Telangana

News May 21, 2024

పాలమూరులో జోరుగా బెట్టింగ్ !

image

మహబూబ్‌నగర్ లోక్ సభ ఫలితాలపై జోరుగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. జూన్ 4న విజేత ఎవరో తేలనుండగా.. ఈ ఎన్నికల ఫలితాలపై IPLకు దీటుగా బెట్టింగులు జోరందుకున్నాయి. ఈ దందాలో ఒక్కొక్కరు రూ. లక్షల మేర బెట్టింగ్ కాస్తున్నట్లు తెలిసింది. ప్రభుత్వ ఉద్యోగుల నుంచి వ్యాపారులు, యువత ఈ బెట్టింగ్‌పై దృష్టిపెట్టారు. గ్రౌండ్స్, టీ పాయింట్ల వద్ద నలుగురు కలిస్తే చాలు అభ్యర్థుల గెలుపోటములు, మెజార్టీలపైనే చర్చజరుగుతుంది.

News May 21, 2024

KPHB పీఎస్ పరిధిలో వివాహిత ఆత్మహత్య

image

మనస్తాపంతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన KPHB పీఎస్ పరిధిలో జరిగింది. స్థానికుల ప్రకారం.. మాధురి(32) అనే వివాహితకు 14 ఏళ్ల క్రితం శివార్పన్ అనే వ్యక్తితో పెళ్లయింది. ఏడాది క్రితం నుంచి రోడ్డు నెం.3లోని EWSలో ఉంటూ బ్యూటిషన్‌గా పనిచేస్తుంది. ఈ క్రమంలో విశ్వనాథరెడ్డి అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అయితే విశ్వనాథరెడ్డి చెప్పకుండా హాస్టల్ ఖాలీచేసి వెళ్లడంతో మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది.

News May 21, 2024

కౌంటింగ్ ప్రక్రియలో సూపర్వైజర్ల పాత్ర కీలకం: రాహుల్ రాజ్

image

కౌంటింగ్ ప్రక్రియ నిర్వహణలో సూపర్వైజర్ల పాత్ర కీలకమని కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. మంగళవారం సమీకృత కలెక్టరేట్ కార్యాలయ సమావేశ హాలులో ఏఆర్ఓలు రమాదేవి, శ్రీనివాస్, తూఫ్రాన్ ఆర్డిఓ జయచంద్రారెడ్డి, జిల్లా సైన్స్ ఆఫీసర్ రాజిరెడ్డి సంబంధిత అధికారులతో కలిసి కౌంటింగ్ సూపర్వైజర్స్, సూక్ష్మ పరిశీలకులకు మొదటి విడత శిక్షణా కార్యక్రమం ఏర్పాటు చేశారు.

News May 21, 2024

HYD: ఫెయిల్ అయిన వారికి పాఠాలు చెప్పరా?

image

HYD, RR, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల పరిధిలో మొత్తంగా పదవ తరగతిలో 19,114 మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఇందులో దాదాపుగా 5,153 మంది ప్రభుత్వ విద్యార్థులు ఉండటం గమనార్హం. జూన్ 3 నుంచి 13 వరకు సప్లమెంటరీ పరీక్షలు జరగనుండగా ఇప్పటి వరకు సర్కారు బడుల్లో ఫెయిల్ అయిన వారి కోసం ప్రత్యేక తరగతులు ప్రారంభించలేదు. మరి ఫెయిల్ అయిన వారిని పట్టించుకోరా..? అంటూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నించారు.

News May 21, 2024

కామారెడ్డి: కోడలు డెలివరీకి వచ్చి మామ ఆత్మహత్య

image

హైదరాబాద్ గాంధీనగర్​ PS పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SHO​ ​డి.రాజు కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి(మం) సంగోజివాడీ గ్రామానికి చెందిన గడ్డం శివరాజు(45) అనే రైతు ఈనెల15న కోడలు డెలివరీ కోసం కుమారుడు నితిన్‌‌తో కలిసి గాంధీ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చిన శివరాజు కృష్ణానగర్లో ఉరివేసుకొని విగత జీవిగా కనిపించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

నిర్మల్: ‘ఇక TSకు బదులుగా TG వాడండి’

image

TS స్థానంలో TGగా మార్చాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలు పేర్లలో TS బదులుగా TGగా మార్చాలని ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ సంస్థలన్నీ ఇకపై వాటి పేర్లను టీజీతో ప్రారంభమయ్యేలా మార్చుకోవాలని సూచించారు.

News May 21, 2024

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం – భారతి హోళీకేరి

image

తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోలీ కేరి పేర్కొన్నారు. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సందర్శించారు. ధాన్యం రవాణా చేసేందుకు అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ జయచంద్రారెడ్డి, తహసిల్దార్ విజయలక్ష్మి, రుక్మిణి పాల్గొన్నారు.

News May 21, 2024

భూగర్భ జలాలు పెంచేందుకు GHMC కొత్త ప్రాజెక్ట్

image

అమృత్ పథకంలో భాగంగా, పైలట్ ప్రాతిపదికన ‘షాలో అక్విఫర్ రీఛార్జ్’ పేరిట ప్రాజెక్ట్‌ను GHMC చేపట్టింది. ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి NIUA నోడల్ ఏజెన్సీ నగరంలో ఐదు మున్సిపల్ పార్కులను ఎంపిక చేసింది. 100-120 అడుగుల లోతు వరకు నిస్సారమైన నీటి ఇంజెక్షన్ బోర్‌వెల్‌లను డ్రిల్ చేయడం ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా వర్షపు నీటిని ఆదా చేయగలిగితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది.

News May 21, 2024

భూగర్భ జలాలు పెంచేందుకు GHMC కొత్త ప్రాజెక్ట్

image

అమృత్ పథకంలో భాగంగా, పైలట్ ప్రాతిపదికన ‘షాలో అక్విఫర్ రీఛార్జ్’ పేరిట ప్రాజెక్ట్‌ను GHMC చేపట్టింది. ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి NIUA నోడల్ ఏజెన్సీ నగరంలో ఐదు మున్సిపల్ పార్కులను ఎంపిక చేసింది. 100-120 అడుగుల లోతు వరకు నిస్సారమైన నీటి ఇంజెక్షన్ బోర్‌వెల్‌లను డ్రిల్ చేయడం ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా వర్షపు నీటిని ఆదా చేయగలిగితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది.

News May 21, 2024

HYD: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీ

image

HYD నగరంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీని ప్రభుత్వం నియమించింది. 1999 IAS బ్యాచ్ అధికారి అయిన రజ్వీ, గతంలో కృష్ణా జిల్లా, HYD జిల్లాల్లో కలెక్టర్, తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాక TRANSCO, GENCO విద్యుత్ సంస్థలకు ఎండీగా, రాష్ట్ర ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ విధుల్లో ఉన్న ఆయనను ప్రభుత్వం ఓపెన్ యూనివర్సిటీకి వీసీ బాధ్యతలను అప్పగించింది.