Telangana

News May 20, 2024

కోటపల్లి: పట్టుబడిన అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లు

image

మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని రాపన్‌ పల్లి, సిరోంచ వంతెన చెక్‌పోస్టు వద్ద సోమవారం అంతర్ రాష్ట్ర చిరుతపులి చర్మ స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలో చిరుతపులి చర్మం తరలిస్తున్న దుర్గం పవన్‌, బాబర్ ఖాన్‌ను పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి చిరుతపులి చర్మంతో పాటు రెండు మోటారు సైకిళ్లు, రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

News May 20, 2024

తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాడు: జగదీష్

image

నకిరేకల్‌లో నేడు నియోజకవర్గ స్థాయి పట్టభద్రుల సమావేశంలో MLA జగదీష్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. తీన్మార్ మల్లన్న బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తాడని అన్నారు. అలాంటి వారిని చట్టసభల్లోకి పంపిస్తే ఎలా ఉంటుందో పట్టభద్రులంతా ఆలోచించాలని పేర్కొన్నారు. కాంగ్రెస్, బీజేపీకి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని.. BRS MLC అభ్యర్థి రాకేష్‌ రెడ్డికి పట్టభద్రులంతా తోడుగా నిలవాలన్నారు.

News May 20, 2024

వరంగల్ నగరంలో బుల్లితెర నటి నవీన సందడి

image

ప్రముఖ బుల్లితెర నటి నవీన (సుమంగళి) ఈరోజు వరంగల్ నగరంలో సందడి చేశారు. వరంగల్ లో ఎంతో ప్రసిద్ధి చెందిన వేయిస్తంభాల గుడి, భద్రకాళి అమ్మవారి గుడిని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె ఆలయాల్లో దేవుళ్లను దర్శించుకుని, పూజలు నిర్వహించారు. పలువురు భక్తులు ఆమెతో సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం ఊహలు గుస గుస లాడే, గువ్వ గోరింక, చెల్లెలి కాపురం వంటి సీరియల్స్‌లో నటిస్తున్నట్లు ఆమె తెలిపారు.

News May 20, 2024

అలంపూర్: దక్షిణ కాశీలో 21న శ్రీగిరి ప్రదక్షిణలు

image

శ్రీశైల మహా క్షేత్రానికి పశ్చిమ ద్వార క్షేత్రమైన అలంపురం పుణ్యక్షేత్రంలో ఈనెల 21న శ్రీశైలం దేవస్థానం వారు శ్రీగిరి ప్రదక్షణలు నిర్వహిస్తున్నట్లు అలంపురం దేవస్థానం కార్యాలయం తెలిపింది. ఈ మేరకు శ్రీశైలం దేవస్థానం వారు శ్రీశైలానికి తూర్పున త్రిపురాంతకం, ఉత్తరాన ఉమామహేశ్వరం, దక్షిణాన సిద్ధవటం, పశ్చిమాన అలంపురం.. ఇలా నాలుగు దిక్కుల శ్రీగిరి ప్రదక్షిణలు నిర్వహిస్తారని తెలిపారు.

News May 20, 2024

తెలంగాణలోనే GHMC టాప్.. తగ్గేదేలే!

image

రాష్ట్రంలో TS-bPASS అమలులోకి వచ్చిన NOV 2020 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన భవన నిర్మాణాల్లో GHMC టాప్ ప్లేస్‌లో నిలిచింది. GHMC పరిధిలో 36,057 భవనాలకు అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బడంగ్‌పేట్ కార్పొరేషన్ 9,241 నిర్మాణాలతో థర్డ్ ప్లేస్‌లో ఉంది. తుర్కయంజాల్‌లో 5,526, బోడుప్పల్‌లో 5,419 నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. భవన నిర్మాణ రంగంలో జీహెచ్ఎంసీ దూసుకెళ్తుందని పేర్కొంది.

News May 20, 2024

MBNR: ఉదయం ఎండ, సాయంత్రం వర్షం.. రైతుల అవస్థలు

image

నాలుగు రోజుల్లో ఉమ్మడి జిల్లాలో పలు ప్రాంతాల్లో ఉదయం ఎండ, సాయంత్రం వర్షం కురుస్తుండటంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వరి ధాన్యం రోడ్లపై ఆరబోసిన రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ఉదయం వరి ధాన్యం ఆరబోసి ధాన్యం ఎండకు ముందే ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు ఇదే పరిస్థితి ఉండడంతో ధాన్యం ఎండకు  రైతులు ఇబ్బందులు పడుతున్నారు.

News May 20, 2024

భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని మెదక్ ఎస్పీకి ఫిర్యాదు

image

శివంపేట మండలం భీమ్లా తండాకు చెందిన సంతోశ్ తనకు తెలియకుండా మరో పెళ్లి చేసుకున్నాడని భార్య శిరీష ప్రజావాణిలో మెదక్ ఎస్పీ బాలస్వామికి ఫిర్యాదు చేశారు. 2021లో తన వివాహం జరగ్గా ఒక బాబు పుట్టినట్లు తెలిపింది. అనారోగ్యం కారణంగా తాను తల్లి గారి ఇంటి వద్ద ఉండగా మార్చిలో సంతోశ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు ఫిర్యాదులో పేర్కొంది. దీంతో ఈ ఘటనపై విచారించాలని శివంపేట ఎస్సైని ఎస్పీ ఆదేశించారు.

News May 20, 2024

నిజామాబాద్: హోటళ్లలో తనిఖీలు

image

నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కమిషనర్ అనురాగ్, డిప్యూటీ కమిషనర్ల ఆదేశాల మేరకు నగరంలోని పలు హోటళ్లలో అధికారులు తనిఖీలు చేపట్టారు. హోటల్ యజమానులకు కిచెన్, ఇతర సెక్షన్స్‌లలో పరిశుభ్రత పాటించాలని తెలిపారు. లేదంటే పెనాల్టీలతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ తనిఖీలో సానిటరీ ఇన్స్పెక్టర్ నటరాజ్ గౌడ్‌తో పాటు ప్రభుదాస్, సునీల్, శ్రీకాంత్, ప్రశాంత్,మహిపాల్ తదితరులు పాల్గొన్నారు.

News May 20, 2024

ఏసీబీకి చిక్కిన నానాజీపూర్ గ్రామపంచాయతీ కార్యదర్శి

image

నగర శివారు శంషాబాద్ మండలం నానాజీపూర్‌లో ఓ ఇంటి నిర్మాణ అనుమతుల కోసం రూ.35వేలు లంచం తీసుకుంటూ గ్రామపంచాయతీ సెక్రెటరీ రాధిక ఏసీబీ అధికారులకు చిక్కారు. దీంతో 111 జీవో పేరుతో గ్రామపంచాయతీ కార్యదర్శులు అందినకాడికి దోచుకుంటున్నారని ఇదే నిదర్శనమని జనం ఆరోపిస్తున్నారు. శంషాబాద్‌లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో ఇదే అదునుగా అనుమతుల పేరుతో రాధిక అవినీతికి పాల్పడిందని ఏసీబీ అధికారులు తెలిపారు.

News May 20, 2024

ఖమ్మం: పట్టు దక్కేది ఎవరికో..

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…