Telangana

News May 21, 2024

HYD: తెలంగాణను నంబర్-1గా మారుస్తాం: మంత్రి

image

HYD హైటెక్స్ వద్ద జరిగిన ఓ సమావేశంలో మంత్రి వెంకటరెడ్డి పాల్గొని మాట్లాడారు. RRR-రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో IGBC సంస్థ RRR (రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్) విధానం అమలు చేసేందుకు పని చేస్తున్నారన్నారు. మన అందరి లక్ష్యం RRR కావడం యాదృచ్ఛికం అని అన్నారు. రాష్ట్రంలో RRR నిర్మాణం, మూసీ ప్రక్షాళన, మౌలిక సదుపాయల కల్పనతో దేశంలో తెలంగాణను నంబర్-1గా మార్చుతామన్నారు.

News May 21, 2024

హనుమకొండ: షార్ట్ సర్క్యూట్‌తో ఒకరు మృతి

image

షార్ట్ సర్క్యూట్‌తో ఒకరు మృతిచెందిన ఘటన హనుమకొండలోని సుబేదారిలో జరిగింది. సుబేదారీ ఎన్ఐటి జిమ్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ కావడంతో విజయ్ అనే వ్యక్తి మృతి చెందాడు. రాము, విష్ణు, సందీప్‌కు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే అంబులెన్స్ సమాచారం అందించారు. హుటాహుటిన వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

News May 21, 2024

MBNR: నేటితో ముగియనున్న పీయూ వీసీ పదవీకాలం

image

పాలమూరు యూనివర్సిటీ వైస్ కౌన్సిలర్ పదవీకాలం మంగళవారంతో ముగియనుంది. 2021 మే 21న లక్ష్మీకాంత్ రాథోడ్‌ను మూడేళ్ల పదవీ కాలానికి వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. మంగళవారంతో ఆయన పదవీకాలం ముగియనుండటంతో ఆయన OUకి తిరిగి వెళ్లనున్నారు. రాష్ట్రంలో ఏ యూనివర్సిటీకి ఇవ్వనన్ని నిధులను కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్ల బడ్జెట్ ను కేటాయించింది. దీంతో రాష్ట్రంలోనే పీయూ వీసీ పోస్టుకు పోటీ పెరిగింది.

News May 21, 2024

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో సోలార్ విద్యుత్

image

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునరాభివృద్ధి పనుల్లో వేగం పుంజుకుంది. ఫ్లాట్ ఫాం, స్టేషన్ బిల్డింగ్, సర్వీస్ బిల్డింగ్, రెసిడెన్షియల్ బిల్డింగ్, లెవెల్ క్రాసింగ్ పాయింట్ రూఫ్ పై సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసి కరెంటు ఉత్పత్తి చేయనున్నారు. ఈ నిర్మాణానికి ఎట్టకేలకు ముందడుగు పడింది. 1.782 మెగావాట్ల సోలార్ ప్యానల్స్ ప్రాజెక్టు కోసం అధికారులు టెండర్ జారీ చేశారు.

BREAKING: సికింద్రాబాద్: బొల్లారంలో విషాదం 

image

సికింద్రాబాద్ బొల్లారంలో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. స్థానికంగా నివాసం ఉండే దంపతులు రవీందర్, సరళాదేవి చికిత్స నిమిత్తం బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రికి వచ్చారు. ఈ క్రమంలో ఆస్పత్రి ముందున్న చెట్టు దంపతులపై పడింది. ప్రమాదంలో భర్త అక్కడికక్కడే మృతిచెందగా భార్యకు తీవ్రగాయాలవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళాదేవి టీచర్‌గా పనిచేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ: ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్

image

గిరిజన ఆచార వ్యవహారాలపై మక్కువ ఉన్న భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్ జైన్ కొద్ది రోజుల నుంచి ఆనపబుర్రను ఉపయోగించి అందులో నీటినే తాగుతున్నారు. పర్యటనలకు ఎటువెళ్లినా తన వాహనంలో దీనికి చోటు కల్పిస్తున్నారు. కార్యాలయంలో ఉన్నప్పుడూ ఇందులో నీటినే తాగుతున్నారు. పీవో గిరిజన సంప్రదాయాలను గౌరవిస్తుండటం విశేషం. ఆనపబుర్రలను ఆదివాసీలు ఇటీవల పీఓకు అందించినట్లు గిరిజన మ్యూజియం ఇంఛార్జి వీరాస్వామి మంగళవారం తెలిపారు.

News May 21, 2024

సత్తుపల్లిలో 11 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం

image

సత్తుపల్లిలో 11 నెలల బాలుడు కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపుతోంది. పాల్వంచకు చెందిన జంపన్న-దుర్గ దంపతులు సత్తుపల్లి గుడిపాడు రోడ్డులో గుడారం ఏర్పరచుకొని నివాసముంటున్నారు. కాగా రాత్రి నిద్రించే సమయంలో గుర్తుతెలియని దుండగులు వారి 11 నెలల బాలుడిని అపహరించారు. కొద్దిసేపటి తర్వాత లేచి చూడగా బాలుడు కనిపించకపోవడంతో పలుచోట్ల వెతికిన కూడా ఆచూకీ లభించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

News May 21, 2024

యాదాద్రి: చనిపోతూ ఆరుగురిని బతికించింది

image

తాను చనిపోతూ ఓ మహిళ ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూరుపేటలో అనారోగ్యం కారణంగా సుజాత మరణించింది. ఆమె అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆమె మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చినట్లైంది. తన గొప్ప మనస్సు చూసి ఆలేరువాసులు చలించిపోయారు.