Telangana

News May 20, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి TOP NEWS

image

@ జగిత్యాల రూరల్ మండలంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్. @ సుల్తానాబాద్ మండలంలో విద్యుత్ షాక్ తగిలి 2 గేదెలు మృతి. @ కొడిమ్యాల మండలంలో కారు, బైకు డీ.. ఒకరికి తీవ్ర గాయాలు. @ చిగురు మామిడి మండలంలో హైనా దాడిలో దూడ మృతి. @ దళారులను నమ్మి నిరుద్యోగులు మోసపోవద్దన్న వేములవాడ డీఎస్పీ. @ ధర్మపురిలో వైభవంగా కొనసాగుతున్న లక్ష్మీనరసింహస్వామి నవరాత్రి ఉత్సవాలు.

News May 20, 2024

గత పది సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నా: మల్లన్న

image

తనపై ఎన్ని కేసులు పెట్టినా గత పది సంవత్సరాలుగా ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నానని కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న అన్నారు. ఇల్లందులో నిర్వహించిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో మల్లన్న పాల్గొన్నారు. తనని ఎమ్మెల్సీగా గెలిపిస్తే పట్టభద్రుల సమస్యల పరిష్కారమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తానని మల్లన్న హామీ ఇచ్చారు.

News May 20, 2024

పాలమూరు బిడ్డకు గోల్డ్ మెడల్.. అభినందించిన డీకే అరుణ

image

ఊట్కూర్ మండలం నిడుగుర్తి గ్రామానికి చెందిన గణేశ్ ఫిట్ ఇండియా ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన పరుగు పందెంలో గోల్డ్ మెడల్ సాధించాడు. దీంతో మహబూబ్ నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సోమవారం గణేశ్‌ను ఓ ప్రకటనలో అభినందించారు. పరుగు పందెంలో ప్రతిభ చూపి గోల్డ్ మెడల్ సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకొచ్చారని చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

News May 20, 2024

మెదక్: రైతులు అధైర్యపడొద్దు: భారతి హోలికేరి

image

నష్టపోయిన రైతులు అధైర్యపడొద్దని మెదక్ జిల్లా ప్రత్యేక అధికారి భారతి హోలికేరి అన్నారు. కొనుగోలు కేంద్రాల సమస్యలపై సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఆమె పాల్గొన్నారు. రైతులకు ఇబ్బందుల్లేకుండా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించి ఎగుమతి, దిగుమతి, మిల్లింగ్ స్టోరేజ్ కెపాసిటీ సమస్యల పరిష్కారంపై అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు.

News May 20, 2024

నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటాం: పొంగులేటి

image

తెలంగాణలో నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హెచ్చరించారు. నకిలీ విత్తనాలపై రైతులకు అవగాహన కల్పిస్తామని తెలిపారు. రైతులెవరూ నకిలీ ఎరువులు కొని మోసపోవద్దని సూచించారు. త్వరలో స్కూళ్లు కూడా ఓపెన్ కాబోతున్నాయని వాటి కోసం ముందస్తుగానే రూ.120కోట్లు కేటాయించామన్నారు.

News May 20, 2024

ఆదిలాబాద్: ఓపెన్ యూనివర్సిటీ RESULT OUT

image

డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ మూడవ సంవత్సరం ఐదో సెమిస్టర్ పరీక్షల ఫలితాలు విడుదలైనట్లు యూనివర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ టి. ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. ఫిబ్రవరి నెలలో విద్యార్థులు పరీక్షలు రాయగా సోమవారం ఫలితాలు విడుదల అయినట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం https://www.braouonline.in/CBCS_Result/Login.aspx# వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు.

News May 20, 2024

నల్గొండ: EAPCET ఫెయిల్.. విద్యార్థి సూసైడ్

image

ఇంటర్ విద్యార్థి ఉరేసుకొని సూసైడ్ చేసుకున్న ఘటన కనగల్‌ మండలంలో వెలుగుచూసింది. SI రామకృష్ణ గౌడ్ తెలిపిన వివరాలు.. కనగల్‌కు చెందిన సత్తయ్య కుమారుడు నర్సింగ్ నితిన్(18) నల్గొండలోని ఓ ప్రైవేట్ కాలేజ్‌లో ఇంటర్ పూర్తి చేసి EAPCET రాశాడు. కాగా ఇటీవల విడుదలైన EAP సెట్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన నితిన్ ఆదివారం రాత్రి ఇంట్లో అందరు పడుకున్న సమయంలో ఉరేసుకున్నాడు. ఘటనపై కేసు నమోదైంది.

News May 20, 2024

ఖమ్మం: గెలుపు ధీమాలో కాంగ్రెస్..!

image

నల్గొండ – ఖమ్మం – వరంగల్‌ ‌పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుస్తామని కాంగ్రెస్ ధీమాతో ఉంది. గతంలో ఈ స్థానం నుంచి గెలవకపోవడంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మల్లన్న గెలుపు కోసం శ్రమిస్తున్నారు. తద్వారా గెలుపు ఈజీ అవుతుందని కాంగ్రెస్ శ్రేణులు భావిస్తున్నాయి.

News May 20, 2024

MBNR: రెమ్యూనరేషన్లు విడుదల చేయాలని వినతి

image

MBNR: ఫిబ్రవరిలో జరిగిన ఇంటర్ ప్రయోగ పరీక్షలు, మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యూనరేషన్లు విడుదల చేయాలని జూనియర్ అధ్యాపకుల సంఘం నేతలు సురేష్, శ్రీనివాస్ విద్యా కార్యదర్శి వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు ఇంటర్ పరీక్షల విభాగం అధికారి జయప్రదకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

News May 20, 2024

కరీంనగర్‌లో ఫ్లెక్సీ కలకలం.. ఏకంగా చెప్పుల దండేశారు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్‌హౌస్ ఎదుట వెలిసిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకే నాయకులారా ఖబడ్దార్..’ అని ఆ ఫ్లెక్సీపై రాసి ఉంది. దానికి చెప్పుల దండ వేసి ఉంది. ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు. తరచూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న నాయకులను టార్గెట్ చేసి దీన్ని ఏర్పాటు చేశారు.