Telangana

News May 21, 2024

BREAKING.. WGL: ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

image

వరంగల్ నగరంలోని ఎనుమాముల ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది. మార్కెట్ సమీపంలో గల ముసలమ్మకుంట చెరువులో ఈతకు వెళ్లి విజయ్, ఆదామ్ అనే ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మృతులను దేశాయిపేటకు చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 21, 2024

ఎన్నికల తర్వాత చావు కబురు చల్లగా చెబుతున్నారు: ఏలేటి

image

కేవలం సన్నం వడ్లకే రూ. 500 బోనస్ ఇస్తామనడం దారుణమని రాష్ట్ర ప్రభుత్వంపై నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్ర ఉష్ణోగ్రతల దృష్ట్యా ఎక్కువగా పండేది దొడ్డుబియ్యమేనని ఆయన పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలో మాత్రమే సన్నబియ్యం పండిస్తారన్న ఆయన 30 జిల్లాలోని రైతులు దొడ్డు బియ్యం పండిస్తారని చెప్పారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ నేతలు చావుకబురు చల్లగా చెబుతున్నారని సెటైర్ వేశారు.

News May 21, 2024

HYD: పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌కి టిజెస్ మద్దతు

image

నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు టీజేఎస్ స్పష్టం చేసింది. ఈనెల 27న జరగనున్న వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసన మండలి ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మార్జు తెలిపారు.

News May 21, 2024

HYD: పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్‌కి టిజెస్ మద్దతు

image

నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తున్నట్లు టీజేఎస్ స్పష్టం చేసింది. ఈనెల 27న జరగనున్న వరంగల్-నల్గొండ-ఖమ్మం శాసన మండలి ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ.. తమ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ జన సమితి పార్టీకి లేఖ రాసిన నేపథ్యంలో మద్దతు ఇవ్వాలని ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. పార్టీ ప్రధాన కార్యదర్శి ధర్మార్జు తెలిపారు.

News May 21, 2024

పాలమూరు యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వీసీగా నదీం అహ్మద్

image

పాలమూరు యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ఐఏఎస్ నదీం అహ్మద్‌ను ప్రభుత్వం నియమించింది. ప్రస్తుత వీసీ లక్ష్మీకాంత్ రాథోడ్ పదవీకాలం నేటితో ముగిసింది. ఈ క్రమంలో వర్సిటీలో కార్యకలాపాలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఇన్‌ఛార్జీ వీసీగా నదీంను నియమిస్తూ సీఎస్ ఉత్తర్వులు ఇచ్చారు. కొత్త వీసీ నియామకం అయ్యేవరకు వీరే విధుల్లో ఉంటారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం యూనివర్సిటీలో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు.

News May 21, 2024

NZB: టీయూ ఇన్‌‌ఛార్జ్ వీసీగా సందీప్ సుల్తానియా

image

తెలంగాణ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జ్ వైస్ ఛాన్సలర్‌గా ఐఏఎస్ అధికారి సందీప్ కుమార్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది. గతంలో వీసీగా పనిచేసిన రవీందర్ గుప్తా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ విషయం తెలిసిందే.. అనంతరం వాకాటి కరుణా, బుర్ర వెంకటేశం ఇన్‌‌ఛార్జీలుగా పనిచేశారు. టీయూలో నెలకొన్న సమస్యలను నూతన ఇన్‌ఛార్జ్ వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు కోరుతున్నారు.

News May 21, 2024

శాతవాహన యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా సురేంద్రమోహన్

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా సురేంద్రమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీ పదవీ కాలం పూర్తి కావడంతో ఇన్‌ఛార్జిగా ఐఏఎస్ అధికారులను నియమించింది. కొత్త వీసీలు నియమితులు అయ్యే వరకు వీరే విధుల్లో కొనసాగనున్నారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం యూనివర్సిటీలో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు.

News May 21, 2024

KMR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామ శివారులోని జాతీయ రహదారి ప్రక్కన బారడి పోశమ్మ గుడి వెనకాల బోయిని కిష్ఠయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలి వద్దకు చేరుకున్నారు. అతని తలపై బలమైన గాయం ఉండడంతో మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యనా..? లేదా ఇంకేమైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

ఆందోల్: జీలుగు విత్తనాల కోసం క్యూలో పాస్ పుస్తకాలు, చెప్పులు

image

ఆందోల్ మండలం జోగిపేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ ముందు రైతులు జీలుగ విత్తనాల కోసం పట్టా పాసు బుక్కులు, చెప్పులను క్యూ లైన్‌లో పెట్టారు. పండించిన పంటను అమ్ముకోవడానికి ఒకవైపు వర్షంలో తడుస్తూ నానా తంటాలు పడుతుంటే.. మరో వైపు భూమి సారవంతం కావడానికి జీలుగు విత్తనాల కోసం అనేక పాట్లు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

News May 21, 2024

కేయూ ఇన్‌‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ

image

కాకతీయ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ప్రముఖ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను ప్రభుత్వం నియమించింది. కేయూలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఉన్న వీసీ తాటికొండ రమేశ్‌పై ప్రభుత్వం ఎంక్వయిరీకి ఆదేశించిన విషయం తెలిసిందే.