Telangana

News May 21, 2024

కామారెడ్డి: కోడలు డెలివరీకి వచ్చి మామ ఆత్మహత్య

image

హైదరాబాద్ గాంధీనగర్​ PS పరిధిలో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. SHO​ ​డి.రాజు కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా తాడ్వాయి(మం) సంగోజివాడీ గ్రామానికి చెందిన గడ్డం శివరాజు(45) అనే రైతు ఈనెల15న కోడలు డెలివరీ కోసం కుమారుడు నితిన్‌‌తో కలిసి గాంధీ ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చిన శివరాజు కృష్ణానగర్లో ఉరివేసుకొని విగత జీవిగా కనిపించాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

నిర్మల్: ‘ఇక TSకు బదులుగా TG వాడండి’

image

TS స్థానంలో TGగా మార్చాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్లు, ఏజెన్సీలు పేర్లలో TS బదులుగా TGగా మార్చాలని ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలోని పబ్లిక్ సెక్టార్ యూనిట్లు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్తి గల సంస్థలు, ప్రభుత్వ సంస్థలన్నీ ఇకపై వాటి పేర్లను టీజీతో ప్రారంభమయ్యేలా మార్చుకోవాలని సూచించారు.

News May 21, 2024

తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తాం – భారతి హోళీకేరి

image

తడిసిన ధాన్యం పూర్తిగా కొనుగోలు చేస్తామని మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోలీ కేరి పేర్కొన్నారు. తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి, మల్కాపూర్ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆమె సందర్శించారు. ధాన్యం రవాణా చేసేందుకు అవసరమైన లారీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, ఆర్డిఓ జయచంద్రారెడ్డి, తహసిల్దార్ విజయలక్ష్మి, రుక్మిణి పాల్గొన్నారు.

News May 21, 2024

భూగర్భ జలాలు పెంచేందుకు GHMC కొత్త ప్రాజెక్ట్

image

అమృత్ పథకంలో భాగంగా, పైలట్ ప్రాతిపదికన ‘షాలో అక్విఫర్ రీఛార్జ్’ పేరిట ప్రాజెక్ట్‌ను GHMC చేపట్టింది. ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి NIUA నోడల్ ఏజెన్సీ నగరంలో ఐదు మున్సిపల్ పార్కులను ఎంపిక చేసింది. 100-120 అడుగుల లోతు వరకు నిస్సారమైన నీటి ఇంజెక్షన్ బోర్‌వెల్‌లను డ్రిల్ చేయడం ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా వర్షపు నీటిని ఆదా చేయగలిగితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది.

News May 21, 2024

భూగర్భ జలాలు పెంచేందుకు GHMC కొత్త ప్రాజెక్ట్

image

అమృత్ పథకంలో భాగంగా, పైలట్ ప్రాతిపదికన ‘షాలో అక్విఫర్ రీఛార్జ్’ పేరిట ప్రాజెక్ట్‌ను GHMC చేపట్టింది. ప్రాజెక్ట్‌ను అమలు చేయడానికి NIUA నోడల్ ఏజెన్సీ నగరంలో ఐదు మున్సిపల్ పార్కులను ఎంపిక చేసింది. 100-120 అడుగుల లోతు వరకు నిస్సారమైన నీటి ఇంజెక్షన్ బోర్‌వెల్‌లను డ్రిల్ చేయడం ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. దీని ద్వారా వర్షపు నీటిని ఆదా చేయగలిగితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంటుంది.

News May 21, 2024

HYD: అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీ

image

HYD నగరంలోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వీసీగా రిజ్వీని ప్రభుత్వం నియమించింది. 1999 IAS బ్యాచ్ అధికారి అయిన రజ్వీ, గతంలో కృష్ణా జిల్లా, HYD జిల్లాల్లో కలెక్టర్, తెలంగాణ హెల్త్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించారు. అంతేకాక TRANSCO, GENCO విద్యుత్ సంస్థలకు ఎండీగా, రాష్ట్ర ఎనర్జీ డిపార్ట్‌మెంట్ సెక్రటరీ విధుల్లో ఉన్న ఆయనను ప్రభుత్వం ఓపెన్ యూనివర్సిటీకి వీసీ బాధ్యతలను అప్పగించింది.

News May 21, 2024

HYD: FINE ARTS యూనివర్సిటీ వీసీగా జయేష్ రంజన్

image

HYD నగరం మాసాబ్ ట్యాంక్ వద్ద ఉన్న జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వీసీగా జయేష్ రంజన్ నియమితులయ్యారు. 1992 IAS బ్యాచ్ అధికారి అయిన జయేశ్, అనేక ఉన్నత పదవులు చేపట్టి, జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. ప్రస్తుతం రాష్ట్ర ఇండస్ట్రీస్ అండ్ కామర్స్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయనను తాజాగా.. ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీగా వీసీగా ప్రభుత్వం నియమించింది.

News May 21, 2024

కేయూ ఇన్‌ఛార్జి వీసీ వాకాటి కరుణ ప్రస్థానం

image

కేయూ ఇన్‌ఛార్జి వీసీగా నియమితులైన సీనియర్ IAS అధికారి వాకాటి కరుణ ఒంగోలులో తొలి పోస్టింగ్ రావడంతో 3 నెలల పాటు విధులు నిర్వర్తించారు. అనంతరం WGL కలెక్టర్‌‌గా పని చేయడంతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ప్రస్తుతం మహిళా, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్ల విభాగంలో ప్రభుత్వ కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న కరుణకు కేయూ వీసీగా సర్కార్ అదనపు బాధ్యతలు అప్పగించింది.

News May 21, 2024

HYD: ఉస్మానియా యూనివర్సిటీ వీసీగా దానకిషోర్

image

HYD నగరంలోని ఉస్మానియా యూనివర్సిటీ నూతన వైస్ ఛాన్స్‌లర్ బాధ్యతలకు IAS దానకిషోర్ నియమించబడ్డారు. 1996 IAS బ్యాచ్ అధికారి అయిన దానకిషోర్, కర్నూలు జిల్లాలో కలెక్టర్ బాధ్యతలు చేపట్టారు. గత 20 సంవత్సరాల్లో దాదాపు 9 జిల్లాల్లో విధులు నిర్వర్తించారు. ఇటీవల HMWSSB ఎండి బాధ్యతల నుంచి మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రెటరీ బాధ్యతలు స్వీకరించారు. తాజాగా.. ప్రభుత్వం OU వీసీగా నియమించింది.

News May 21, 2024

HYD: JNTU వీసీగా బుర్రా వెంకటేశం

image

HYD నగరం కూకట్పల్లిలో JNTUH యూనివర్సిటీ వీసీగా బుర్రా వెంకటేశం నియమితులయ్యారు. 1995 IAS బ్యాచ్ అధికారి అయిన వెంకటేశం, జనగాం జిల్లాకు చెందినవారు. గతంలో మెదక్ జిల్లా కలెక్టర్ బాధ్యతలు సైతం నిర్వర్తించారు. జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం పొందారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రీ ఆర్గనైజేషన్ కమిటీలో కీలకపాత్ర పోషించారు. అనేక శాఖలకు సెక్రటరీ బాధ్యతలు నిర్వర్తించారు.