Telangana

News May 19, 2024

KMM: ఐటీఐ ప్రవేశాలకు వేళాయె..!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఐటీఐ కళాశాలల్లో ప్రవేశాలకు అధికారులు చర్యలు ప్రారంభించారు. 2024-25 విద్యా సంవత్సరం ప్రవేశాలకు జూన్ 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 5,477 సీట్ల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పదో తరగతి, ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై 2024, ఆగస్టు 1వ తేదీ నాటికి 14 ఏళ్లు నిండినవారు అర్హులని తెలిపారు.

News May 19, 2024

KMM: ఉప పోరు.. జిల్లాలో ప్రచార హోరు!

image

వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి మే 27న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. మొత్తం 52 మంది పట్టభద్రులు బరిలో నిలవగా ప్రధానంగా మూడు పార్టీల మధ్యే హోరాహోరీ పోటీ నెలకొంది. కాంగ్రెస్, BJP, BRS అభ్యర్థులు ఎవరికి వారు ఈ సీటు దక్కించుకునేందుకు పోటీ పడుతున్నారు.

News May 19, 2024

HYD: పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి

image

పిడుగుపాటుకు ముగ్గురు రైతులు బలయ్యారు. ఒకే రోజు యాలాల మండలంలోని వేర్వేరు గ్రామాల్లో జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది. జుంటుపల్లిలో రైతులు శ్రీనివాస్, లక్మప్పలు తమ వరి పంట కోయిస్తున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడటంతో సమీప చెట్టు కిందకి వెళ్లారు. పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బెన్నూరులో సైతం రైతు గొల్ల వెంకన్న వర్షం పడే సమయంలో చెట్టు కింద ఉండగా పిడుగుపడి మృతి చెందాడు.

News May 19, 2024

HYD: పిడుగుపాటుకు ముగ్గురు రైతులు మృతి

image

పిడుగుపాటుకు ముగ్గురు రైతులు బలయ్యారు. ఒకే రోజు యాలాల మండలంలోని వేర్వేరు గ్రామాల్లో జరిగిన ఈ ఘటన బాధిత కుటుంబాల్లో విషాదం నింపింది. జుంటుపల్లిలో రైతులు శ్రీనివాస్, లక్మప్పలు తమ వరి పంట కోయిస్తున్న సమయంలో ఉరుములతో కూడిన వర్షం పడటంతో సమీప చెట్టు కిందకి వెళ్లారు. పిడుగు పడటంతో అక్కడికక్కడే మృతి చెందారు. బెన్నూరులో సైతం రైతు గొల్ల వెంకన్న వర్షం పడే సమయంలో చెట్టు కింద ఉండగా పిడుగుపడి మృతి చెందాడు.

News May 19, 2024

MBNR: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

image

అడ్డాకుల మండలంలో ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదంలో యవకుడు మృతి చెందాడు. ఎస్సై శ్రీనివాస్ వివరాల ప్రకారం.. మండలంలోని కాటవరం గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై పేర్కొన్నారు. మృతుడుకి సుమారు 30ఏళ్లు ఉంటాయని ఘటనపై కేసు నమోదు చేసిన విచారిస్తున్నట్లు చెప్పారు.

News May 19, 2024

ADB: మరో 15 రోజులే.. మీ MP ఎవరు..?

image

ఎన్నికల ఫలితాలు మరో 15రోజుల్లో వెలువడనున్నాయి. ఎక్కడ ఎవరు MP అనేది తేలనుంది. అంతలోనే నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నేతలు జోరుగా చర్చించుకుంటున్నారు. అభ్యర్థుల గెలుపోటములు, మెజారిటీలపై గ్రామగ్రామాన చర్చ నడుస్తోంది. మరోవైపు పలుపార్టీల నేతలు ప్రజలను ఎప్పటికప్పుడు ఓటు ఎవరికి వేశారన్నదానిపై ఆరా తీస్తూ అంచనాలు వేస్తున్నారట. – మరి మీ MP ఎవరవుతారు..? తాజా పరిస్థితి ఏంటి..?

News May 19, 2024

జోగులాంబను దర్శించుకున్న విద్యాశాఖ డైరెక్టర్లు

image

ఐదవ శక్తిపీఠమైన అలంపురం జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాలను ఆదివారం రాష్ట్ర విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్ యాదగిరి(మల్టీ జోన్ 2), మల్టీ జోన్ 1 డైరెక్టర్ జాయింట్ రాజేందర్ సింగ్, అలాగే తెలంగాణా డిగ్రీ పీజీ కళాశాలల ప్రిన్సిపల్ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పురేంద్ర కుమార్ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు దర్శనాలు చేయించారు. వీరితోపాటు డిగ్రీ కళాశాల లెక్చరర్ పిండి కృష్ణమూర్తి ఉన్నారు.

News May 19, 2024

అమెరికా ఫ్రెండ్స్‌కు నిజాంసాగర్ ప్రాజెక్టును చూపించిన ఎమ్మెల్యే

image

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు అమెరికాకు చెందిన తన స్నేహితులతో కలిసి నిజాంసాగర్ ప్రాజెక్టును సందర్శించారు. ఆమెరికాకు చెందిన శాస్త్రవేత్త స్టీవ్ బిల్డెడ్ కు నిజాంసాగర్‌లోని గోల్ బంగ్లా, దాని కింద గల గ్రామాలను చూపించారు. ప్రాజెక్టు సామర్థ్యం, ఇతర విషయాలు వివరించారు. ఎమ్మెల్యేతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్, రవీందర్ రెడ్డి కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.

News May 19, 2024

రుణమాఫీపై చిగురిస్తున్న ఆశలు!

image

శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రైతు రుణ మాఫీ అమలుకు ప్రభుత్వం కటాఫ్ తేదీ ప్రకటించటంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏకకాలంలో రూ.రెండు లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఉమ్మడి జిల్లాలో చాలా మంది రైతులు బ్యాంకుల్లో తీసుకున్న పంట రుణాలు రెన్యువల్ చేయకుండా ఆపేశారు. జిల్లాలో ఎక్కువగా సన్న, చిన్నకారు రైతులు ఉన్నారు.

News May 19, 2024

మరింత పడిపోతున్న సాగర్ నీటిమట్టం

image

నాగార్జునసాగర్ జలాశయంలో నీటి నిల్వలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులకు గాను 504.80 అడుగులు, పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 312.0450 టీఎంసీలకు గాను 123.0112 టీఎంసీల నీటి నిల్వ ఉంది. ఇక
జలాశయానికి ఇన్ ఫ్లో నిల్ ఉండగా, అవుట్ ఫ్లో 800 క్యూసెక్కులు ఉంది. ఈసారి వర్షాలు సమృద్ధిగా కురిస్తేనే మనుగడ ఉంటుందని సాగర్ ఆయకట్టు కింద అన్నదాతలు చెబుతున్నారు.