Telangana

News May 21, 2024

సత్తుపల్లిలో 11 నెలల చిన్నారి కిడ్నాప్ కలకలం

image

సత్తుపల్లిలో 11 నెలల బాలుడు కిడ్నాప్ అయిన ఘటన కలకలం రేపుతోంది. పాల్వంచకు చెందిన జంపన్న-దుర్గ దంపతులు సత్తుపల్లి గుడిపాడు రోడ్డులో గుడారం ఏర్పరచుకొని నివాసముంటున్నారు. కాగా రాత్రి నిద్రించే సమయంలో గుర్తుతెలియని దుండగులు వారి 11 నెలల బాలుడిని అపహరించారు. కొద్దిసేపటి తర్వాత లేచి చూడగా బాలుడు కనిపించకపోవడంతో పలుచోట్ల వెతికిన కూడా ఆచూకీ లభించకపోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు.

News May 21, 2024

యాదాద్రి: చనిపోతూ ఆరుగురిని బతికించింది

image

తాను చనిపోతూ ఓ మహిళ ఆరుగురికి పునర్జన్మనిచ్చింది. వివరాలిలా.. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం బహదూరుపేటలో అనారోగ్యం కారణంగా సుజాత మరణించింది. ఆమె అవయవాలను దానం చేయడానికి కుటుంబ సభ్యులు ముందుకు వచ్చారు. దీంతో ఆమె మరో ఆరుగురికి పునర్జన్మనిచ్చినట్లైంది. తన గొప్ప మనస్సు చూసి ఆలేరువాసులు చలించిపోయారు.

News May 21, 2024

HYD: గోల్డెన్ జూబ్లీ భవనం.. ప్రారంభానికి మరింత సమయం

image

JNTUలో నూతనంగా నిర్మించిన గోల్డెన్ జూబ్లీ భవనం ప్రారంభానికి మరికొన్ని రోజులు ఆగాల్సిందే. మంగళవారంతో ప్రస్తుత VC కట్టా నరసింహారెడ్డి పదవీకాలం ముగియనుంది. ఆలోగా ఈభవనాన్ని ప్రారంభించాలన్న ఆలోచనతో గత వారం క్రితమే ప్రభుత్వానికి వర్సిటీ అధికారులు లేఖ రాశారు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాలేదు. ఇప్పటికీ కొన్ని పనులు భవనం లోపల కొనసాగుతుండటంతో ప్రారంభానికి మరి కొంత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నేటితో ముగియనున్న ఓయూ వీసీ పదవీకాలం

image

ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ పదవీకాలం నేటితో ముగియనుంది. మూడేళ్ల క్రితం వీసీగా పదవి బాధ్యతలు చేపట్టిన ఆయన క్యాంపస్‌లోని వైస్ ఛాన్సలర్ నివాసంలో ఉంటూ 21 పాయింట్ ఫార్ములాతో నిత్యం వర్సిటీ అభివృద్ధికి పాటుపడ్డారు. PHD విద్యార్థులకు వన్ టైమ్ ఛాన్స్ ఇచ్చి వందలాదిమంది పూర్వ విద్యార్థులకు డాక్టర్ డిగ్రీలను అందుకునేలా అవకాశం కల్పించారు. త్వరలో ఓయూకి కొత్త వీసీ రానున్నట్లు సమాచారం.

మోసపోయిన 11 మంది పాలమూరు న్యాయవాదులు

image

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన 11 మంది న్యాయవాదులు చార్ధామ్ యాత్రకు బయలుదేరారు. అయితే వీరు ముందస్తుగా ఆన్‌లైన్లో టికెట్లు బుక్ చేయించుకున్నారు. పవన్ హాండ్స్ అనే సంస్థ ద్వారా రూ.5,500 చెల్లించి ఫ్లైట్ టికెట్ బుక్ చేయించుకుని పాట్నాలో దిగారు. తీరా పాట్నాలో టికెట్లు ఫేక్ టికెట్లు‌గా అధికారులు చెప్పడంతో వీరంతా తమకు జరిగిన అన్యాయాన్ని గళమెత్తి ప్రశ్నించారు.

News May 21, 2024

HYD: రైలు ఎక్కుతుండగా కిందపడ్డ తండ్రి.. దూకేసిన కుమార్తెలు

image

రైలు నుంచి దూకేయడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. HYD కాచిగూడ రైల్వే ఠాణా పోలీసులు తెలిపిన వివరాలు.. కాచిగూడకి చెందిన రమేశ్ లింగంపల్లిలోని తన అన్న సాయి ఇంటికి వెళ్లడానికి కుమార్తెలు పూజ(15), విజయ(13), కుమారుడితోపాటు తన అన్న మనవరాళ్లతో కలిసి కాచిగూడ స్టేషన్‌కు వచ్చారు. తొలుత పిల్లలందరినీ ఎక్కించిన రమేశ్ కదులుతున్న రైలును ఎక్కబోతూ కిందపడ్డాడు. అనంతరం కుమార్తెలు కూడా దూకేయడంతో వారికి తీవ్ర గాయాలయ్యాయి.