Telangana

News May 20, 2024

HYD మెట్రో ట్రయల్ రన్.. టైమింగ్స్ మార్పు.!

image

HYD మెట్రో సమయ పాలనలో మార్పులు చేసేందుకు ముందస్తుగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారాల్లో మొదటి ట్రైన్ ఉదయం 5:30 గంటలకు, శుక్రవారాల్లో లాస్ట్ ట్రైన్ రాత్రి 11:45 గంటలకు మెట్రో సర్వీస్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, సాధ్య సాధ్యాలను పరిశీలించిన అనంతరం మాత్రమే దీనిని శాశ్వతంగా కొనసాగిస్తామని HYD మెట్రో X వేదికగా తెలిపింది.

News May 20, 2024

హన్మకొండలో తీన్మార్ మల్లన్న సుడిగాలి పర్యటన

image

ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న హన్మకొండలోని ఆర్ట్స్&సైన్స్ కాలేజ్ గ్రౌండ్, పబ్లిక్ గార్డెన్, కేయూ గ్రౌండ్&కేయూ కామన్ మెస్, స్టడీ రూమ్‌లలో మార్నింగ్ వాక్ ద్వారా విస్తృతంగా పర్యటించారు. ఆయనకు మొదటి ప్రాధాన్యత ఓటువేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో తెలంగాణ నిరుద్యోగ జేఏసి ఛైర్మన్ కోటూరి మానవతారాయ్, సుధాకర్ తదితరులున్నారు.

News May 20, 2024

HYD మెట్రో ట్రయల్ రన్.. టైమింగ్స్ మార్పు.!

image

HYD మెట్రో సమయ పాలనలో మార్పులు చేసేందుకు ముందస్తుగా ట్రయల్ రన్స్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సోమవారాల్లో మొదటి ట్రైన్ ఉదయం 5:30 గంటలకు, శుక్రవారాల్లో లాస్ట్ ట్రైన్ రాత్రి 11:45 గంటలకు మెట్రో సర్వీస్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఇది కేవలం ట్రయల్ రన్ మాత్రమేనని, సాధ్య సాధ్యాలను పరిశీలించిన అనంతరం మాత్రమే దీనిని శాశ్వతంగా కొనసాగిస్తామని HYD మెట్రో X వేదికగా తెలిపింది.

News May 20, 2024

ఖమ్మం- శ్రీకాకుళం సూపర్ లగ్జరీ సర్వీసు ప్రారంభం

image

ఖమ్మం-శ్రీకాకుళం మధ్య సూపర్ లగ్జరీ సర్వీసులు ప్రారంభించినట్లు DM యు.రాజ్యలక్ష్మి తెలిపారు. 9937 సర్వీస్ నెంబర్ గల బస్సు ఖమ్మంలో 6:15 బయలుదేరుతుందన్నారు. 9938 సర్వీస్ నెంబర్ గల బస్సు శ్రీకాకుళంలో 4:00 స్టార్ట్ అవుతుందని చెప్పారు. మరిన్ని వివరాలకు 99592 25990 నంబర్‌ను సంప్రదించాలన్నారు.

News May 20, 2024

KNR: యాక్సిడెంట్.. యువకుడి మృతి

image

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన HYD దోమలగూడ ఠాణా పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. బెజ్జంకి మండలం తోటపల్లె గ్రామానికి చెందిన అజయ్(26) బోయిన్‌పల్లి అంజయ్యనగర్‌లో ఉంటూ శ్రీకర ఆసుపత్రిలో అనస్థీషియా టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాణిగంజ్ నుంచి ట్యాంక్‌బండ్ మీదుగా వెళ్తున్న అజయ్ బైక్‌ను సరకు రవాణా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కేసు నమోదైంది.

News May 20, 2024

HYD: జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ

image

ఆస్తమా, ఉబ్బసం రోగుల కోసం ఏటా HYD ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈసారి జూన్ 8 నుంచి ప్రారంభమవనుందని బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8న ప్రవేశిస్తుందని,ఆ రోజు నుంచే ప్రసాదం పంపిణీ మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, అధికారులు సహకరించాలని, త్వరలో ఈ విషయమై సీఎంను కలవనున్నట్లు తెలిపారు.

News May 20, 2024

వరంగల్: నేటి పత్తి ధర వివరాలు

image

2 రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల మార్కెట్ ఈరోజు పునః ప్రారంభం కాగా మార్కెట్ కు పత్తి తరలివచ్చింది. అయితే ధర మాత్రం గత వారంతో పోలిస్తే ఈరోజు పెరిగింది. గతవారం రూ.6700 పలికిన పత్తి ధర.. ఈరోజు రూ.7040కి పెరిగింది. ధరలు మరింత పెరగాలని అన్నదాతలు ఆశిస్తున్నారు.

News May 20, 2024

HYD: జూన్ 8 నుంచి చేప ప్రసాదం పంపిణీ 

image

ఆస్తమా, ఉబ్బసం రోగుల కోసం ఏటా HYD ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహించే చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఈసారి జూన్ 8 నుంచి ప్రారంభమవనుందని బత్తిని అమర్నాథ్ గౌడ్ తెలిపారు. సోమాజిగూడలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది మృగశిర కార్తె జూన్ 8న ప్రవేశిస్తుందని,ఆ రోజు నుంచే ప్రసాదం పంపిణీ మొదలు పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వం, అధికారులు సహకరించాలని, త్వరలో ఈ విషయమై సీఎంను కలవనున్నట్లు తెలిపారు.

News May 20, 2024

పంట భీమా పథకం అమలుకు ప్రభుత్వం కసరత్తు

image

ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు వచ్చే వానాకాలం సీజన్‌లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పంట భీమా పథకం అమలుకు వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తోంది. ఉమ్మడి జిల్లాలో 5.79 లక్షల మంది రైతులు పంటలను సాగు చేస్తుండగా ప్రతి ఏడాది ఏదో విధంగా పంటలు నష్టపోతున్నారు. ఈ సమయంలో రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం పంట భీమా పథకం అమలు చేస్తోంది.

News May 20, 2024

గృహజ్యోతిపై భానుడి ప్రభావం

image

భానుడి ప్రభావం గృహజ్యోతి వినియోగదారులపై పడింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 4,82,283 మంది ఉచిత కరెంట్ లబ్ధిదారులు ఉండగా ఏప్రిల్ నెలలో తీసిన లెక్కల ప్రకారం 4,73,314కి పడిపోయారు. ఒక్క నెలలోనే 8,969 మంది ఫథకాన్ని కోల్పోయారు. మేలో 4,60,864 మంది లబ్ధిదారులు మాత్రమే అర్హులయ్యారు. ఈ మూడు నెలల్లోనే 21,419 మంది పథకానికి దూరమయ్యారు. వాతవరణం చల్లబడడంతో ఈ నెలలో విద్యుత్ వినియోగం తగ్గే అవకాశం ఉంది.