Telangana

News May 20, 2024

MBNR: రెమ్యూనరేషన్లు విడుదల చేయాలని వినతి

image

MBNR: ఫిబ్రవరిలో జరిగిన ఇంటర్ ప్రయోగ పరీక్షలు, మార్చిలో నిర్వహించిన వార్షిక పరీక్షల విధుల్లో పాల్గొన్న సిబ్బందికి రెమ్యూనరేషన్లు విడుదల చేయాలని జూనియర్ అధ్యాపకుల సంఘం నేతలు సురేష్, శ్రీనివాస్ విద్యా కార్యదర్శి వెంకటేశంకు వినతిపత్రం సమర్పించారు. అంతకు ముందు ఇంటర్ పరీక్షల విభాగం అధికారి జయప్రదకు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అధికారులు సానుకూలంగా స్పందించారని తెలిపారు.

News May 20, 2024

కరీంనగర్‌లో ఫ్లెక్సీ కలకలం.. ఏకంగా చెప్పుల దండేశారు

image

కరీంనగర్ జిల్లా కేంద్రంలోని R&B గెస్ట్‌హౌస్ ఎదుట వెలిసిన ఓ ఫ్లెక్సీ కలకలం రేపింది. ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి దూకే నాయకులారా ఖబడ్దార్..’ అని ఆ ఫ్లెక్సీపై రాసి ఉంది. దానికి చెప్పుల దండ వేసి ఉంది. ఈ ఫ్లెక్సీకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. ఎవరు ఏర్పాటు చేశారనేది మాత్రం తెలియరాలేదు. తరచూ పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న నాయకులను టార్గెట్ చేసి దీన్ని ఏర్పాటు చేశారు.

News May 20, 2024

ఏడుపాయల హుండీ ఆదాయం రూ.47.50 లక్షలు

image

మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల శ్రీ వన దుర్గాభవానీ మాతా ఆలయం హుండీ ఆదాయం రూ.47,50,681 వచ్చినట్లు ఈవో మోహన్ రెడ్డి, ఛైర్మన్ సాతెల్లి బాలాగౌడ్ తెలిపారు. సోమవారం దేవాదాయ, ధర్మాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శివరాజ్, ఇన్స్పెక్టర్ రంగారావు సమక్షంలో భ్రమరాంభిక సేవా సమితి సభ్యుల ఆధ్వర్యంలో గోకుల్ షెడ్‌లో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు.

News May 20, 2024

HYD: రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి ఓ అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశలో కదిలి ఈనెల 24 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

News May 20, 2024

నల్గొండ: బెస్ట్ అవైలబుల్ స్కీం.. 114 సీట్లు మంజూరు

image

2024-25 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పథకం కింద జిల్లాకు 114 సీట్లు మంజూరైనట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. 103 సీట్లు ST ఉపకులాలకు, 11 సీట్లు PTG (చెంచు) కులముల వారికి కేటాయించడం జరిగినది. మొత్తం సీట్లలో 33% బాలికలకు కేటాయిస్తూ (3వ తరగతి వారికి 50%) (5వ తరగతి వారికి 25%), (8వ తరగతికి 25%) సీట్లను తరగతి వారీగా కేటాయించినట్లు తెలిపారు.

News May 20, 2024

HYD: రానున్న మూడు రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

బంగాళాఖాతంలో ఈనెల 22 నాటికి ఓ అల్ప పీడనం ఏర్పడే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇది వాయువ్య దిశలో కదిలి ఈనెల 24 నాటికి మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40కి.మీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు.

News May 20, 2024

HYD: ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

image

హీరో ఎన్టీఆర్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారం అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకోవాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

News May 20, 2024

HYD: ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

image

తెలుగు హీరో ఎన్టీఆర్‌కు జనసేనాని పవన్ కల్యాణ్ బర్త్ డే విషెస్ తెలిపారు. ‘ప్రముఖ కథానాయకుడు ఎన్టీఆర్‌కు నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ఆస్కార్ పురస్కారాలు అందుకున్న ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో సినీ ప్రియుల మెప్పు పొందారు. తనదైన అభినయం, నృత్యంతో ప్రేక్షకుల అభిమానాన్ని దక్కించుకున్న ఎన్టీఆర్ మరిన్ని విజయాలు అందుకోవాలి’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు.

News May 20, 2024

నిజామాబాద్: ట్రాక్టర్, బైకు ఢీ.. ఒకరు మృతి

image

ట్రాక్టర్ ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన ముప్కాల్ మండలం రెంజర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల వద్ద సోమవారం చోటుచేసుకుంది. ఏనుగందుల లక్ష్మణ్(30), సునీల్ బైకుపై వెళ్తూ ట్రాక్టర్‌ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో లక్ష్మణ్ అక్కడికక్కడే మృతిచెందగా.. సునీల్ పరిస్థితి విషమంగా ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 20, 2024

సిరిసిల్ల: 2 నెలల్లో 17 లక్షల పైచిలుకు బీర్లు తాగేశారు!

image

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా సిరిసిల్ల జిల్లాలో రూ.85.22 కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు ఆబ్కారీ శాఖ అధికారుల లెక్కలు చెబుతున్నాయి. మార్చి 16న కోడ్ ప్రారంభం కాగా.. మే 17 వరకు (2నెలల్లో) 1,45,228 కేస్‌ల బీర్లు, 76,943 కేస్‌ల మద్యం అమ్మకాలు జరిగాయి. కేస్‌లో 12 సీసాలుంటాయి. ఎండల తీవ్రత దృష్ట్యా మద్యం కంటే చల్లని బీర్లకే మందుబాబులు మొగ్గు చూపారు. కోడ్ ఉన్నప్పటికీ JAN, FEB మాదిరిగానే విక్రయాలు సాగాయి.