Telangana

News May 21, 2024

NLG: 21.50 లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా

image

వానాకాలం వ్యవసాయ సీజన్ కు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు పంటల ప్రణాళికను ఇప్పటికే రూపొందించారు. మూడు జిల్లాల్లో మొత్తం 21.50లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేశారు. సీజన్ కు ముందే విత్తనాలు, ఎరువులను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నైరుతి రుతుపవనాలు ముందుగానే వస్తాయని వాతావరణశాఖ పేర్కొనడంతో… అందుకు అనుగుణంగా వ్యవసాయశాఖ సన్నద్ధమైంది.

News May 21, 2024

సిరిసిల్ల: మట్టిపెళ్లలు కూలి మహిళ మృతి

image

రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వెంకట్రావుపేటలో మంగళవారం ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధిహామీ పనుల్లో భాగంగా గుంతలు తవ్వుతుండగా ఒక్కసారిగా మట్టిపెళ్లలు కూలాయి. ఈ క్రమంలో మారుపాక రాజవ్వ (46)పై పెళ్లలు పడగా ఆమె మృతిచెందారు. మరోముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. వారిని సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రవణ్‌కు బెయిల్

image

సామాజిక మాధ్యమాల్లో పాత వీడియోలను వైరల్ చేసిన అభియోగంపై అరెస్టయిన బీజేపీ మల్కాజిగిరి డివిజన్ కార్పొరేటర్ వి.శ్రవణ్ కుమార్‌కు నాంపల్లిలోని న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. గత గురువారం ఆయన స్థానిక బీజేపీ కార్యాలయంలో ఉండగా మఫ్టీలో వచ్చిన పోలీసులు తీసుకువెళ్లిన విషయం విదితమే. అదే కేసులో ఆయనతో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

NLG: టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపులో గందరగోళం

image

ఉపాధ్యాయ నియామక, పదోన్నతుల కోసం విద్యాశాఖ అధికారులు నిర్వహించనున్న టెట్ పరీక్ష కేంద్రాల కేటాయింపు ఇబ్బందికరంగా మారుతోంది. పరీక్షా కేంద్రాలను అభ్యర్థులు కోరుకున్న విధంగా సొంత జిల్లాలకు కేటాయించాల్సి ఉన్నప్పటికీ.. హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం, సంగారెడ్డి, మల్కాజ్ గిరి, వరంగల్ జిల్లాలకు కేటాయించడంతో అభ్యర్థులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది.

News May 21, 2024

HYD: బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో 3, 5, 8వ తరగతుల ప్రవేశాలకు హైదరాబాద్‌కు చెందిన గిరిజన బాల బాలికల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆర్.కోటజీ తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో మొత్తం 41 సీట్లు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. ఈనెల 21 నుంచి జూన్ 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, ఫారంను HYD కలెక్టరేట్ గిరిజన కార్యాలయంలో సమర్పించాలన్నారు. 

News May 21, 2024

MBNR: రైతులకు అందుబాటులో మేఘదూత్ యాప్ 

image

రైతులు పంటలకు రసాయన ఎరువులు పిచికారీ చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లో పిచికారీ చేసి ఇంటికి వచ్చే సరికే వర్షం కురిసి మందులు వృథా అవుతుంటాయి. ఇలాంటి ఇబ్బందులను తొలగించేందుకే వాతావరణ శాఖ మేఘదూత్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ యాప్ ఎప్పటికప్పుడు వాతావరణ వివరాలు అందిస్తుంది. రాబోయే అయిదు రోజుల్లో వాతావరణ మార్పులు, వర్ష సూచన, ఆకాశం మేఘావృతం అవుతుందా? అనే సమాచారాన్ని ఈ యాప్ అందిస్తుంది.

News May 21, 2024

HYD: గాంధీ ఆస్పత్రిపై తప్పుడు ప్రచారం.. కేసు నమోదు

image

సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిపై సామాజిక మాధ్యమంలో తప్పుడు పోస్టు పెట్టిన ఓ వ్యక్తిపై చిలకలగూడ ఠాణాలో కేసు నమోదైంది. అధికారులు తెలిపిన వివరాలు.. గాంధీ ఆసుపత్రిలో కొద్ది గంటల పాటు కరెంట్ లేదని ఓ వీడియోను సోమవారం ట్విట్టర్‌లో పోస్టు చేశాడు. దీనిపై ఆరా తీసిన అధికారులు అది కొన్నేళ్ల కిందట తీసిన వీడియోగా గుర్తించారు. ఆసుపత్రి ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నం చేయడంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

NLG: ఎమ్మెల్సీ పోలింగ్‌కు చకచకా ఏర్పాట్లు

image

NLG – KMM- WGL పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ కు జిల్లా యంత్రాంగం సిద్ధమవుతోంది. ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. అందుకు ఇంకా వారం సమయం మాత్రమే ఉండటంతో అధికారులంతా పోలింగ్ ఏర్పాట్లలో తల మునకలయ్యారు. ఎన్నికల సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో పాటు పోలింగ్ బూత్ల ఏర్పాటు, జంబో పోలింగ్ బాక్సులు సమకూర్చడం, బ్యాలెట్ పేపర్ల ముద్రణ తదితర పనులు చేపడుతున్నారు.