Telangana

News May 20, 2024

ఖమ్మం జిల్లాలో భూసార పరీక్షల ఊసే లేదు!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వానాకాలం భూసార పరీక్షల కోసం ప్రభుత్వం ప్రధాన ల్యాబ్లకు రూ.7.2 లక్షల చొప్పున నిధులు కేటాయించారు. గతంలో వర్షాధారిత ప్రాంతాల్లో 25 ఎకరాలకు ఒకటి చొప్పున సేకరించి పరీక్షలకు పంపించే వారు. ఈసారి ఎంపికైన మండలాల్లో కొద్దిమంది భూముల నుంచే నమూనాలు సేకరిస్తున్నారు. భద్రాద్రి జిల్లాలో ఇప్పటికే ఏఈఓలు మట్టి నమూనాలను సేకరించే పనిలో ఉండగా ఖమ్మం జిల్లాలో ఈ ప్రక్రియ ప్రారంభం కాలేదు.

News May 20, 2024

WGL: అప్పుడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు

image

KMM-WGL-NLG MLC స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మల్లన్న (INC), రాకేశ్ రెడ్డి (BRS), ప్రేమేందర్ రెడ్డి (BJP) పోటీ చేస్తున్నారు. అయితే ముగ్గురు గతంలో BJPలో ఉన్నవారే. తీన్మార్ మల్లన్న 2021లో BJPలో చేరి, తిరిగి 2023లో హస్తం గూటికి చేరారు. ప్రేమేందర్ రెడ్డి BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాకేశ్ రెడ్డి 2013లో BJPలో చేరి BJYMలో అనేక పదవులు చేపట్టారు. ఈ ఏడాదే BRS పార్టీలో చేరారు.

News May 20, 2024

మెదక్: స్కూల్ యూనిఫామ్.. ఈసారి ఆలస్యమే.!

image

ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రతి ఏటా అందజేసే రెండు జతల దుస్తుల పంపిణీ ఈ ఏడాది కూడా ఆలస్యం కానుంది. పాఠశాలలు తెరిచే నాటికి అందజేయాలని లక్ష్యంగా పెట్టుకున్న ముందుకు సాగడం లేదు. మెదక్ జిల్లాలో 899 ప్రభుత్వ పాఠశాలల్లో 78,286 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రెండు జతలుగా156,572 దుస్తులు అందజేయాల్సి ఉండగా, ఇప్పటికీ షర్టు, ప్యాంటు కు సంబంధించి 50 శాతం ముడి సరుకు సరఫరా అయ్యింది.

News May 20, 2024

నేడు ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న కేటీఆర్

image

ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8 గంటలకు హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయలుదేరి 10 గంటలకు కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందుకు చేరుకుంటారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఇల్లందు సింగరేణి జేకే గ్రౌండ్లో జరిగే పట్టభద్రుల ఓటర్ల సమావేశంలో కేటీఆర్ పాల్గొంటారు.

News May 20, 2024

ఖమ్మం: ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని విద్యార్థిని సూసైడ్

image

ఎప్‌సెట్‌లో మంచి ర్యాంక్ రాలేదని మనస్తాపం చెందిన విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడిన ఘటన రఘునాథపాలెం మండలం వి.వెంకటాయపాలెంలో ఆదివారం జరిగింది. సీఐ శ్రీహరి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన పల్లగాని మేఘన(19) ఇంటర్ చదివింది. హైదరాబాద్లో కోచింగ్ తీసుకున్నా శనివారం విడుదలైన ఫలితాల్లో మంచి ర్యాంకు రాలేదని మనస్తాపంలో ఉరివేసుకొని ఆత్మహత్య పాల్పడింది.

News May 20, 2024

MBNR: గార్గేయపురం చెరువులో మహిళల మృతదేహాలు

image

కర్నూల్ మండలం గార్గేయపురం చెరువులో ముగ్గురు మహిళల మృతదేహాలు ఆదివారం వెలుగు చూశాయి. పోలీసుల వివరాలు ప్రకారం.. చెరువులో మృతదేహాలు ఉన్నాయని స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటన స్థలానికి చేరుకొని ముగ్గురు మహిళలను బయటకు తీశారు. ముందు హిజ్రాలుగా భావించినా, తర్వాత మృతులు మహిళలుగా గుర్తించారు. వీరిలో ఇద్దరు MBNRకు చెందినవారుగా గుర్తించారు. కేసు దర్యాప్తు కోసం మూడు పోలీసుల బృందాలను నియమించారు.

News May 20, 2024

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు రూ.1.41 కోట్లు కేటాయింపు

image

కేజీబీవీలకు సంబంధించి గత విద్యా సంవత్సరం ఏప్రిల్ నెలకు గాను నిధులు విడుదల చేస్తూ తెలంగాణ విద్యాశాఖ సమగ్ర శిక్షణ నుంచి ఉత్తర్వులు జారీ చేసింది. ఛార్జీల విడుదల కోసం ఎదురుచూస్తున్న ప్రత్యేకాధికారులకు కాస్త ఉపశమనం లభించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కేజీబీవీలకు రూ.1.41 కోట్లు కేటాయించారు. తాజాగా నిధులు విడుదల కావడంతో బిల్లుల చెల్లింపునకు మార్గం సుగమమైందని ఎస్‌వోలు పేర్కొన్నారు.

News May 20, 2024

NLG: గూడ్స్ వాహన డ్రైవర్ దారుణహత్య

image

గూడ్స్ వాహన డ్రైవర్ దారుణహత్యకు గురయ్యాడు. కృష్ణా జిల్లా పామర్రు మండలం చెట్టవారిగూడేనికి చెందిన రాజవర్ధన్(35) శనివారం గూడ్స్ వాహనం లోడుతో VJD నుంచి HYDకు వెళ్లాడు. HYDలో సామాను దింపి రాత్రి VJDకు బయల్దేరాడు. మార్గం మధ్యలో ఎరసానిగూడెం స్టేజీ వద్ద గుర్తుతెలియని వ్యక్తులు రాజవర్ధన్‌ను అడ్డగించి హత్య చేసి మృతదేహాన్ని రోడ్డు పక్కన పడేసినట్లు ఎస్ఐ ఎన్.శ్రీను తెలిపారు

News May 20, 2024

కరీంనగర్: కొత్త రేషన్ కార్డులపై ఆశలు

image

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రేషన్ కార్డు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గత ప్రభుత్వంలో రేషన్ కార్డు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు కొత్త ప్రభుత్వం రేషన్ కార్డులు ఎప్పుడు మంజూరు చేస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా1947 రేషన్ షాపులు ఉండగా 9,80,261 ఆహారభద్రత కార్డులు ఉండగా 28,24,897 మంది కుటుంబ సభ్యులు రాయితీతో కూడిన లబ్ధి పొందుతున్నారు.

News May 20, 2024

HYD: ఏప్రిల్ 24న పెళ్లి.. ఇంతలోనే విషాదం

image

పెళ్లయిన 25 రోజుల్లోనే నవ వధువు మృతిచెందిన ఘటన HYD తార్నాకలోని లాలాగూడ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. లాలాపేట్ ఆర్యనగర్‌ వాసి మౌనిక(26)కు చిలుకానగర్ వాసి రమేశ్‌కు ఏప్రిల్ 24న పెళ్లయ్యింది. శనివారం పుట్టింటికి భర్తతో కలిసి మౌనిక వచ్చింది. రాత్రి భర్త వెళ్లిపోగా ఆమె అక్కడే ఉంది. ఆదివారం స్నానం చేసేందుకు బాత్రూంలోకి వెళ్లిన మౌనిక బోర్ మోటార్ ఆన్ చేయగా కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది.