Telangana

News May 19, 2024

రాష్ట్రంలో 40-50% అగ్ని ప్రమాదాలు HYDలోనే!

image

జనవరి నుంచి ఏప్రిల్ 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా 3,104 ఫైర్ కాల్స్ నమోదయ్యాయి. స్వల్ప ప్రమాదాల విభాగంలో 2,860, మధ్యస్థంగా 62, తీవ్రతర ప్రమాదాలు 9, రెస్క్యూ కాల్స్ 127, ఎమర్జెన్సీ కాల్స్ 15 ఉన్నాయని కమాండ్ కంట్రోల్ సిబ్బంది తెలిపారు. ఇందులో 40-50 శాతం ప్రమాదాలు HYD పరిధిలోనివే. ఇటీవల జరిగిన ఫిల్మ్ ఛాంబర్ అగ్ని ప్రమాదంతో మొదలుకొని కాటేదాన్ సహా అంటూ.. రిపోర్టు విడుదల చేసింది.

WGL: 2.90లక్షల ఎకరాల్లో పంటల సాగు అంచనా..!

image

వరంగల్ జిల్లాలో ఈ వానాకాలంలో 2.90లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయ అధికారులు అంచనా వేశారు. ప్రధానంగా 1.34లక్షల ఎకరాల్లో వరి, 1.22లక్షల ఎకరాల్లో పత్తి, 4వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేస్తారని అభిప్రాయ పడుతున్నారు. కాగా గతేడాది పత్తికి మార్కెట్లో కొంత మెరుగ్గానే మద్దతు ధర రావడంతో ఈ సారి పత్తి సాగు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇందుకుగాను ఎరువులను అధికారులు అందుబాటులో ఉంచనున్నారు.

News May 19, 2024

మెదక్: ఆర్టీసీకి ఎన్నికల్లో సమకూర్చిన ఆదాయం

image

మెదక్ రీజియన్ పరిధిలో మే11 నుంచి 14 వరకు వివిధ ప్రాంతాలకు 887బస్సు సర్వీసులు నడిపించగా ఈ నాలుగు రోజుల్లో ఆర్టీసీకి రూ.4.29 కోట్ల ఆదాయం సమకూరిందని మెదక్ ఆర్టీసీ రీజియన్ మేనేజర్ ప్రభులత తెలిపారు. ఎంపీ ఎన్నికల నేపథ్యంలో ఆయా ప్రాంతాల నుంచి స్వస్థలాలకు ఓటు వేయడానికి వచ్చే ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా నిత్యం నడిపే బస్సులతో పాటు ఆధారంగా సర్వీసులకు నడిపించారన్నారు. సిబ్బంది కూడా కష్టపడి పని చేశారన్నారు.

News May 19, 2024

HYD: ఎయిర్‌పోర్టు మెట్రో రూట్ ఖరారు..!

image

HYD శివారు శంషాబాద్ ఎయిర్‌పోర్టు మెట్రో లైన్‌లో భాగంగా నాగోల్ నుంచి చంద్రాయణగుట్టకు 14 KM మెట్రో నిర్మించాలని రూట్ ఖరారు చేసినట్లు మెట్రో ఎండీ NVS రెడ్డి తెలిపారు. ప్రస్తుత నాగోల్ మెట్రో స్టేషన్, నాగోల్ చౌరస్తా, అల్కాపురి చౌరస్తా, కామినేని ఆసుపత్రి, ఎల్బీనగర్ సర్కిల్, సాగర్ రింగ్ రోడ్డు, మైత్రి నగర్ మీదుగా చంద్రాయణగుట్ట ఇలా.. మొత్తం 13 స్టేషన్లు వస్తాయని పేర్కొన్నారు.

MBNR: ‘దోస్త్’ రిజిస్ట్రేషన్‌కు కావలసిన సర్టిఫికెట్స్!!

image

✓ దోస్త్ రిజిస్ట్రేషన్ కోసం పదో తరగతి మెమో.
✓ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్.
✓ కులం, ఆదాయం ధ్రువపత్రాలు (01-04-2024 తర్వాత జారీ చేసినవి.)
✓ మూడో తరగతి నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికెట్స్.
✓ ఆధార్ కార్డు నంబర్ పాస్ ఫోటో.
✓ విద్యార్థుల ఆధార్ కార్డు నెంబర్ మొబైల్ నెంబర్ కు అనుసంధానమై ఉండాలి.
✓ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొబైల్ నెంబర్ కు వచ్చిన ఓటీపీ ద్వారా చేయబడుతుంది.

News May 19, 2024

విజిలెన్స్ ఎంక్వయిరీని ఆహ్వానించిన కేయూ వీసీ

image

కాకతీయ విశ్వవిద్యాలయం వీసీగా మూడు సంవత్సరాల పదవీ కాలంలో ఎక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదని, కాకతీయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ తాటికొండ రమేశ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన తనపై వేసిన విజిలెన్స్ విచారణ కమిటీని స్వాగతిస్తున్నానని తెలిపారు. తాను ఇక్కడే ఓ నిరుపేద కుటుంబంలో పుట్టి, ఇక్కడే ఉన్నత విద్యను అభ్యసించి ఇక్కడే ఉద్యోగం పొంది 30 సంవత్సరాలకు పైగా నిబద్ధతగా పనిచేశానన్నారు.

News May 19, 2024

మహబూబ్‌నగర్: ‘అంతటా అదే చర్చ!!’

image

ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై అందరూ చర్చించుకుంటున్నారు. ఉదయం వేళలో మైదానంలో రన్నింగ్ చేస్తున్న వారి దగ్గరి నుంచి సాయంత్రం టీ దుకాణాల దగ్గర ముచ్చట్లు పెట్టే వ్యక్తుల వరకు ప్రతి ఒక్కరు దీనిపైనే చర్చలు పెట్టారని స్థానికులు తెలిపారు. టీకొట్టు, హోటళ్లు, స్నాక్స్ దుకాణాలు, పని చేసే ప్రదేశాలు, వాకింగ్ మైదానాలు, ఎక్కడికి వెళ్లినా ఫలితాలపై చర్చలు నడుస్తున్నాయి.

News May 19, 2024

HYD: వికలాంగులకు ప్రత్యేక డిప్లమా కోర్సులు

image

HYD నగరం సికింద్రాబాద్ మనోవికాస్ నగర్ NIEPID కేంద్ర విద్యా సంస్థ మేధో వైకల్యం ఉన్నవారి నుంచి డిప్లమా కోర్సులు చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అధికారులు తెలిపారు. SSC, ఇంటర్మీడియట్ చేసిన వారు అర్హులు కాగా.. డిప్లమా స్పెషల్ ఎడ్యుకేషన్, రిహాబిలిటేషన్ సంబంధించిన కోర్సులు ఉన్నాయి. కేంద్రం స్కాలర్షిప్ సైతం అందిస్తుంది. హాస్టల్ ఫెసిలిటీ సైతం ఉంది. మిగతా వివరాల కోసం18005726422 సంప్రదించండి.