Telangana

News September 15, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పూజలందుకుంటున్న గణనాథులు.
@ తంగళ్లపల్లి మండలంలో పురుగు మందు తాగి రైతు ఆత్మహత్య.
@ గోదావరిఖనిలో తేలుకాటుతో వ్యక్తి మృతి.
@ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి మృతి.
@ ఎల్లారెడ్డిపేట మండలంలో విష జ్వరంతో బాలిక మృతి.
@ అంగన్వాడి కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలన్న సిరిసిల్ల కలెక్టర్.

News September 15, 2024

మంచిర్యాల: బంగారు నగల బ్యాగును అప్పగించిన పోలీసులు

image

బస్సులో పోగొట్టుకున్న బంగారు నగలతో కూడిన బ్యాగును కనుక్కొని బాధితురాలికి మంచిర్యాల పోలీసులు అందజేశారు. సీఐ బన్సీలాల్ వివరాలు.. జగిత్యాల నుంచి ఇందారంలోని బంధువుల ఇంటికి వెళ్లడానికి మంచిర్యాలకు వచ్చిన సానియా అనే మహిళ బస్సు దిగే సమయంలో బ్యాగ్ మర్చిపోయింది. దీంతో పోలీసులను సంప్రదించగా వెంటనే బ్లూ కోల్డ్ సిబ్బంది సీసీ కెమెరాలను పరీక్షించి రైల్వే స్టేషన్‌లో బ్యాగును గుర్తించి బాధితురాలికి అందజేశారు.

News September 15, 2024

RR: ఉమ్మడి జిల్లాలో నేటి..TOP NEWS

image

✓NIMS ఆస్పత్రిలో SEP 22 నుంచి 28 వరకు ఉచిత గుండె శస్త్ర చికిత్సలు
✓ఖైరతాబాద్ గణేష్ వద్దకు తరలిన జనం
✓బాలాపూర్ గణనాథుని దర్శించుకున్న రాష్ట్ర DGP
✓SEP 17న గ్రేటర్ HYD పరిధిలో అనేక చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు
✓బోడుప్పల్: వక్ఫ్ బాధితులను కలిసిన ఎంపీ DK అరుణ
✓KPHB: గణపతి నిమజ్జనంలో ముస్లిం సోదరుల డాన్స్.

News September 14, 2024

NLG: నిమజ్జనం ప్రశాంత వాతావరణంలో చేసుకోవాలి: ఎస్పీ

image

నల్గొండ జిల్లాలో సోమవారం నిర్వహించే గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అని చర్యలు తీసుకుంటున్నామని జిల్లా SP శరత్ చంద్ర పవార్ తెలిపారు. అన్ని ప్రధాన రహదారులతో పాటు వివిధ కాలనీల్లో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ CC TV కెమెరాలతో పాటు ప్రత్యేకంగా CC కెమెరాలను ఏర్పాటు చేసి, జిల్లా పోలీసు కార్యాలయానికి అనుసంధానం చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు చేశామని తెలిపారు.

News September 14, 2024

HYD నగరంలో DGP పర్యటన

image

HYD నగర వ్యాప్తంగా డీజీపీ జితేందర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేశారు. గణపతి నిమజ్జనానికి చేపడుతున్న ఏర్పాట్లు,బందోబస్తు గూర్చి పరిశీలించారు.చార్మినార్, బాలాపూర్, సెక్రటేరియట్, ఖైరతాబాద్ ప్రాంతాల్లో సిపిలతో కలిసి పరిస్థితులు పరిశీలించారు. నిమజ్జనం, ఊరేగింపు సాఫీగా జరిగేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు. పర్యటనలో సీపీలు సుధీర్ బాబు, సివి ఆనంద్, కలెక్టర్ అనుదీప్, కమిషనర్ ఆమ్రపాలి పాల్గొన్నారు.

News September 14, 2024

KMM: గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు: సీపీ

image

గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లతో పాటు ట్రాఫిక్ ఆంక్ష‌లు విధించినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. ట్రాఫిక్ ఆంక్ష‌ల నేపథ్యంలో ఈనెల 16 సోమవారం నాడు ఖమ్మం నగరంలో వాహనదారులు గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర జరిగే రూట్లు కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని సూచించారు. అటు నగరంలో శోభాయాత్ర జరిగే మార్గాలు, వాహనదారుల ప్రత్యామ్నాయ మార్గాల మ్యాపును సీపీ విడుదల చేశారు.

News September 14, 2024

HNK: రీల్స్ చేస్తూ హై టెన్షన్ వైరు తాకి గాయాల పాలైన యువకుడు

image

రైలు పైకి ఎక్కి రీల్స్ చేస్తుండగా హైటెన్షన్ వైర్లు తాకి వ్యక్తి గాయాలపాలైన ఘటన కాజీపేటలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. రాజ్ కుమార్ అనే వ్యక్తి కడిపికొండ దగ్గరలో గల రాంనగర్ సమీప రైల్వే ట్రాక్‌పై ఆగిఉన్న గూడ్స్ రైలుపైకి సెల్ఫీలు దిగుతూ రీల్స్ చేస్తున్నాడు. ఈ క్రమంలో హై టెన్షన్ కరెంట్ వైర్లు తాకడంతో 70% శరీరం కాలిపోయింది. గమనించిన స్థానికులు ఎంజీఎంకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News September 14, 2024

త్వరలో ఉద్యోగుల కోసం ట్రాన్స్‌ఫర్ పాలసీ: బలరాం

image

రాష్ట్ర సింగరేణి ఉద్యోగులకు CMD బలరాం శుభవార్త చెప్పారు. HYD లక్డీకపూల్ వద్ద ఉన్న సింగరేణి భవన్లో మాట్లాడుతూ.. త్వరలో ఉద్యోగుల కోసం ట్రాన్స్‌ఫర్ పాలసీ తెస్తామన్నారు.బదిలీ, విజ్ఞప్తులను ఆన్ లైన్లో స్వీకరించేందుకు యాప్ రూపొందిస్తామన్నారు. రెండు నెలల్లో సింగరేణిలో ఈ-ఆఫీస్ ప్రారంభిస్తామని, గ‌నుల్లోని కార్య‌క‌లాపాల‌ను సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని వెల్లడించారు.

News September 14, 2024

MBNR: సీఎం రేవంత్ రెడ్డి పర్యటన షెడ్యూల్ ఇదే..

image

మహబూబ్‌నగర్ జిల్లాకు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి రానున్నారు. చిన్నచింతకుంట మండలం ధమాగ్నాపూర్ గ్రామంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి తండ్రి కృష్ణారెడ్డి దశదిన కర్మ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. ఉదయం 11 గంటలకు బేగంపేట నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 12:15కి దమాగ్నాపూర్ చేరుకుంటారు. కార్యక్రమం అనంతరం మ. 1గంటకు తిరిగి హైదరాబాద్ వెళ్లారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను ఎస్పీ జానకి పర్యవేక్షిస్తున్నారు.

News September 14, 2024

బేస్ బాల్ క్రీడల్లో సత్తా చాటిన సిద్దిపేట జిల్లా జట్టు

image

నిర్మల్ జిల్లా కేంద్రంలో జరుగుతున్న 5వ తెలంగాణ స్టేట్ జూనియర్ ఇంటర్ బేస్ బాల్ ఛాంపియన్ షిప్ క్రీడల్లో సిద్దిపేట జిల్లా జట్టు దూసుకుపోతున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నిమ్మ రంగారెడ్డి, మధు యాదవ్, ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రవీణ్ గౌడ్ తెలిపారు. నిర్మల్ జట్టుపై 1:7 తేడాతో, మేడ్చల్ జట్టుపై 1:3 తేడాతో సిద్దిపేట జట్టు గెలుపొంది ఫ్రీ క్వార్టర్ ఫైనల్ కు చేరుకున్నట్లు వివరించారు.