Telangana

News May 19, 2024

తాడ్వాయి: అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లిన లారీ

image

తాడ్వాయిలో ప్రమాదం తప్పింది. పసర నుంచి ఏటూరు నాగారం వైపు వస్తున్న ఇసుక లారీ ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. ఈ ప్రమాద సమయంలో తాడ్వాయిలో వర్షం పడుతుండగా రోడ్డుపైన ఎవరూ లేకపోవడంతో ఘోర ప్రమాదం తప్పింది. రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టడంతో విద్యుత్ వైర్లు తెగి రోడ్డుకి అడ్డంగా పడ్డాయి.

News May 19, 2024

HYD: 2.18 కోట్ల మంది ఓటర్లు ఓటేశారు!

image

గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1.86 కోట్ల మంది ఓటేశారని, ఈసారి తెలంగాణ -2024 లోక్‌సభ ఎన్నికల్లో 2.18 కోట్ల మంది ఓటర్లు ఓటేసినట్లుగా CEO వికాస్ రాజ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగినందుకు రాష్ట్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా మల్కాజ్గిరిలో 50.78, చేవెళ్లలో 56.50, HYD 48.48, సికింద్రాబాద్‌లో 49.04 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు.

News May 19, 2024

HYD: 2.18 కోట్ల మంది ఓటర్లు ఓటేశారు!

image

గత 2019 లోక్‌సభ ఎన్నికల్లో 1.86 కోట్ల మంది ఓటేశారని, ఈసారి తెలంగాణ -2024 లోక్‌సభ ఎన్నికల్లో 2.18 కోట్ల మంది ఓటర్లు ఓటేసినట్లుగా CEO వికాస్ రాజ్ తెలిపారు. గతంతో పోలిస్తే ఓటింగ్ శాతం పెరిగినందుకు రాష్ట్ర ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు. ప్రత్యేకంగా మల్కాజ్గిరిలో 50.78, చేవెళ్లలో 56.50, HYD 48.48, సికింద్రాబాద్‌లో 49.04 శాతం ఓటింగ్ నమోదైనట్లు పేర్కొన్నారు.

News May 19, 2024

సిరిసిల్ల: కూతురిని హతమార్చిన తల్లిదండ్రుల అరెస్టు.. రిమాండ్‌కు తరలింపు

image

కన్నకూతురిని హత్యచేసిన తల్లిదండ్రుల్ని రిమాండ్‌కు తరలించామని SP అఖిల్ మహాజన్ తెలిపారు. తంగళ్లపల్లి మండలం నేరెళ్లకు చెందిన చెప్యాల ఎల్లవ్వ- నర్సయ్య దంపతులకు కూతురు ప్రియాంక ఉంది. ఆమె మానసిక వ్యాధితో బాధపడుతోంది. ఆమె ప్రవర్తన తీరుపై కోపగించుకున్న తల్లిదండ్రులు ఈనెల 14న ఆమెను హత్యచేశారు. ఆదివారం నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. అయితే మృతురాలికి పెళ్లై, 13 నెలల బాలుడు ఉండటం గమనార్హం.

News May 19, 2024

ఆదిలాబాద్: ఉచిత శిక్షణ.. అనంతరం JOB

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నిరుద్యోగ యువకులకు NAC ద్వారా హైదరాబాద్‌లో జేసీబీ డ్రైవింగ్ 3 నెలలు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ ఇన్‌ఛార్జ్ రమేష్ పేర్కొన్నారు. శిక్షణ అనంతరం రూ. 25వేలతో కూడిన జాబ్ ఇప్పించనున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కాలంలో ఉచిత భోజనం, హాస్టల్ వసతి ఉంటుందన్నారు. పదవతరగతి పాస్ లేదా ఫెయిల్ వారు ఈనెల 22 వరకు జిల్లాలోని న్యాక్ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News May 19, 2024

NLG: ఇక పంచాయతీ ఎన్నికలపై దృష్టి

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ ముగియడంతో పంచాయతీ ఎన్నికలపై అధికారులు దృష్టి సారించింది. ఫిబ్రవరిలోనే పంచాయతీలకు పదవీ కాలం ముగియడంతో అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. ఉమ్మడి జిల్లాలోని 1,740 గ్రామ పంచాయతీలకు జూన్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో ఆశావహులు పోటీ చేసేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నారు.

News May 19, 2024

BREAKING: బాన్సువాడలో రెండు కుళ్లిన మృతదేహలు

image

బాన్సువాడ న్యూవీక్లీ మార్కెట్లో నూతనంగా నిర్మిస్తున్న ఓ భవనంలో రెండు కుళ్లిన మృతదేహలు కలకలం రేపాయి. ఓ షట్టర్‌లో బాలుడు, మహిళ శవాలను గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కృష్ణ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 3 రోజుల క్రితం ఈ ఇద్దరు మృతి చెందినట్లు అనుమానిస్తున్నారు. మృతదేహలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరి వివరాలు తెలిస్తే బాన్సువాడ CI కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

News May 19, 2024

రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కేటీఆర్ పర్యటన

image

ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం, ఇల్లందు, ఖమ్మం నియోజకవర్గాల్లో ఏర్పాటు చేసిన ఓటర్ల సమావేశంలో ఆయన పాల్గొనున్నట్లు పార్టీ నాయకులు పేర్కొన్నారు. సమావేశాన్ని విజయవంతం చేయాల్సిందిగా వారు కోరారు.

News May 19, 2024

సికింద్రాబాద్: అగ్ని వీర్ ట్రైనింగ్ ప్రమాణాలపై తనిఖీ

image

సికింద్రాబాద్‌లో కొనసాగుతున్న అగ్నివీర్ శిక్షణ ప్రమాణాలపై లెఫ్ట్ నుంచి జనరల్ మంజిత్ కుమార్ తనిఖీ చేశారు. ఇందులో భాగంగా శిక్షణ కేంద్రం వద్ద ఉన్న అధికారులను కలిసి అక్కడ ఉన్న పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అగ్నివీర్లు అద్భుతంగా రాణించేందుకు అత్యుత్తమ ప్రమాణాలు పాటించి శిక్షణ అందించాలని వారు ఆదేశించారు.

News May 19, 2024

ఖమ్మం జిల్లా అంతటా అదే చర్చ!

image

ఖమ్మం జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చించుకుంటున్నారు. ఉదయం వేళలో మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు దీనిపైనే చర్చలు పెడుతున్నారు. టీకొట్టు, హోటళ్లు, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు, ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చలు నడుస్తున్నాయి.