Telangana

News May 20, 2024

ఎమ్మెల్సీ ఎన్నికలకు బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిలు

image

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ఇన్‌ఛార్జిలను నియమించింది. DVKకు మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, పార్టీ కార్మిక విభాగం నాయకుడు రాంబాబు యాదవ్ , MLGకు భాస్కర్ రావు, రాజీవ్ సాగర్, మునుగోడుకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, రాకేశ్ కుమార్, సాగర్‌కు నోముల భగత్, NKLకు చిరుమర్తి లింగయ్య, NLGకు కంచర్ల భూపాల్ రెడ్డిలను నియమించింది.

News May 20, 2024

ఉమ్మడి జిల్లాలో నేటి కార్యక్రమాలు

image

✔MBNR,GDWL,NRPT జిల్లాలో పలు ప్రాంతాల్లో నేడు కరెంట్ కట్
✔సర్వం సిద్ధం.. నేటి నుంచి టెట్ పరీక్షలు
✔పలు నియోజకవర్గాల్లో పర్యటించనున్న స్థానిక ఎమ్మెల్యేలు
✔కొనసాగుతున్న వేసవి క్రీడా శిక్షణ
✔తాడూరు: నేటి నుంచి లక్ష్మీనరసింహస్వామి కల్యాణ వేడుకలు
✔GDWL: నేడు లాటరీ పద్ధతిన పోస్టులు ఎంపిక
✔కల్తీ విత్తనాలపై అధికారుల ఫోకస్

News May 20, 2024

WGL: నేటి నుంచి ఉపాధ్యాయ అర్హత పరీక్ష

image

ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు. సోమవారం నుంచి జూన్ 2 వరకు పరీక్షలు జరగనున్నాయి. గతంలో ఈ పరీక్షలను ఆఫ్లైన్లో నిర్వహించగా ఈసారి ఆన్లైన్ పద్ధతిలో చేపట్టనున్నారు. డీఈడీ, బీఈడీ పూర్తి చేసిన అభ్యర్థులతో పాటు పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు సైతం పరీక్ష రాయనున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మొత్తం 15,949 మంది హాజరుకానున్నారు.

News May 20, 2024

MBNR: సర్పంచ్ ఎన్నికలకు రంగం సిద్ధం

image

లోక్‌సభ ఎన్నికలు పూర్తవ్వడంతో సర్పంచ్ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని 1,719 గ్రామ పంచాయతీలకు త్వరలో ఎన్నికలు నిర్వహించనున్నారు. జూన్ లోపే వార్డుల విభజన ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని పంచాయతీలు MBNR-468 ఉండగా.. NGKL-461, GDWL-255, NRPT-280, WNP- 255 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు.

News May 20, 2024

KMM: మరో 14 రోజులే.. మీ MP ఎవరు..?

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సరిగ్గా మరో 14 రోజుల్లో మన ఎంపీ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..

News May 20, 2024

REWIND: ఓడిపోయిన అరూరి రమేశ్!

image

అరూరి రమేశ్ వరంగల్ లోక్‌సభ నుంచి బీజేపీ తరఫున బరిలో ఉన్నారు. 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన బీఆర్ఎస్ తరఫున పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన 87,238 ఓట్లు సాధించి ఓడిపోయారు. అయితే ఆ ఎన్నికల్లో ఓడిపోయిన అరూరి ఈ లోక్‌సభ ఎన్నికల్లో గెలుస్తారని ఆ పార్టీ నాయకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
– దీనిపై మీ కామెంట్?

News May 20, 2024

REWIND: బండి సంజయ్‌కు 89,016 ఓట్లు!

image

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బండి సంజయ్‌కు ఎంపీ ఎన్నికలు కలిసొస్తాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ 2019లో ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోగా 89,016 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి కూడా ఎంపీగా గెలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఉండగా బండి సంజయ్ గెలుస్తారో లేదో వేచి చూడాలి.

News May 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఎమ్మెల్సీ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటన
∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం జిల్లా కలెక్టర్ సమావేశం
∆} అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News May 20, 2024

ఖమ్మం: అప్పుడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు

image

KMM-WGL-NLG MLC స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మల్లన్న (INC), రాకేశ్ రెడ్డి (BRS), ప్రేమేందర్ రెడ్డి (BJP) పోటీ చేస్తున్నారు. అయితే ముగ్గురు గతంలో BJPలో ఉన్నవారే. తీన్మార్ మల్లన్న 2021లో BJPలో చేరి, తిరిగి 2023లో హస్తం గూటికి చేరారు. ప్రేమేందర్ రెడ్డి BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాకేశ్ రెడ్డి 2013లో BJPలో చేరి BJYMలో అనేక పదవులు చేపట్టారు. ఈ ఏడాదే BRS పార్టీలో చేరారు.

News May 20, 2024

NZB: రూ.వెయ్యి కోట్లు దాటిన పసుపు అమ్మకాలు

image

నిజామాబాద్ జిల్లా పసుపు మార్కెట్‌లో ఈ ఏడు రూ.వేయి కోట్ల వరకు లావాదేవీలు జరిగాయి. జిల్లాలో సాగు విస్తీర్ణం 36 వేల ఎకరాల నుంచి 25 వేలకు తగ్గినప్పటికి ధర గణణీయంగా పేరిగింది. గతేడాది వరకు క్వింటా నమూనా ధర రూ.6,500కు మించలేదు. అయితే అనూహ్యంగా జులై నుంచి ధర పెరిగి గరిష్ఠంగా రూ.14 వేలు దాటింది. కాగా ఈ సీజన్‌లో 9,59,743 క్వింటాళ్లకు సుమారు రూ.1000.73కోట్లు లావాదేవీలు జరిగాయి.