Telangana

News May 20, 2024

కరీంనగర్: ఫ్రీ బస్.. 5 నెలల్లో ఏకంగా 4.5 లక్షల మంది

image

కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ స్కీం కింద ఈ 5 నెలల్లో ఆర్టీసీ బస్సుల్లో మహిళల ప్రయాణం చాలా పెరిగింది. దీంతో RTCకి మంచి ఆదాయం సమకూరుతోంది. కరీంనగర్ రీజియన్‌లో KNR-1, 2, హుస్నాబాద్, హుజూరాబాద్, కోరుట్ల, GDK, సిరిసిల్ల, వేములవాడ, మెట్‌పల్లి, జగిత్యాల డిపోలున్నాయి. వీటి పరిధిలో గతంలో రోజూ 2.50 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తే.. ‘మహాలక్ష్మి’ వచ్చాక ఆ సంఖ్య 4.5 లక్షలకు చేరింది.

News May 20, 2024

తెలంగాణలోనే GHMC టాప్.. తగ్గేదేలే!

image

రాష్ట్రంలో TS-bPASS అమలులోకి వచ్చిన NOV 2020 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన భవన నిర్మాణాల్లో GHMC టాప్ ప్లేస్‌లో నిలిచింది. GHMC పరిధిలో 36,057 భవనాలకు అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బడంగ్‌పేట్ కార్పొరేషన్ 9,241 నిర్మాణాలతో సెకెండ్ ప్లేస్‌లో ఉంది. తుర్కయంజాల్‌లో 5,526, బోడుప్పల్‌లో 5,419 నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. భవన నిర్మాణ రంగంలో జీహెచ్ఎంసీ దూసుకెళ్తుందని పేర్కొంది.

News May 20, 2024

తెలంగాణలోనే GHMC టాప్.. తగ్గేదేలే!

image

రాష్ట్రంలో TS-bPASS అమలులోకి వచ్చిన NOV 2020 నుంచి ఏప్రిల్ 2024 వరకు జరిగిన భవన నిర్మాణాల్లో GHMC టాప్ ప్లేస్‌లో నిలిచింది. GHMC పరిధిలో 36,057 భవనాలకు అనుమతులిచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇక బడంగ్‌పేట్ కార్పొరేషన్ 9,241 నిర్మాణాలతో సెకెండ్ ప్లేస్‌లో ఉంది. తుర్కయంజాల్‌లో 5,526, బోడుప్పల్‌లో 5,419 నిర్మాణాలకు అనుమతులు జారీ చేశారు. భవన నిర్మాణ రంగంలో జీహెచ్ఎంసీ దూసుకెళ్తుందని పేర్కొంది.

News May 20, 2024

అభివృద్ధిని చెప్పుకోకపోవడం వల్లే ఓటమి: KTR

image

ఖమ్మం- నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి కేటీఆర్ కొత్తగూడెంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రెండే రెండు ప్రధాన కారణాల వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో చెప్పుకోలేకపోవటం ఒక కారణమైతే.. కొన్ని వర్గాలను దూరం చేసుకోవడమే తాము చేసిన రెండో తప్పు అని కేటీఆర్ పేర్కొన్నారు.

News May 20, 2024

సంగారెడ్డి: సీసీఎస్ సీఐ వెంకట సాయి కిషోర్ సస్పెన్షన్

image

సంగారెడ్డి జిల్లా సెంట్రల్ క్రైమ్ స్టేషన్(సీసీఐ) CI వెంకటసాయి కిషోర్‌ను సస్పెండ్ చేస్తూ మల్టీ జోన్-2 ఐజీ సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. వెంకట సాయిపై పలు ఆరోపణలు రావడంతో విచారణ జరిపి శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు పోలీస్ వర్గాలు తెలిపాయి. ఆయన్ను నెల క్రితం SP కార్యాలయానికి అటాచ్‌ చేయగా CCS విభాగంలో సీఐగా పోస్టింగ్‌ ఇచ్చారు. తాజాగా సస్పెన్షన్‌ కావడం పోలీసు వర్గాల్లో చర్చనీయాంశమైంది.

News May 20, 2024

కాంగ్రెస్ రాష్ట్రాన్ని విధ్వంసం చేసింది: జగదీష్

image

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏనుగుల రాకేష్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పిలుపునిచ్చారు. కోదాడ పట్టణంలోని సన్నాహక సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో బీఆర్ఎస్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే కరువును తీసుకువచ్చి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందన్నారు.

News May 20, 2024

వరంగల్: పట్టు దక్కేది ఎవరికో..

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికకు పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ప్రచార జోరు పెంచాయి. సిట్టింగ్ స్థానం దక్కించుకోవాలని బీఆర్ఎస్, ఎలాగైనా చేజిక్కించుకోవాలని కాంగ్రెస్, బోణీ కొట్టాలని బీజేపీ వ్యూహాలు రచిస్తున్నాయి. ధర్మసమాజ్ పార్టీ, కొంత మంది స్వతంత్రులు కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. చూడాలి మరి పట్టభద్రులు ఎవరివైపు మొగ్గు చూపుతారో…

News May 20, 2024

NZB: తాళం వేసిన ఇంట్లో దొంగల చేతివాటం

image

నగరంలో తాళం వేసిన ఇంట్లో చొరబడిన దొంగలు 20 తులాల బంగారు ఆభరణాలు, రూ.30 వేల నగదు ఎత్తుకెళ్లారు. షాద్ నగర్‌లో నివాసం ఉండే మహమ్మద్ అబ్దుల్ సలాం కుటుంబం ఆదివారం మధ్యాహ్నం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళారు. తిరిగి అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో ఇంటికి వెళ్లి చూడగా తాళం ధ్వంసం చేసి కనిపించింది. ఆరోటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

News May 20, 2024

HYD: మరో అరగంటలో నగర వ్యాప్తంగా వర్షం!

image

HYD నగరంలోని ఎల్బీనగర్, సరూర్ నగర్, వనస్థలిపురం, మలక్పేట, బేగంపేట, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్, ఉస్మానియా యూనివర్సిటీ, ఉప్పల్, అమీర్పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లో మరికొద్ది సేపట్లో వర్షం కురుస్తుందని ’తెలంగాణ వెదర్ మెన్‘ తెలిపింది. మరో అరగంటలో నగరంలోని ఇతర ప్రాంతాలకు సైతం విస్తరించి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా పేర్కొంది. GHMC అధికారులు సైతం ప్రజలకు అలర్ట్ జారీ చేశారు.

News May 20, 2024

MBNR: సీఎం సొంత జిల్లాలో పంతం నెగ్గేనా .. !

image

ఉమ్మడి జిల్లాలో ఎంపీ ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఏ ఎన్నికల్లో లేనివిధంగా ఈసారి ఉమ్మడి జిల్లా పార్లమెంట్‌ స్థానాలను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. సీఎం రేవంత్‌రెడ్డి సొంత జిల్లా కావడంతో అన్ని పార్టీలు ఇక్కడ ఫోకస్ పెట్టాయి. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 14కు 12 MLAలను కాంగ్రెస్‌ గెలిచింది. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతుందా.. సీఎం పంతం నెగ్గేనా..? అని జిల్లాలో చర్చ జోరందుకుంది.