Telangana

News May 22, 2024

పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభ

image

ఈ సెట్-2024 పరీక్ష ఫలితాల్లో వరంగల్ పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రతిభ చూపినట్లు ప్రిన్సిపల్ డా. బైరి ప్రభాకర్ తెలిపారు. వివిధ ఇంజినీరింగ్ విభాగాల్లో రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించారన్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్‌లో దీక్షిత్, వివేక్, హేమశ్రీ, నాగసాయి, యశ్వంత్, ఎలక్ట్రానిక్స్‌లో నవ్య, వైష్ణవ్, అర్షిత, హర్షిత, హారిక, సొహైల్, తదితర విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు సాధించారన్నారు.

News May 22, 2024

పిట్లంలో వ్యక్తి హత్య.. అతడి భార్యపై ఫిర్యాదు

image

ఓ వ్యక్తిని దారుణంగా <<13288336>>హత్య చేసిన<<>> ఘటన పిట్లం మండలం చిన్నకొడప్గల్‌లో జరిగిన విషయం తెలిసిందే. కృష్ణయ్య(40)ను సోమవారం రాత్రి కొందరు వ్యక్తులు చిన్నకొడప్గల్ శివారు ప్రాంతానికి తీసుకెళ్లి తలపై బండరాయితో బాది, తల భాగాన్ని నుజ్జు నుజ్జు చేసి చంపినట్లు SI నీరేశ్ తెలిపారు. మృతుడి భార్య రుక్మిణిపై అనుమానం ఉందని అతడి అన్న కుమారుడు చంద్రశేఖర్ ఫిర్యాదు చేసినట్లు SI వెల్లడించారు.

News May 22, 2024

NLG: మరోసారి ‘సన్న’గా తెరపైకి!

image

వరి విత్తనాల్లో సన్న రకాల సాగు మరోసారి తెర పైకి వచ్చింది. గతంలో సన్నాల సాగు చేయాలని చెప్పిన ప్రభుత్వం ఒక్క సీజన్‌కు మాట మార్చింది. ఇప్పుడు మళ్లీ సన్నాల సాగుకు ఊతం ఇచ్చేలా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నాటి కష్టాలు, జరిగిన నష్టాల అనుభవంతో ఉన్న రైతులు సన్నాల సాగంటే భయపడుతున్నారు. రూ.500 బోనస్ రావాలంటే సాగు చేయక తప్పదని భావిస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల సన్నాల సాగు చేస్తున్నారు.

News May 22, 2024

మానేరు ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ సంచలన తీర్పు

image

మానేరు నదిలో డిసిల్ట్రేషన్ పేరిట చేపట్టిన ఇసుక తవ్వకాలపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై సౌత్ బెంచ్ సంచలన తీర్పునిచ్చింది. కరీంనగర్‌‌లో ప్రవహిస్తున్న మానేరు నదిలో ఇసుక తవ్వకాలు జరపడం చట్ట విరుద్ధమని తెలిపింది. ఇరిగేషన్, మైనింగ్ విభాగాలకు రూ. 25 కోట్ల జరిమానా విధించింది. ఈ జరిమానాను 3నెలలోగా గోదావరి రివర్ మేనేజెమెంట్ బోర్డు కు చెల్లించాలని,ఇసుక తవ్వకాలను నిలిపివేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

News May 22, 2024

నల్గొండ: నేడు ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారుల సదస్సు

image

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనపై చర్చించడానికి ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యవసాయ శాఖ ఏవో, ఏడిఏతో పాటు ఉద్యాపన శాఖ అధికారులతో నల్గొండలోని కలెక్టరేట్ కార్యాలయంలో బుధవారం సమావేశం ఏర్పాటు చేసినట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై చర్చించి అందరి అభిప్రాయాలను తీసుకుని ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

News May 22, 2024

తొర్రూరు: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

image

MHBD జిల్లా తొర్రూరు మండలం పత్తేపురం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై జగదీశ్ వివరాల మేరకు.. నర్సింహులపేట మండల పరిధి పత్ని తండాకు చెందిన బానోత్ భరత్(19), అతడి బావ గుగులోత్ రఘు బైకుపై HYD నుంచి తన గ్రామానికి వస్తున్నారు. ఈ క్రమంలో పత్తేపురం క్రాస్ రోడ్డు వద్ద వీరి బైకును గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో భరత్ అక్కడికక్కడే మృతి చెందాడు.

News May 22, 2024

MDK: కాంగ్రెస్ శనిలా దాపురించింది: వంటేరు

image

ఎన్నికల హామీలు అమలు చేయకుండా అన్ని వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్‌ సర్కార్.. రైతుల పాలిట శనిలా దాపురించిందని ఎఫ్‌డీసీ మాజీ ఛైర్మన్‌, BRS సీనియర్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి విమర్శించారు. సిద్దిపేట జిల్లా వర్గల్‌ మండలం మైలారంలో రైతులు, పార్టీ నాయకులతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలను భేషరతుగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.

News May 22, 2024

NLG: MLC ఎన్నికలు.. పోల్ చిట్టీల్లో తప్పులు

image

పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా HNRలో పంపిణీ చేసిన పోల్‌ చిట్టీల్లో పోలింగ్‌ కేంద్రం చిరునామాలో తెలుగు, ఆంగ్లంలో రెండు వేర్వేరు చిరునామాలు అచ్చు వేశారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. దీంతో అసలు తాము ఏ కేంద్రంలో ఓటు వేయాలా అనే గందరగోళంలో ఉన్నారు. అధికారులు మాత్రం బూత్‌ల వారీగా ఓటర్ల జాబితా చూసి సంబంధిత పోలింగ్‌ కేంద్రానికి పోవాలని సూచిస్తున్నట్లు తెలిసింది.

News May 22, 2024

కామారెడ్డి: లైంగిక వేధింపులు.. సూపరింటెండెంట్ సస్పెండ్

image

వైద్యాధికారిణులపై లైంగిక వేధింపుల వ్యవహారంలో కామారెడ్డి జిల్లా వైద్యశాఖ సూపరింటెండెంట్ శ్రీనివాస్‌నాయక్‌‌ను అధికారులు సస్పెండ్ చేశారు. ఆల్కహాల్ తాగి ఓ మండల వైద్యాధికారిణికి అసభ్య సందేశాలు పంపినట్లు విచారణలో తేలింది. దీంతో అతడిని విధుల నుంచి తప్పిస్తూ ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ఇటీవలే లైంగిక వేధింపుల కేసులో DMHO అరెస్ట్ అయిన విషయం తెలిసిందే.

News May 22, 2024

మంచిర్యాల: రవీంద్రభారతిలో 20 కోట్ల ఏళ్ల నాటి వృక్ష శిలాజం

image

20 కోట్ల ఏళ్ల నాటి అరుదైన వృక్ష శిలాజాన్ని రవీంద్రభారతిలో పొందుపరిచారు. రాష్ట్రానికి చెందిన పురాతత్వ పరిశోధకుడు సముద్రాల సునీల్ మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం సుంపుటం గ్రామ పరిధిలో దీన్ని కనుగొన్నారు. జురాసిక్, క్రిటిసియస్ కాలానికి చెందిన ఈ శిలాజం నాటి జీవ పరిణామ క్రమంలోని అనేక అంశాలకు సాక్ష్యాలుగా నిలుస్తుందని తెలిపారు. రవీంద్రనాథ్ ఠాగూర్ విగ్రహానికి ఇరువైపులా ఈ శిలాజాలను ఏర్పాటు చేశారు.