Telangana

News May 22, 2024

TOP 100 ఇంజినీరింగ్ కాలేజీలు మన HYDలో..!

image

HYD, RR, MDCL, VKB జిల్లాల్లో ఇంటర్మీడియట్ పూర్తై ఇంజినీరింగ్ ఎంట్రన్స్ పరీక్ష రాసిన విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఈమేరకు మన HYDలో TOP 100 ఇంజినీరింగ్ కాలేజీలు ఉన్నట్లు NIR వెల్లడించింది. దేశంలోనే IITH-18, IIIT HYD-55, HCU-71, JNTUH-83 ర్యాంకు సాధించాయి. టాప్ కాలేజీలలో అత్యుత్తమ ర్యాంకు వచ్చిన వారికి సీట్లు వచ్చే అవకాశం ఉన్నట్లు NIRF పేర్కొంది.

News May 22, 2024

తాగుడు పెంచాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయి: జూపల్లి

image

రాష్ట్రంలో తాగుడు పెంచాలని ప్రతిపక్షాలు కోరుకుంటున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. HYDలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం పాలసీలో ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, BRS పార్టీ నాయకులు ప్రభుత్వంపై లేనిపోని నిందలు వేస్తున్నారని విమర్శించారు. BRS మనుగడ ప్రశ్నార్థకంగా ఉన్నందున BRS నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ప్రభుత్వంపై విమర్శిస్తే ఊరుకోమన్నారు.

News May 22, 2024

సిద్దిపేట: మహిళా ఆరోగ్య కార్యకర్తలకు కీలక సూచనలు

image

జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న మహిళ ఆరోగ్య కార్యకర్తలకు ఆరోగ్య కార్యక్రమాలపై జిల్లా వైద్యాధికారి పుట్ల శ్రీనివాస్ సమీక్ష సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో ప్రజలకు సమయానుకూలంగా సేవలు అందించాలని ముఖ్యంగా గర్భిణి నమోదు, గర్భిణీ పరీక్షలు, ప్రమాదకర లక్షణాల గుర్తించి వారికి ప్రత్యేక సేవలు నిర్వహించాలని ఆదేశించారు.

News May 22, 2024

ఇన్‌ఛార్జి వీసీగా మంత్రి శ్రీధర్ బాబు సతీమణి

image

తెలంగాణలోని 10 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇన్‌ఛార్జి వీసీలను నియమించింది. వీసీలుగా సీనియర్‌ ఐఏఎస్ అధికారులను నియమిస్తూ మంగళవారం అధికారిక ఆదేశాలు జారీ చేసింది. కాగా లిస్టులో మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సతీమణి శైలజా రామయ్యర్ ఉన్నారు. సీనియర్ ఐఏఎస్ అయిన శైలజా రామయ్యర్‌ను పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయానికి వీసీగా ప్రభుత్వం నియమించింది.

News May 22, 2024

వనరులను కాపాడటానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించింది: బల్దియా కమిషనర్

image

హైదరాబాద్ తాజ్ కృష్ణ హోటల్లో రాష్ట్ర వ్యాప్త మున్సిపల్ కమిషనర్లు, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులతో సీడీఎంఏ ఆధ్వర్యంలో “లేక్ ప్రొటెక్షన్ అండ్ రెజువినేషన్ ఇన్ అర్బన్ ఏరియాస్” అనే అంశంపై వర్క్ షాప్ ఏర్పాటు చేశారు. ఈ వర్క్ షాప్‌లో బల్దియా కమిషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నీటి వనరులను కాపాడటానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించిందన్నారు.

News May 22, 2024

NLG: ఎమ్మెల్సీ ఓటర్లకు కలెక్టర్ సూచన

image

NLG- KMM- WGL శాసన మండలి పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా ఓటర్లు ఓటు వేసే సందర్భంగా చేయదగినవి, చేయకూడని అంశాలపై జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన వివరంగా తెలియజేశారు. ఓటర్లు వారు ఓటు వేసే అభ్యర్థికి ఎదురుగా బ్యాలెట్ పేపర్ తో పాటు ఎన్నికల సంఘం ద్వారా సరఫరా చేయబడిన వైలెట్ స్కెచ్ పెన్ ను మాత్రమే ఉపయోగించాలని తెలిపారు.

News May 22, 2024

నిధిమ్ లో అడ్మిషన్లు ప్రారంభం: కలెక్టర్ ప్రియాంక

image

నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ (నిధిమ్) ఆధ్వర్యంలో 2024 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సంస్థను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. 

News May 22, 2024

న్యూజెర్సీ సిటీలో ఆలయాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి

image

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అమెరికాలోని న్యూజెర్సీ సిటీలో స్వామినారాయణ్ ఆలయాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామి నారాయణ దేవాలయాన్ని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆర్మూర్ అసెంబ్లీ సెగ్మెంట్ స్వామి వారి ఆశీస్సులతో సర్వతోముఖాభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానన్నారు.

News May 21, 2024

HYD: పోలీసులపై గొడ్డలితో దాడి.. ముగ్గురు అరెస్టు

image

మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. మరో నిందితుడు పరారిలో ఉన్నట్లు తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో రెండు బైకులు ఢీకొనడంతో వాళ్ల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తుండగా ఆ వ్యక్తులు పోలీసులపై కత్తితో దాడి చేశారు.

News May 21, 2024

HYD: పోలీసులపై గొడ్డలితో దాడి.. ముగ్గురు అరెస్టు

image

మద్యం మత్తులో పోలీసులపై దాడికి పాల్పడిన ముగ్గురు నిందితులను పోలీసులు రిమాండుకు తరలించారు. మరో నిందితుడు పరారిలో ఉన్నట్లు తాండూరు రూరల్ సీఐ అశోక్ కుమార్ తెలిపారు. ముగ్గురు వ్యక్తులు ఓ ఫంక్షన్‌కు వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో రెండు బైకులు ఢీకొనడంతో వాళ్ల మధ్య ఘర్షణ జరిగింది. అక్కడే విధులు నిర్వహిస్తున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలిస్తుండగా ఆ వ్యక్తులు పోలీసులపై కత్తితో దాడి చేశారు.