‌లో విడతల వారీగా రూ.33.26 లక్షల పెట్టుబడి పెట్టి, మోసపోయి HYD CCS పోలీసులను ఆశ్రయించాడు.

News May 22, 2024

నాగార్జునసాగర్: బుద్ధ పూర్ణిమకు ముస్తాబు

image

బుద్ధుని జయంతిని పురస్కరించుకొని ఈనెల 23న జరుపుకోనున్న బుద్ధ పూర్ణిమకు నల్గొండ జిల్లా నాగార్జునసాగర్లోని బుద్ధవనం ముస్తాబైంది. ఇందుకు తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా బుద్ధవనంలోని మహాస్థూపంతో పాటు దారుల వెంట విద్యుత్ దీపాలను అలంకరించడంతో చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

News May 22, 2024

నాగర్‌ కర్నూల్: ఉరేసుకొని వ్యక్తి సూసైడ్

image

ఉరేసుకొని ఓ వృద్ధుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నాగర్‌ కర్నూల్ జిల్లా ఉప్పునుంతల మండల కేంద్రంలో మంగళవారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. మండల కేంద్రానికి చెందిన గంధం చంద్రయ్య (70) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చంద్రయ్య భార్య 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మరణించింది. అప్పటినుంచి మనస్తాపంతో ఉన్నాడని కుటుంబ సభ్యులు తెలిపారు. PSలో ఎవరూ ఫిర్యాదు చేయలేదు.

News May 22, 2024

ఆసిఫాబాద్ జిల్లాలో ఏడుగురిపై ACB కేసులు

image

ASF జిల్లాకు చెందిన ఏడుగురిపై ACB కేసులు నమోదు చేసింది. జిల్లాలో ఫోర్ వే విస్తరణలో భాగంగా భూములు కోల్పోయిన వారికి అందించే పరిహారం చెల్లింపుల్లో రూ.కోట్లల్లో అక్రమాలు జరిగినట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు RDO దత్తు, డిప్యూటీ తహశీల్దార్ నాగోరావు, మండల సర్వేయర్ భరత్‌, స్తిరాస్థి వ్యాపారస్తులైన శంభుదాస్, లక్ష్మీనారాయణ గౌడ్, తిరుపతితో పాటు పరిహారం పొంది తారాబాయిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

News May 22, 2024

సిద్దిపేట: భార్య గొంతుపై తొక్కి.. ప్రాణం తీసిన భర్త

image

భార్యను <<13285941>>హత్య <<>>చేసిన ఘటన HYDలోని ఉప్పల్‌ PS పరిధిలో జరిగింది. CI కథనం ప్రకారం.. జనగామకు చెందిన రమేశ్‌కు సిద్దిపేటకు చెందిన కమలతో వివాహమైంది. వీరు బ్యాంకు కాలనీలో ఉంటున్నారు. రమేశ్‌కు వివాహేతర సంబంధం ఉందనే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి కమలపై రమేశ్ దాడి చేసే క్రమంలో ఆమె కింద పడిపోయింది. దీంతో ఆమె గొంతుపై కాలుతో తొక్కి చంపేశాడు. అనంతరం ఉప్పల్‌ PSలో లొంగిపోయాడు.

News May 22, 2024

పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ

image

ఈ సెట్-2024 పరీక్ష ఫలితాల్లో వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపల్ డా. బైరి ప్రభాకర్ తెలిపారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో దీక్షిత్, వివేక్, హేమశ్రీ, నాగసాయి, యశ్వంత్, ఎలక్ట్రానిక్స్‌లో నవ్య, వైష్ణవ్, అర్షిత, హర్షిత, హారిక, సొహైల్, తదితర విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు.

News May 22, 2024

పిట్లంలో వ్యక్తి హత్య.. అతడి భార్యపై ఫిర్యాదు

image

ఓ వ్యక్తిని దారుణంగా <<13288336>>హత్య చేసిన<<>> ఘటన పిట్లం మండలం చిన్నకొడప్గల్‌లో జరిగిన విషయం తెలిసిందే. కృష్ణయ్య(40)ను సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు చిన్నకొడప్గల్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండరాయితో బాది, తల భాగాన్ని నుజ్జు నుజ్జు చేసి చంపినట్లు SI నీరేశ్ తెలిపారు. మృతుడి భార్య రుక్మిణిపై అనుమానం ఉందని అతడి అన్న కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.

News May 22, 2024

NLG: మరోసారి ‘సన్న’గా తెరపైకి!

image

వరి విత్తనాల్లో సన్న రకాల సాగు మరోసారి తెర పైకి వచ్చింది. గతంలో సన్నాల సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం ఒక్క సీజన్‌కు మాట మార్చింది. ఇప్పుడు మళ్లీ సన్నాల సాగుకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాటి కష్టాలు, జరిగిన నష్టాల అనుభవంతో ఉన్న రైతులు సన్నాల సాగంటే భయపడుతున్నారు. రూ.500 బోనస్ రావాలంటే సాగు చేయక తప్పదని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల సన్నాల సాగు చేస్తున్నారు.

News May 22, 2024

మానేరు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు

image

మానేరు నదిలో డిసిల్ట్రేషన్ పేరిట చేపట్టిన ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై సౌత్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. కరీంనగర్‌‌లో ప్రవహిస్తున్న మానేరు నదిలో ఇసుక తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధమని తెలిపింది. ఇరిగేషన్, మైనింగ్ విభాగాలకు రూ. 25 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానాను 3నెలలోగా గోదావరి రివర్ మేనేజెమెంట్ బోర్డు కు చెల్లించాలని,ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.