Telangana

News May 21, 2024

మెదక్: బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

image

మెదక్ జిల్లాలో 2024 – 25 విద్యా సంవత్సరానికి గాను గిరిజన బాలబాలికల నుంచి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో ప్రవేశానికి దరఖాస్తులను చేసుకోవాలని జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి విజయలక్ష్మి కోరారు. 3, 5, 8వ తరగతులలో 25 సీట్లు ఖాళీగా ఉన్నాయని జూన్ 6లోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 12న కలెక్టరేట్ కార్యాలయంలో ఉదయం 11 గంటలకు డ్రా పద్ధతిన ఎంపిక నిర్వహిస్తున్నట్లు వివరించారు.

News May 21, 2024

MBNR: నాటే సమయం వచ్చింది.. కానీ మొక్కలేవీ.. ?

image

పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం నిర్వహణపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. లక్ష్యం మేరకు మొక్కలు సిద్ధం కాలేకపోతున్నాయి. ఎండల తీవ్రత, నీటి ఎద్దడి మూలంగా మొక్కల ఎదుగుదల కనిపించడంలేదు. సకాలంలో కలుపు తీయకపోవడమూ మరో కారణమని చెప్పవచ్చు. రూ.లక్షలు వెచ్చించి నర్సరీలు కొనసాగిస్తున్న ప్రయోజనం లేదని జిల్లావాసులు అంటున్నారు.

News May 21, 2024

MBNR: ‘ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలి’

image

ఈనెల 24 నుండి జూన్1 వరకు నిర్వహించనున్న ఇంటర్మీడియట్ సప్లమెంటరీ పరీక్షలలో విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సజావుగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి శ్రీధర్ సుమన్ సూచించారు. సోమవారం పరీక్షల నిర్వహణపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ.. పరీక్ష కేంద్రాల పరిధిలో 144 సెక్షన్‌తో పాటు, జిరాక్స్ సెంటర్లను మూసి ఉంచేలా ఉత్తర్వులు జారీ చేయాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు.

News May 21, 2024

సిరిసిల్ల: ‘ఈ నెల 25లోగా దరఖాస్తు చేసుకోండి’

image

26 జనవరి 2025 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఇచ్చే జాతీయ స్థాయి పద్మ అవార్డుల కోసం నైపుణ్యం కలిగిన చేనేత అనుబంధ కార్మికుల నుంచి దరఖాస్తులు కోరుతూ చేనేత, జౌళి శాఖ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. చేనేత కార్మికులు వారి వివరాలను http//padmaawards.gov.inలో నమోదు చేసుకోవాలని సూచించారు. ఆన్‌లైన్‌లో నమోదు చేసిన దరఖాస్తులను మాత్రమే ధృవీకరిస్తారని, మే 25లోగా జౌళి శాఖలో దరఖాస్తులు సమర్పించాలని అన్నారు.

News May 21, 2024

KNR: ఫైన్, ఆర్ట్స్ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

తంగళ్ళపల్లిలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల మహిళా ఫైన్ ఆర్ట్స్ డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ కె.రజిని తెలిపారు. 2024-25 విద్యా సం.నికి గాను BA హానర్స్ ఫ్యాషన్ డిజైన్, కొన్ని కోర్సులలో ప్రవేశాలకు ఉమ్మడి KNR జిల్లాలోని గిరిజన, గిరిజనేతర విద్యార్థినులు సంబంధిత పత్రాలతో ఈనెల 30లోపు కాలేజీలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

News May 21, 2024

విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకోవాలి: ఎస్పీ రితిరాజ్

image

విద్యార్థి దశ నుంచే జీవిత లక్ష్యాలను ఎంచుకొని ప్రణాళికతో చదువుతూ ముందుకు వెళ్లాలని గద్వాల జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పదవ తరగతి, ఇంటర్ పాసైన పోలీస్ సిబ్బంది, అధికారుల కుటుంబాలకు చెందిన పిల్లలతో సమావేశం నిర్వహించారు. జీవితంలో లక్ష్యసాధనకు అనుసరించాల్సిన విధివిధానాల గురించి వివరించారు. పలు మహనీయుల పుస్తకాలు అందజేశారు.

News May 21, 2024

HYD: స్కీముల పేరిట స్కాములు.. జాగ్రత్త!

image

HYD నగరంలో అధిక వడ్డీ ఆశ చూపి ప్రత్యేక స్కీముల పేరిట పెట్టుబడులను స్వీకరించి స్కాములతో ప్రజలను మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సీపీ తరుణ్ జోషీ ప్రజలను హెచ్చరించారు. పలు సంస్థలలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు, తక్కువ సమయంలో భారీగా లాభాలు పొందవచ్చని మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దన్నారు.

News May 21, 2024

HYD: స్కీముల పేరిట స్కాములు.. జాగ్రత్త!

image

HYD నగరంలో అధిక వడ్డీ ఆశ చూపి ప్రత్యేక స్కీముల పేరిట పెట్టుబడులను స్వీకరించి స్కాములతో ప్రజలను మోసం చేసే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని రాచకొండ కమిషనరేట్ సీపీ తరుణ్ జోషీ ప్రజలను హెచ్చరించారు. పలు సంస్థలలో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీతో పాటు, తక్కువ సమయంలో భారీగా లాభాలు పొందవచ్చని మాయమాటలు చెప్పే వారిని నమ్మొద్దన్నారు. 

News May 21, 2024

KNR: జూన్ మొదటి వారంలోగా పాఠ్యపుస్తకాలు!

image

వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు త్వరగా అందించేలా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మొత్తం 3,12,930 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి తెలిపింది. ఇప్పటివరకు 1,95,350 పాఠ్యపుస్తకాలు రాగా.. ఇంకా1,16,580 రావాల్సి ఉంది. పుస్తకాలు పక్కదారి పట్టకుండా వాటిపై వరుస నెంబర్లను ముద్రించారు. వీటి ఆధారంగా ఆయా పాఠశాలలకు పుస్తకాలు సరఫరా చేయనున్నారు.

News May 21, 2024

NRPT: వరి కొయ్యలకు నిప్పు  దిగుబడికి ముప్పు

image

వానాకాలం పంటల కోసం రైతులు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా వరి కొయ్యలకు నిప్పు పెడుతుండడంతో అటు పర్యావరణంతోపాటు, రాబోయే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుంది. వరి కొయ్యలు కాల్చిన ప్రదేశంలో భూమి నీటిని కోల్పోయే గుణంతోపాటు , సేంద్రియ పదార్థాన్ని కోల్పోతుంది. ప్రత్యామ్నాయంగా జీలుగా, పల్లి పెసర వంటివి సాగు చేయడం వల్ల భూసారం పెరుగుతందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు.