Telangana

News January 20, 2026

NZB: మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి 7 రోజుల జైలు

image

మద్యం తాగి వాహనం నడిపిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష పడినట్లు ఐదో టౌన్ ఎస్‌ఐ గంగాధర్ మంగళవారం తెలిపారు. సోమవారం రాత్రి వర్ని చౌరస్తా వద్ద తనిఖీల్లో బీహార్‌కు చెందిన హీరాలాల్ యాదవ్ పట్టుబడగా, కోర్టు ఆయనకు జైలు శిక్ష విధించింది. ఆర్మూర్‌కు చెందిన నందుకు రూ. 10 వేల జరిమానా విధించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.

News January 20, 2026

మహబూబ్‌నగర్‌లో అగ్నిప్రమాదం

image

మహబూబ్‌నగర్ పట్టణంలోని పారిశ్రామిక వాడలో గల ఓ బెడ్ వర్క్స్‌లో మంగళవారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. పక్కనే గ్యాస్ సిలిండర్ల గోదాం ఉండటంతో ప్రమాద ముప్పు పొంచి ఉందని, ఆ బెడ్ వర్క్స్‌ను అక్కడి నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

News January 20, 2026

HYD శివారులో సంజీవని!

image

నగర శివార్లలోని పారిశ్రామిక ప్రాంతాల్లో నేల కలుషితమవుతున్న వేళ ‘మైకోరైజా’ అనే మేలు చేసే శిలీంధ్రాలు రైతులకు వరంగా మారనున్నాయి. ఈ ప్రత్యేక శిలీంధ్రాలు భూమిలోని పోషకాలను వేర్లకు అందించి, రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గిస్తాయి. హైదరాబాద్ కేంద్రంగా వీటి ఉత్పత్తి పెరగడం వల్ల తక్కువ ఖర్చుతోనే ఆరోగ్యకరమైన పంటలు పండించే అవకాశం లభిస్తుంది. దీంతో పర్యావరణాన్ని కాపాడుకుంటూ విషం లేని ఆహారాన్ని అందించనుంది.

News January 20, 2026

తూప్రాన్: యువతి ఆత్మహత్య

image

తూప్రాన్ మండలం నర్సంపల్లికి చెందిన గిరిజన యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నర్సంపల్లి గ్రామానికి చెందిన ధరావత్ మమత(18) ఈనెల 16న విష పదార్థం తిని ఆత్మహత్యకు పాల్పడింది. చికిత్స కోసం ఆస్పత్రికి తరలించగా లక్ష్మక్కపల్లి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు చెప్పారు. మమతకు ఇటీవల వివాహం కూడా నిశ్చయమైనట్లు సమాచారం.

News January 20, 2026

ఖైరతాబాద్ మైనారిటీ గురుకులాల్లో దరఖాస్తులకు ఆహ్వానం

image

స్థానిక మైనారిటీ గురుకుల పాఠశాల, కళాశాలలో 5వ తరగతి, ఇంటర్మీడియట్‌ ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ హబీబ్‌ తెలిపారు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్యతో పాటు వసతి, భోజనం, యూనిఫాం, పుస్తకాలు అందజేస్తామని పేర్కొన్నారు. అర్హులైన మైనారిటీ విద్యార్థులు నేరుగా కళాశాలకు వచ్చి సీట్లు రిజర్వు చేసుకోవచ్చని సూచించారు. ఇతర వివరాలకు 9182628275 నంబరును సంప్రదించాలని కోరారు.

News January 20, 2026

ఆదిలాబాద్: రేపు, ఎల్లుండి ఇంటర్ ప్రాక్టికల్స్

image

ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ ఈనెల 21, 22 తేదీల్లో నిర్వహించనున్నట్లు DIEO జాదవ్ గణేశ్ కుమార్ తెలిపారు. ఈనెల 23న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్, 24న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. కాగా, జిల్లాలోని 75 జూనియర్ కళాశాలలకు పరీక్షలకు సంబంధించిన మెటీరియల్‌ను పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఎగ్జామ్స్‌కు తప్పక హాజరయ్యేలా చూడాలని ప్రిన్సిపాళ్లను ఆదేశించారు.

News January 20, 2026

నిజామాబాద్‌లో నమోదైన ఉష్ణోగ్రతలు

image

నిజామాబాద్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలను అధికారులు వెల్లడించారు. సాలూరా 13.7°C, చిన్న మావంది 14.0°C, కల్దుర్కి 14.3°C, నిజామాబాద్ 14.7°C, మదనపల్లె 15.0°C, కోరాట్ పల్లి 15.0°C, డిచ్‌పల్లి 15.1°C, మెండోరా, గన్నారం 15.3°C, ఏర్గట్ల 15.4°C, నిజామాబాద్ నార్త్ 15.5°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

News January 20, 2026

KNR: ఎన్నికల విధులకు 12 మంది నోడల్ అధికారులు

image

కరీంనగర్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఎన్నికల ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు కలెక్టర్ పమేలా సత్పతి 12 మంది నోడల్ అధికారులను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్ కార్పొరేషన్‌తో పాటు హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో ఎన్నికల శిక్షణ, బ్యాలెట్ పేపర్ల ముద్రణ, మీడియా పర్యవేక్షణ వంటి కీలక బాధ్యతలను వీరికి అప్పగించారు.

News January 20, 2026

HYD: మల్లారెడ్డి కాలేజీలో గంజాయి కలకలం

image

మల్లారెడ్డి కాలేజ్‌కు చెందిన ఆరుగురు విద్యార్థులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు కిలోల గంజాయి, ఒకటిన్నర లీటర్ల హ్యాష్ ఆయిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు విద్యార్థులు మాదక ద్రవ్యాలు అమ్ముతుండగా, నలుగురు కొనుగోలు చేస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాలేజ్ నుంచి ఒడిశాకు వెళ్లి గంజాయి తీసుకొచ్చినట్లు విచారణలో వెల్లడైంది. మరో ఇద్దరు విద్యార్థులు పరారీలో ఉన్నారు.

News January 20, 2026

ఆదిలాబాద్: రూ.40 పెరిగిన పత్తి ధర

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో మంగళవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,700గా నిర్ణయించారు. సోమవారం ధరతో పోలిస్తే మంగళవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. ప్రైవేట్ ధర రూ.40 పెరిగినట్లు వెల్లడించారు.