Telangana

News May 21, 2024

HYD: భర్తను వేధిస్తున్న భార్యపై కేసు నమోదు

image

భర్తను వేధిస్తూ టార్చర్ చేస్తున్న భార్యపై కేసు నమోదైంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాలు.. APఅమలాపురం వాసి టెమూజియన్ కుముజకు రాజోలు వాసి లక్ష్మీగౌతమితో ఏడేళ్ల క్రితం వివాహమైంది. వారు HYDఅల్వాల్‌లో వచ్చి ఉంటున్నారు. వీరికి ఐదేళ్ల కుమారుడు. భర్త మల్లారెడ్డి కాలేజీలో సహాయ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అత్తింటి ఆస్తుల కోసం ఆమె.. భర్త, అత్తమామలను వేధిస్తోంది. కత్తితో భర్తపై దాడి చేయగా కేసు నమోదైంది.

News May 21, 2024

జనగామ: రోడ్డు ప్రమాదంలో తోబుట్టువులు మృతి

image

ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు బ్రదర్స్ రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. జనగామ జిల్లా కొడకండ్ల మండలం రామవరానికి చెందిన మేటీ రాములు- రాజేశ్వరి దంపతుల కుమారులు శ్రవణ్ (29), శివ (27) హైదరాబాద్‌లోని శుభకార్యానికి వెళ్లారు. వారు బైకుపై ఫిర్జాదిగూడ నుంచి ఉప్పల్ వెళ్తున్న క్రమంలో యూటర్న్ తీసుకుంటుండగా.. ఇంతలో వేగంగా వచ్చిన బొలేరో వారి బైకును ఢీ కొంది. ఆ దీంతో బ్రదర్స్ అక్కడికక్కడే చనిపోయారు.

News May 21, 2024

నల్గొండ: అనుమానంతో భార్యను చంపాడు

image

భార్యపై అనుమానంతో భర్త కర్రతో చితక బాధడంతో తీవ్ర గాయాల పాలై మృతి చెందిన ఘటన తిప్పర్తి మండలం నూకలవారిగూడలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాగరాజు తన భార్య జ్యోతిపై అనుమానం పెంచుకున్నాడు. జ్యోతి పొలంలో గేదెలు మేపుతుండగా అక్కడికి వెళ్లిన నాగరాజు కర్రతో దాడి చేయగా ఆమె మృతిచెందింది. మృతురాలి తండ్రి స్వామి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

News May 21, 2024

MBNR: చెరువులో మహిళల మృతదేహాలు

image

కర్నూలు మండలం గార్గేయపురం నగరవనం <<13279503>>చెరువులో <<>>మృతి చెందిన మహిళల వివరాలు తెలిశాయి. పోలీసుల వివరాలు ప్రకారం.. MBNR జిల్లా కోయిలకొండ మండలం అభంగపట్నంకు చెందిన జానకిగా గుర్తించారు. మరొకరు అరుణగా గుర్తించిన కుటుంబ సభ్యుల వివరాలుపై స్పష్టత రాలేదు. కర్నూలు బస్టాండు పరిసరాల్లో వ్యభిచార వృత్తిలో ఉన్న మహిళలను విచారించడంతో వీరి వివరాలు వెలుగు చూశాయి. పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

News May 21, 2024

సిద్దిపేటలో గుర్తుతెలియని మృతదేహం

image

సిద్దిపేట పట్టణంలోని కోమటి చెరువులో సోమవారం గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. వ్యక్తి 40 నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు, తెల్లటి షర్ట్, నలుపు రంగు పాయింట్ ధరించారని తెలిపారు.

News May 21, 2024

కాగజ్‌నగర్‌లో యువకుడి దారుణ హత్య 

image

స్నేహితుడిని దారుణంగా హత్య చేసిన ఘటన కాగజ్‌నగర్‌లోని గన్నవరం గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన పలువురు యువకులు సోమవారం పార్టీ చేసుకున్నారు. మద్యం మత్తులో వారు గొడవ పడ్డారు. దీంతో నలుగురు యువకులు చంద్రశేఖర్‌(28)ను తలపై రాయితో కొట్టారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందినట్లు ఈజ్‌గాం SI రామన్ కుమార్ తెలిపారు. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.

News May 21, 2024

NZB: యువకుడిపై పోక్సో కేసు నమోదు

image

యువకుడిపై ఫోక్సో కేసు నమోదైన ఘటన నిజామాబాద్‌లోని మోపాల్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఓ యువకుడు అదే గ్రామానికి చెందిన బాలికకు మాయమాటలు చెప్పి ఆమెను తీసుకుని పరారయ్యాడు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేశారు. నాలుగు నెలల తర్వాత బాలిక ఆచూకీ కనుగొన్న పోలీసులు ఆమె గర్భం దాల్చడంతో యువకుడిపై పోక్సో, అట్రాసిటీ కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

News May 21, 2024

REWIND: వరంగల్‌లో స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్

image

WGL లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. 1 చోట బీఆర్ఎస్ విజయం సాధించింది. ఓవరాల్‌గా కాంగ్రెస్ 1,58,715 ఓట్ల మెజార్టీ సాధించగా.. బీఆర్ఎస్ 7,779 సాధించింది. కొన్నిచోట్ల మినహా చాలా చోట్ల బీజేపీ 3 స్థానానికి పరిమితమైంది. ప్రస్తుత ఓటింగ్ కలిసోస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే.. బీఆర్ఎస్, బీజేపీ మాత్రం రాజకీయ సమీకరణాలు మారాయని అంటున్నాయి.
– దీనిపై మీ కామెంట్

News May 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓వివిధ శాఖలపై ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశం ✓ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన ✓ఎమ్మెల్సీ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా ఎస్పీ అధికారులతో సమావేశం ✓పాలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం ✓సత్తుపల్లి మండలంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన ✓ఖమ్మం నగరంలో ఎంపీ వద్దిరాజు పర్యటన

News May 21, 2024

వరి కొయ్యలకు నిప్పు.. దిగుబడికి ముప్పు

image

వానాకాలం పంటల కోసం రైతులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి కొయ్యలకు నిప్పు పెడుతుండడంతో అటు పర్యావరణంతోపాటు, రాబోయే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. వరి కొయ్యలు కాల్చిన ప్రదేశంలో భూమి నీటిని కోల్పోయే గుణంతోపాటు, సేంద్రియ పదార్థాన్ని కోల్పోతుంది. ప్రత్యామ్నాయంగా జీలుగులు, పిల్లి పెసర వంటివి సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతందని ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.