Telangana

News May 21, 2024

HYD: ‘నా భార్యను నేనే చంపాను’ 

image

HYD ఉప్పల్ పరిధి బ్యాంక్ కాలనీలో <<13285941>>భార్య కమలను భర్త రమేశ్ హత్య<<>> చేసిన విషయం తెలిసిందే.  పోలీసులు తెలిపిన వివరాలు.. మార్కెటింగ్ జాబ్ చేసే రమేశ్‌కు కమలతో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. కాగా భార్యపై అనుమానం పెంచుకున్న రమేశ్‌ అర్ధరాత్రి ఆమెతో గొడవకు దిగాడు. మాటామాట పెరిగి ఆమెపై దాడి చేసి, గొంతు నులిమి చంపేశాడు. తన భార్యను తానే చంపినట్లు పోలీసుల ముందు ఒప్పుకున్నాడు. 

వరంగల్: నేటి మిర్చి ధరల వివరాలు

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్లో మంగళవారం తేజ మిర్చి నాన్ ఏసీ క్వింటా రూ.19,200 ధర, ఏసీ తేజ మిర్చి రూ.20,000 ధర పలికింది. అలాగే 341 రకం ఏసీ మిర్చికి రూ.18, 000 ధర రాగా.. వండర్ హాట్ ఏసీ మిర్చికి సైతం రూ.18,700 ధర వచ్చింది. టమాటా రకం మిర్చి ఏసీ క్వింటాకు రూ.30 వేల ధర పలికింది. నిన్నటితో పోలిస్తే ఈరోజు మిర్చి ధరలు భారీగా పెరిగాయి.

News May 21, 2024

HYD: సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై వర్క్‌షాప్‌

image

పట్టణ ప్రాంతాల్లో సరస్సుల సంరక్షణ, పునరుజ్జీవనంపై ఈరోజు HYDలో వర్క్‌షాప్‌ నిర్వహించారు. కార్యక్రమంలో MA&UD ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ పాల్గొని మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లో సరస్సుల రక్షణ, పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ఆరోగ్యకరమైన సరస్సులు అనేక పర్యావరణ ప్రయోజనాలను అందించడమే కాకుండా, అవి మన జీవన నాణ్యతను ప్రభావితం చేస్తాయని, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తాయన్నారు.

NZB: పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్

image

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణలో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించాలని NZB జిల్లా ఇంటర్ విద్య అధికారి రవికుమార్ ఆదేశించారు. ఈ నెల 24 నుంచి పరీక్షలు ప్రారంభమవుతున్నట్లు తెలిపారు. జిల్లాలో38 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామని మొత్తం 18,288 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.

News May 21, 2024

గద్వాల: ఈసెట్ ఫలితాల్లో విద్యార్థికి స్టేట్ 3వ ర్యాంక్

image

ఈసెట్ ఫలితాల్లో నడిగడ్డ విద్యార్థి స్టేట్ 3వ ర్యాంక్ సాధించాడు. గద్వాల జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు కుమారుడు టి. రఘువరన్ సోమవారం విడుదలైన ఫలితాల్లో స్టేట్ మూడవ ర్యాంకు సాధించి తన ప్రతిభను చాటాడు. దీంతో నడిగడ్డ విద్యాభిమానులు విద్యార్థిని అభినందించారు. భవిష్యత్తులో ఉన్నత చదువులు చదివి అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

News May 21, 2024

HYD: తెలంగాణను నంబర్-1గా మారుస్తాం: మంత్రి

image

HYD హైటెక్స్ వద్ద జరిగిన ఓ సమావేశంలో మంత్రి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. RRR-రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో IGBC సంస్థ RRR (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) విధానం అమలు చేసేందుకు పని చేస్తున్నారన్నారు. మన అందరి లక్ష్యం RRR కావడం యాదృచ్ఛికం అని అన్నారు. రాష్ట్రంలో RRR నిర్మాణం, మూసీ ప్రక్షాళన, మౌలిక సదుపాయల కల్పనతో దేశంలో తెలంగాణను నంబర్-1గా మార్చుతామన్నారు.

హనుమకొండ: షార్ట్ సర్క్యూట్‌తో ఒకరు మృతి

image

షార్ట్ సర్క్యూట్‌తో ఒకరు మృతిచెందిన ఘటన హనుమకొండలోని సుబేదారిలో జరిగింది. సుబేదారీ ఎన్ఐటి జిమ్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. రాము, విష్ణు, సందీప్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.