Telangana

News May 20, 2024

వరంగల్ మార్కెట్ నేడు పున:ప్రారంభం

image

రెండు రోజుల విరామం అనంతరం వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ నేడు పున ప్రారంభం కానుంది. మొన్న, నిన్న వారాంతపు సెలవులు కావడంతో మార్కెట్ బంద్ ఉంది. దీంతో నేడు ప్రారంభం కానుండగా.. రైతులు నాణ్యమైన సరుకులను మార్కెటుకు తీసుకొని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు. కాగా ఉదయం 6 గంటల నుంచి మార్కెట్లో కొనుగోళ్లు ప్రారంభం కానున్నాయి.

News May 20, 2024

రామగుండం: నకిలీ విత్తనాలు రవాణా, విక్రయాలపై ప్రత్యేక నిఘా: సీపీ

image

నకిలీ, కల్తీ విత్తనాలు స్మగ్లింగ్ పై ఉక్కుపాదం మోపుతామని ఆదివారం రామగుండం సీపీ శ్రీనివాస్ హెచ్చరించారు . వ్యవసాయ, ప్రభుత్వ శాఖల సిబ్బందితో టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా నకిలీ విత్తనాలు విక్రయిస్తే వారిపై పీడీ యాక్ట్ అమలు చేస్తామని సీపీ తేల్చిచెప్పారు.

News May 19, 2024

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేటి టాప్ న్యూస్

image

@ చందుర్తి మండలంలో ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య. @ వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ. @ తంగళ్ళపల్లి మండలంలో కూతుర్ని హత్య చేసిన తల్లిదండ్రుల అరెస్ట్. @ సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్న సిరిసిల్ల ఎస్పీ. @ ఓదెల మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల రద్దీ. @ మెట్ పల్లి మండలంలో వైభవంగా ప్రారంభమైన కొండస్వామి బ్రహ్మోత్సవాలు. @ కొడిమ్యాల మండలంలో లారీ, పాల వ్యాన్ డీ.. ఒకరి మృతి.

News May 19, 2024

కరీంనగర్: మరో 15 రోజులే.. మీ MP ఎవరు..?

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సరిగ్గా మరో 15 రోజుల్లో మన ఎంపీ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ఉమ్మడి జిల్లాలోని పెద్దపల్లి, కరీంనగర్, నిజామాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..

News May 19, 2024

NZB: మరో 15 రోజులే.. మీ MP ఎవరు..?

image

జూన్ 4న ఓట్ల లెక్కింపు జరగనుండగా.. సరిగ్గా మరో 15 రోజుల్లో మన ఎంపీ ఎవరో తేలనుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల్లో ఉత్కంఠ, ప్రజల్లో ఆసక్తి నెలకొంది. నిజామాబాద్, జహీరాబాద్ పరిధిలో ఎక్కడ చూసినా ఫలితాలపై చర్చ కొనసాగుతోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారు. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?

News May 19, 2024

2 Hr’s పాటు నిలిచిపోయిన సిర్పూర్ కాగజ్‌నగర్ ఎక్స్‌ప్రెస్

image

హనుమకొండ జిల్లా ఉప్పల్ రైల్వే స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం 2 ఎక్స్‌ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు. అందులో సిర్పూర్ కాగజ్‌నగర్ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్న కాగజ్ నగర్ ఎక్స్ ప్రెస్‌ను ఉప్పల్ స్టేషన్‌లో నిలిపివేశారు. తర్వాత అహ్మదాబాద్ నుంచి చెన్నై సెంట్రల్ వెళ్తున్న నవజీవన్ ఎక్స్ ప్రెస్‌ను నిలిపివేశారు. రెండు గంటలు రైళ్లు నిలిపివేయడంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగారు.

News May 19, 2024

MP ఎన్నికలు.. రూ.8.40 కోట్ల నగదు, 33వేల లీటర్ల మద్యం సీజ్

image

లోక్‌సభ ఎన్నికల వేళ పోలీసుల తనిఖీల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారీగా నగదు, మద్యం పట్టుబడ్డింది. జిల్లాలోని 2 నియోజకవర్గాల్లోని 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో 34 సరిహద్దుల్లో తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మార్చి 13 నుంచి ఈనెల 14 వరకు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చేపట్టిన తనిఖీల్లో రూ.8.40 కోట్ల నగదు, 33,831.93 లీటర్ల మద్యం సీజ్ చేసినట్లు అధికారులు తెలిపారు. మద్యం విలువ రూ.2.98 కోట్లు ఉంటుందని అంచనా.

News May 19, 2024

ADB: ట్రిపుల్ తలాక్ కేసులో రిమాండ్

image

తన భార్యకు ట్రిపుల్ తలాక్ చెప్పిన ఆదిలాబాద్ KRK కాలనీకి చెందిన షేక్ అతీక్‌ను రిమాండ్‌కు తరలించినట్లు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు. భార్యకు వాట్సాప్‌లో ట్రిపుల్ తలాక్ చెబుతూ వాయిస్ మెసేజ్ పంపించాడు. దీంతో ఆమె పోలీసులను ఆశ్రయించారు. నిందితుడిని ఆదిలాబాద్ జె.ఎఫ్.సి.ఎం కోర్టు న్యాయమూర్తి ఎస్.మంజుల ముందు ఆదివారం ప్రవేశపెట్టగా 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించారని సీఐ వెల్లడించారు.

News May 19, 2024

UPDATE.. తూప్రాన్: పెళ్లింట విషాదం.. పెళ్లికొడుకు అన్న మృతి

image

తూప్రాన్ మండలం యావపూర్ వద్ద జరిగిన <<13277126>>రోడ్డు ప్రమాదం<<>>లో సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అనంతగిరిపల్లికి చెందిన కర్రె నర్సింలు(40) మృతి చెందాడు. నరసింహులు తమ్ముడి వివాహం రేపు జరగాల్సి ఉండగా ఏర్పాట్లలో ఉన్నారు. నర్సింలు, బంధువు పోచయ్య ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళ్తున్నారు. తమిళనాడుకు చెందిన సతీష్ కుమార్, మోహన్ సైతం బైక్‌పై వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎదురుగా వచ్చిన వాహనం ఢీ కొట్టగా, తీవ్రంగా గాయపడ్డారు.

News May 19, 2024

సంగారెడ్డి: రెండు చోట్ల ఓటేశారు !

image

నాగల్‌గిద్ద, కంగ్టి, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లోని సుమారు 40 గ్రామాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఇక్కడ కర్ణాటక సరిహద్దు గ్రామస్థులు సైతం ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈనెల 7న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటేసి వీరు, తిరిగి తెలంగాణ MP ఎన్నికల్లోనూ ఓటేశారు. ఇలా ఆయా గ్రామాల్లో 75 శాతం పోలింగ్‌ నమోదైంది. నాగల్‌గిద్ద(M) ఏస్గి గ్రామంలో 150 మంది, గౌడ్‌గామ్‌జనవాడకు చెందిన 100 మంది 2చోట్ల ఓచేసినట్లు టాక్.