Telangana

News May 21, 2024

శాతవాహన యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా సురేంద్రమోహన్

image

కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీగా సురేంద్రమోహన్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఉన్న వీసీ పదవీ కాలం పూర్తి కావడంతో ఇన్‌ఛార్జిగా ఐఏఎస్ అధికారులను నియమించింది. కొత్త వీసీలు నియమితులు అయ్యే వరకు వీరే విధుల్లో కొనసాగనున్నారు. ఇప్పటికే కొత్త వీసీల కోసం యూనివర్సిటీలో సెర్చ్ కమిటీ ఏర్పాటు చేశారు.

News May 21, 2024

KMR: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం చిన్న కొడప్గల్ గ్రామ శివారులోని జాతీయ రహదారి ప్రక్కన బారడి పోశమ్మ గుడి వెనకాల బోయిని కిష్ఠయ్య అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలి వద్దకు చేరుకున్నారు. అతని తలపై బలమైన గాయం ఉండడంతో మృతి పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హత్యనా..? లేదా ఇంకేమైనా జరిగిందా..? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

ఆందోల్: జీలుగు విత్తనాల కోసం క్యూలో పాస్ పుస్తకాలు, చెప్పులు

image

ఆందోల్ మండలం జోగిపేట్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆఫీస్ ముందు రైతులు జీలుగ విత్తనాల కోసం పట్టా పాసు బుక్కులు, చెప్పులను క్యూ లైన్‌లో పెట్టారు. పండించిన పంటను అమ్ముకోవడానికి ఒకవైపు వర్షంలో తడుస్తూ నానా తంటాలు పడుతుంటే.. మరో వైపు భూమి సారవంతం కావడానికి జీలుగు విత్తనాల కోసం అనేక పాట్లు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

News May 21, 2024

కేయూ ఇన్‌‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ

image

కాకతీయ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ప్రముఖ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను ప్రభుత్వం నియమించింది. కేయూలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఉన్న వీసీ తాటికొండ రమేశ్‌పై ప్రభుత్వం ఎంక్వయిరీకి ఆదేశించిన విషయం తెలిసిందే.

News May 21, 2024

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వీసీగా నవీన్ విఠల్‌

image

మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా ఐఏఎస్ అధికారి నవీన్ విఠల్‌ని ప్రభుత్వం నియమించింది. MGUలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. ప్రస్తుత వీసీ గోపాల్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో ఇన్‌ఛార్జ్ వీసీగా నవీన్ విఠల్‌ని ప్రభుత్వం నియమించింది.

News May 21, 2024

కేయూ ఇన్‌‌ఛార్జి వీసీగా వాకాటి కరుణ

image

కాకతీయ యూనివర్సిటీ ఇన్‌‌ఛార్జి వైస్ ఛాన్సలర్‌గా సీనియర్ ఐఏఎస్ అధికారి వాకాటి కరుణను ప్రభుత్వం నియమించింది. కేయూలో నెలకొన్న దీర్ఘకాలిక సమస్యలను నూతన ఇన్‌ఛార్జి వీసీ పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు. గతంలో ఉన్న వీసీ తాటికొండ రమేశ్‌పై ప్రభుత్వం ఎంక్వయిరీకి ఆదేశించిన విషయం తెలిసిందే.

News May 21, 2024

పాలమూరులో శంకర్‌దాదాలు.. వైద్యశాఖపై విమర్శలు !

image

ఉమ్మడి జిల్లాలో వైద్యం పేరిట వ్యాపారం జోరుగా సాగుతోంది. అనుమతి లేని క్లినిక్స్‌, అర్హత లేకున్నా చికిత్స చేస్తూ రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. RMPలు, ANMలు చేస్తున అబార్షన్లతో ఇన్‌ఫెక్షన్లు, ఇతర సమస్యలతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్‌నగర్, భూత్పూర్, మిడ్డిల్ మండలాల్లో ఈ మధ్య జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనం. ఇంత జరుగుతున్నా జిల్లా వైద్యశాఖ చోద్యం చూస్తోందన్న విమర్శలు వస్తున్నాయి.

News May 21, 2024

HYD: మొబైల్ రికవరీలో తెలంగాణ రెండోవ స్థానం

image

సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2023 ఏప్రిల్‌ 19 నాటి నుంచి ఇప్పటి వరకు 30,049 ఫోన్లు రికవరీ చేసినట్టు అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్‌ యూనిట్లు ఉన్నాయన్నారు.

News May 21, 2024

HYD: మొబైల్ రికవరీలో తెలంగాణ రెండోవ స్థానం

image

సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ రెండో స్థానంలో నిలిచింది. 2023 ఏప్రిల్‌ 19 నాటి నుంచి ఇప్పటి వరకు 30,049 ఫోన్లు రికవరీ చేసినట్టు అదనపు డీజీ మహేశ్‌ భగవత్‌ తెలిపారు. హైదరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 4,869, సైబరాబాద్‌ పరిధిలో 3,078, రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 3,042 ఫోన్లు రికవరీ చేసినట్టు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 780 ఠాణాల్లో సీఈఐఆర్‌ యూనిట్లు ఉన్నాయన్నారు.

News May 21, 2024

రాజీవ్ గాంధీకి ఘన నివాళి అర్పించిన ఎంపీ అభ్యర్థి

image

ఉట్నూర్ మండలంలోని కాంగ్రెస్ క్యాంపు కార్యాలయంలో రాజీవ్ గాంధీ 33వ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె మాట్లాడుతూ.. త‌న వినూత్న ఆలోచ‌న‌ల‌తో పేద‌, బ‌డుగు బ‌ల‌హీన వ‌ర్గాలను ఆదుకునేలా అనేక‌ సంక్షేమ ప‌థ‌కాల‌తో దేశాన్ని కొత్త పుంత‌లు తొక్కించిన మహనీయుడు రాజీవ్ గాంధీ అని ఆయనను కొనియాడారు.