Telangana

News May 21, 2024

NZB: ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకోవచ్చు

image

ప్రభుత్వం NZB జిల్లాలోని దివ్యాంగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ఎప్పుడైనా మీ సేవా కేంద్రాల్లో సదరం స్లాట్ బుక్ చేసుకోవచ్చు. ఇదివరకు ప్రతి నెలా 2, 4వ వారాల్లో సదరం శిబిరాలను ఏర్పాటు చేసి దానికి వారం ముందు టోకెన్లు జారీ చేసేవారు. ఇకపై సంవత్సరంలో ఎప్పుడైనా స్లాట్ బుక్ చేసుకునే వెసులు బాటు కల్పించింది. దరఖాస్తు దారుడి టోకెన్ నంబర్ బట్టి నిర్ణిత తేదీలో కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేసుకోవచ్చు.

News May 21, 2024

MGU: పరీక్షలు వాయిదా

image

ఈ నెల 27న జరగవలసిన డిగ్రీ 2, 3, సెమిస్టర్ల పరీక్షలను గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ డా.జి.ఉపేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయ పరిధిలో జరుగుతున్న డిగ్రీ పరీక్షలు ఎమ్మెల్సీ ఎన్నికల దృశ్యా తేదీలో స్వల్ప మార్పులు చేసినట్లు ఆయన తెలిపారు. 27న జరగవలసిన పరీక్షలు జూన్ 13న నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

News May 21, 2024

ఖమ్మం: హత్య కేసులో నిందితుడి అరెస్టు

image

తల్లాడ మండలం గోపాల పేటలో ఆస్తి కోసం కన్నతల్లిని, ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నిందితుడు వెంకటేశ్వర్లును పోలీసులు అరెస్టు చేసి న్యాయస్థానం ఎదుట హాజరుపరిచారు. వెంకటేశ్వర్లుతో పాటు ఆయనను హత్యలకు ప్రేరేపించిన రెండో భార్య త్రివేణిని కూడా పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

News May 21, 2024

మంచిర్యాల: రైలు ప్రమాదాల్లో 377 మంది మృతి

image

మంచిర్యాల జీఆర్పీ పోలీస్ స్టేషన్ పరిధిలో రైలు కింద పడి మృతి చెందుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. వివిధ కారణాలతో క్షణికావేశంలో ప్రతి ఏడాది వందల సంఖ్యలో నిండు ప్రాణాలు బలి తీసుకుంటున్నారు. 2022 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు 377 మంది రైలు పట్టాలపై ప్రాణాలు తీసుకున్నారు. కాగజ్‌నగర్, తాండూద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, పెద్దంపేట రైల్వే స్టేషన్ల మధ్య అధికంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

News May 21, 2024

HYD: అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త..!

image

HYD ఉప్పల్ పరిధి బ్యాంక్ కాలనీలో ఈరోజు దారుణ ఘటన వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. జనగామకు చెందిన రమేశ్, కమల(29) దంపతులు ఉప్పల్‌లో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెంచుకున్న రమేశ్ ఆమెను అర్ధరాత్రి చంపి PSలో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

HYD: పరీక్ష రాసిన 260 మంది అభ్యర్థులు

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సోమవారం ప్రారంభమైంది. నగరంలోని పరీక్ష కేంద్రాల వద్దకు అభ్యర్థులు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో రావడంతో సందడి కనిపించింది. తాగునీరు ఇతరత్రా సౌకర్యాలు కల్పించడంతో పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. హైదరాబాద్‌లో మొత్తం 387 మందికి 260 మంది పరీక్ష రాశారని విద్యాశాఖ అధికారులు తెలిపారు.

HYD: ఇంజినీరింగ్ పనుల కోసం రూ.57.23 కోట్లు విడుదల

image

నగరంలో చేపట్టే వివిధ ఇంజినీరింగ్ పనుల కోసం గతేడాది మే నెలకు సంబంధించిన రూ.57.23 కోట్ల బిల్లులను జీహెచ్ఎంసీ సోమవారం విడుదల చేసింది. మొత్తం రూ.1,300 కోట్ల బిల్లులను చెల్లించాల్సి ఉందని గుత్తేదారులు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు గుత్తేదారులతో చర్చించి మరికొంత సమయం కోరారు. తాత్కాలిక ఉపశమనంగా కొంత మొత్తాన్ని విడుదల చేశారు.