Telangana

News May 20, 2024

నల్గొండ: అప్పుడు మిత్రులు.. నేడు ప్రత్యర్థులు

image

KMM-WGL-NLG MLC స్థానానికి ఈ నెల 27న పోలింగ్ జరగనుంది. మల్లన్న (INC), రాకేశ్ రెడ్డి (BRS), ప్రేమేందర్ రెడ్డి (BJP) పోటీ చేస్తున్నారు. అయితే ముగ్గురు గతంలో BJPలో ఉన్నవారే. తీన్మార్ మల్లన్న 2021లో BJPలో చేరి, తిరిగి 2023లో హస్తం గూటికి చేరారు. ప్రేమేందర్ రెడ్డి BJP రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రాకేశ్ రెడ్డి 2013లో BJPలో చేరి BJYMలో అనేక పదవులు చేపట్టారు. ఈ ఏడాదే BRS పార్టీలో చేరారు.

News May 20, 2024

బోథ్‌లో 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసు

image

మద్యం తాగి వాహనాలు నడిపిన 15 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేసినట్లు SI రాము తెలిపారు. బోథ్ మండలం కుచులాపూర్ గ్రామంలోని వేంకటేశ్వర ఆలయం వద్ద ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించారు. పట్టుబడిన 15 మందిపై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు. మైనర్లకు వాహనాలు ఇస్తే యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

News May 20, 2024

జూన్ 7 నుంచి యధావిధిగా ప్రజావాణి: రాహుల్ రాజ్

image

మెదక్ కలెక్టరేట్ సమావేశం మందిరంలో నిర్వహించే రేపటి ప్రజావాణి కార్యక్రమం రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. పరిపాలన పరమైన కారణాలు, పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా రద్దు చేస్తున్నట్లు వివరించారు. విషయాన్ని ప్రజలు గమనించి రేపటి ప్రజావాణి కార్యక్రమానికి రావద్దని సూచించారు. జూన్ 7 నుంచి ప్రజావాణి యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు

News May 20, 2024

NLG: జూన్ 8 వరకు ప్రజావాణి రద్దు: కలెక్టర్

image

ఎంపీ ఎన్నికల పోలింగ్ ముగిసినప్పటికీ జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్నందున జూన్ 8 వరకు ప్రజావాణి ఉండదని కలెక్టర్ దాసరి హరిచందన తెలిపారు. ఎంపీ ఎన్నికల ఓట్ల లెక్కింపు, అలాగే WGL- KMM -NLG పట్టభద్రుల శాసనమండలి ఉపఎన్నికల పోలింగ్, కౌంటింగ్ వంటి కారణాల వల్ల కేంద్ర ఎన్నికల సంఘం జూన్ 8 వరకు జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని విధించిందని జూన్ 8 వరకు ప్రజావాణి నిర్వహించడం లేదని తెలిపారు.

News May 20, 2024

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన

image

ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం పాలేరులో ప్రజల వద్దకే మంత్రి పొంగులేటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇళ్లు లేని ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఇందిరమ్మ ఇళ్లతో పాటు త్వరలోనే అర్హులు అందరికీ కొత్త రేషన్ కార్డులు, పెంచిన పెన్షన్లు అందిస్తామని భరోసా ఇచ్చారు.

News May 20, 2024

పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం: డిప్యూటీ సీఎం

image

పర్యావరణాన్ని కాపాడే విధంగా భవన నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆకుపచ్చ జీవనం మనకు ఓ విధానంగా మారాలి, పచ్చని వారసత్వాన్ని మన తర్వాత తరాలకు అందించాలన్నారు. 50% నీరు, 40 శాతం విద్యుత్తు ఆదా చేసే రీతిలో నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

News May 20, 2024

పెట్టుబడులకు హైదరాబాద్ స్వర్గధామం: డిప్యూటీ సీఎం

image

పర్యావరణాన్ని కాపాడే విధంగా భవన నిర్మాణాలు ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. హైటెక్స్‌లో ఏర్పాటుచేసిన గ్రీన్ ప్రాపర్టీ షో ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆకుపచ్చ జీవనం మనకు ఓ విధానంగా మారాలి, పచ్చని వారసత్వాన్ని మన తర్వాత తరాలకు అందించాలన్నారు. 50% నీరు, 40 శాతం విద్యుత్తు ఆదా చేసే రీతిలో నిర్మించే గ్రీన్ బిల్డింగ్స్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు.

News May 20, 2024

భద్రతా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ రవి నాయక్

image

ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద ఉన్న భద్రతా సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రవినాయక్ అన్నారు. ఆదివారం పాలమూరు యూనివర్సిటీ వివిధ విభాగాల భవనాల్లో మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్ లకు సంబంధించిన ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూంల వద్ద పోలీస్ భద్రతను, సీసీ కెమెరాల పనితీరును, పోలీస్ సిబ్బంది విధుల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు.

News May 20, 2024

సంగారెడ్డి: ‘ప్రభుత్వ కార్యాలయాల్లో TGని వాడాలి’

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇక నుంచి TG అనే అక్షరాన్ని మాత్రమే వాడాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదివారం తెలిపారు. ప్రభుత్వం ఈ మేరకు అధికారికంగా ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. మే 31వ తేదీ వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయంలోని బోర్డులు, వెబ్ సైట్‌లలో టీజీ అక్షరాలుగా మార్చాలని సూచించారు.

News May 20, 2024

కామారెడ్డి: శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే

image

కామారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి వరంగల్ నగరంలో శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితుల ఆశీస్సులు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ – ఖమ్మం – నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక బీజేపీ అభ్యర్థి గుజ్జుల మహేందర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.