Telangana

News May 21, 2024

HYD: ఆ హక్కు కాంగ్రెస్‌కు లేదు: కొండా విశ్వేశ్వర్ రెడ్డి 

image

రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్‌‌కు లేదని బీజేపీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. ఢిల్లీలో పార్లమెంట్‌ ఎన్నికల ప్రచారంలో సోమవారం కొండా మాట్లాడుతూ.. 31 శాతం దళితులే ఉన్న రాయ్‌బరేలి నియోజకర్గంలో స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఆ వర్గానికి కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వలేదన్నారు. దేశ రాజధాని ప్రజలంతా బీజేపీకే మరోసారి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు.

News May 21, 2024

పాలమూరు యూనివర్సిటీకి కొత్త VC!

image

సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలోని పీయూ వీసీ నియామకంపై ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చ నడుస్తోంది. అత్యధిక దరఖాస్తులు అందిన వర్సిటీల్లో పీయూ మూడో స్థానంలో ఉంది. బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీకి 208 దరఖాస్తులు, ఓయూకి 193, పీయూకి 159 దరఖాస్తులు అందాయి. నేటితో రాష్ట్రంలోని అన్ని వర్సిటీల వీసీల మూడేళ్ల పదవీ కాలం ముగుస్తుంది. ఈ నెలాఖరులోపు కొత్త వీసీల నియామకం పూర్తి చేయనున్నారు.

News May 21, 2024

హరీశ్ రావు VS మైనంపల్లి.. గెలిచేదెవరో?

image

లోక్‌సభ ఎన్నికల్లో మెదక్, జహీరాబాద్‌ స్థానాల్లో BRSను గెలిపించేందుకు హరీశ్‌రావు ముమ్మర ప్రచారం చేశారు. సభలు, రోడ్ షోలు, ర్యాలీలతో హోరెత్తించారు. మరోవైపు కాంగ్రెస్‌ను గెలిపించేందుకు మైనంపల్లి హనుమంతరావు సైతం రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహించారు. ఇప్పటికే సిద్దిపేట రాజకీయంపై కన్నేసిన మైనంపల్లి.. హరీశ్ రావుపై తన సత్తా చాటాలని చూస్తున్నారు. ఈక్రమంలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ఉత్కంఠ నెలకొంది. మీ కామెంట్?

News May 21, 2024

REWIND: కరీంనగర్‌లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ

image

KNR లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 4 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. 3 చోట్ల బీఆర్ఎస్ విజయం సాధించింది. ఓవరాల్‌గా కాంగ్రెస్ 1,03,729 మెజార్టీ సాధించగా.. బీఆర్ఎస్ 49,723 సాధించింది. KNR, HZB మినహా చాలా చోట్ల బీజేపీ 3 స్థానానికి పరిమితమైంది. ప్రస్తుత ఓటింగ్ తమకు కలుసొస్తుందనే కాంగ్రెస్ భావిస్తుంటే.. రాజకీయసమీకరణాలు మారాయని బీజేపీ, బీఆర్ఎస్ అంటున్నాయి.
-దీనిపై మీ కామెంట్

News May 21, 2024

ఆదిలాబాద్: 4 రోజులు కొనుగోలు బంద్

image

ఆదిలాబాద్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్ష సూచన మేరకు జిల్లాలో ప్రాథమిక సహకార సంఘాల ద్వారా మద్దతు ధరతో చేపడుతున్న జొన్నల కొనుగోలు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు మార్క్‌ఫెడ్ అధికారులు పేర్కొన్నారు. ఈ నెల 22 నుంచి 25 వరకు కొనుగోళ్లు నిలివేస్తున్నట్లు తెలిపారు. తిరిగి ఈ నెల 26 నుంచి కొనుగోళ్లు చేపడుతామని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లా రైతులు గమనించాలని సూచించారు.

News May 21, 2024

ట్యాంక్ బండ్‌ వద్ద పర్యాటకుల సందడి!

image

HYDలోని పర్యాటక ప్రదేశాలకు ఇటీవల ప్రజలు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే జూపార్కుకు 25,600 మంది వచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే రోజు ట్యాంక్ బండ్‌కు లక్ష మందికిపైగా రాగా 13,350 మంది బోటు షికారు చేసి గత రికార్డులన్నీ బద్దలుకొట్టారు. ఆ రోజు రూ.13.52 లక్షల ఆదాయం వచ్చిందని జి.ప్రభుదాస్ తెలిపారు. కొవిడ్ తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమమన్నారు. సోమవారం సాయంత్రం సైతం భారీగా జనం వచ్చారు.

News May 21, 2024

ట్యాంక్ బండ్‌ వద్ద పర్యాటకుల సందడి!

image

HYDలోని పర్యాటక ప్రదేశాలకు ఇటీవల ప్రజలు పోటెత్తుతున్నారు. ఆదివారం ఒక్కరోజే జూపార్కుకు 25,600 మంది వచ్చిన విషయం తెలిసిందే. ఇక అదే రోజు ట్యాంక్ బండ్‌కు లక్ష మందికిపైగా రాగా 13,350 మంది బోటు షికారు చేసి గత రికార్డులన్నీ బద్దలుకొట్టారు. ఆ రోజు రూ.13.52 లక్షల ఆదాయం వచ్చిందని జి.ప్రభుదాస్ తెలిపారు. కొవిడ్ తర్వాత ఇంత ఆదాయం రావడం ఇదే ప్రథమమన్నారు. సోమవారం సాయంత్రం సైతం భారీగా జనం వచ్చారు.

News May 21, 2024

బాన్సువాడలో జంట మృతదేహాల ఆచూకీ లభ్యం

image

బాన్సువాడ పట్టణంలో ఇటీవల గుర్తించిన అనుమానాస్పద గుర్తు తెలియని మృతదేహాల ఆచూకీ గుర్తించినట్లు సీఐ కృష్ణ తెలిపారు. వారిద్దరూ మద్నూర్ మండలంలోని హండేకేలూర్ గ్రామానికి చెందిన అక్కాతమ్ముడు లక్ష్మీ(35), సాయినాథ్(8)గా గుర్తించారు. అయితే వారు ఆత్మహత్యకు పాల్పడ్డారా? లేక ఎవరైనా హత్య చేశారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామని సీఐ పేర్కొన్నారు.

News May 21, 2024

నల్గొండ: పర్మిషన్ ఓ చోట, తవ్వేది మరో చోట

image

ప్రభుత్వం ఇసుక పాలసీపై స్పష్టమైన విధానాన్ని తీసుకురాకపోవడంతో కొన్ని చోట్ల పాత పద్ధతి ప్రకారం అధికారులు అనుమతులు ఇస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో శాలిగౌరారం మండలం వంగమర్తి నుంచి ఇసుక తవ్వకాలకు అనుమతులు ఇవ్వగా.. కాంట్రక్టర్ మాత్రం మూసీ అవతలి వైపు ఉన్న సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం పరిధిలో ఇసుక తవ్వకాలు చేస్తున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

News May 21, 2024

రేషన్ కార్డుల జారీపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

image

కొత్త రేషన్ కార్డుల జారీపై మంత్రి పొంగులేటి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే కొత్త రేషన్ కార్డులు ఇచ్చే ప్రక్రియ ప్రారంభమవుతుందని ప్రకటించారు. ఎన్నికల కోడ్ పూర్తైన వెంటనే దీనిపై న నిర్ణయం ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం ప్రకటించిన విధంగానే ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని, కొత్త రేషన్ కార్డుల జారీకి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామన్నారు.