Telangana

News September 14, 2024

NZB: గణేశ్ నిమజ్జనం.. వైన్స్, బార్లు బంద్

image

గణేశ్ నిమజ్జనం, శోభాయాత్రకు నిజామాబాద్ జిల్లాలో సర్వం సిద్ధం చేశారు అధికారులు. గణేశ్ నిమజ్జనం దృష్టిలో పెట్టుకుని నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వైన్ షాపులు, బార్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని సీపీ కల్మేశ్వర్ ఆదేశించారు. ఆదివారం ఉదయం 6 గంటల నుంచి సోమవారం ఉదయం 10 గంటల వరకు మద్యం అమ్మరాదని తేల్చి చెప్పారు. అలాగే బార్లు, క్లబ్‌లు మూసేయాలని ఆదేశించారు.

News September 14, 2024

డీజేల వినియోగం, బాణసంచా వాడకంపై నిషేధం: KNR సీపీ

image

కరీంనగర్ సీపీ అభిషేక్ మహంతి కీలక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 16న జరగనున్న గణేశ్ నిమజ్జన కార్యక్రమం సందర్భంగా జరిగే శోభయాత్ర రూట్లు, నిమజ్జన కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పోలీసు పరంగా అవసరమైన అన్ని చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. దీనిలో భాగంగా గణేశ్ శోభాయాత్రలో డీజేల వినియోగంతో పాటు బాణసంచా కాల్చడంపై నిషేధం విధించామన్నారు.

News September 14, 2024

ఈనెల 16 నుంచి 17 వరకు వైన్స్ బంద్: వరంగల్ సీపీ

image

ఈనెల 16న గణేశ్ విగ్రహాల శోభాయాత్ర, నిమజ్జన కార్యక్రమాల నేపథ్యంలో వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఈనెల 16 నుంచి 17 వరకు మద్యం విక్రయాలను నిలిపివేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శనివారం తెలిపారు. గణేశ్ విగ్రహాల నిమజ్జనాన్ని పురస్కారించుకొని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా వైన్స్‌లను బంద్ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

News September 14, 2024

జాతి నిర్మాణంలో ఇంజినీర్లది కీలక పాత్ర: మంత్రి సీతక్క

image

దేశ ప్రగతిలో ఇంజినీర్ల పాత్ర చాలా గొప్పదని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క అన్నారు. పంచాయతీరాజ్ డిప్లమా ఇంజనీర్స్ అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశంలో సీతక్క పాల్గొన్నారు. ఆనకట్టలు, రహదారులు, వంతెనలు నిర్మించి దేశ ప్రగతిని ఇంజనీర్లు పరుగులు పెట్టించారని,తమ వృత్తికి వన్నె తెచ్చే విధంగా ఇంజినీర్లు పనిచేయాలని తెలిపారు.

News September 14, 2024

NLG: ‘గణేష్ నిమజ్జన ప్రాంతాల్లో ఏర్పాట్లు పూర్తి’

image

NLG జిల్లాలోని ప్రధాన నిమజ్జన ప్రాంతాలలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నల్గొండ పట్టణంలోని వల్లభరావు చెరువు, మూసి రివర్, 14వ మైలురాయి, వాడపల్లి, నాగార్జునసాగర్, దయ్యాలండి అడవిదేవుల పల్లి, కొండ భీమనపల్లి, డిండి పోలీస్ పికెట్లు, హెడ్ లైట్లు, క్రేన్లు ఏర్పాటు చేశారు. నిమజ్జనం జరిగే ప్రాంతాలలో గజ ఈతగాలను అందుబాటులో ఉంచారు. ఆన్ లైన్ విధానంలో భద్రతను పర్యవేక్షిస్తున్నారు.

News September 14, 2024

గోదావరి నది బ్రిడ్జిపై నిమజ్జనానికి ఏర్పాట్లు

image

గోదావరిఖని శివారు గోదావరి నది బ్రిడ్జిపై వినాయక నిమజ్జనానికి సంబంధించిన ఏర్పాట్లు ప్రారంభించారు. రామగుండం కార్పొరేషన్ ఆధ్వర్యంలో MLA రాజ్ ఠాకూర్ చొరవతో ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ఈనెల 16న ఉదయం నుంచి సాయంత్రంలోగా నిమజ్జనం పూర్తి చేయాలని గణేశ్ నవరాత్రి ఉత్సవాల నిర్వాహకులకు అధికారులు సూచిస్తున్నారు. అధికారుల సూచన మేరకు బ్రిడ్జిపై నుంచి గణపతి విగ్రహాలను నిమజ్జనం చేయాలని పేర్కొంటున్నారు.

News September 14, 2024

చర్ల: సరిహద్దుల్లో మావోయిస్టులు, పోలీసులకు మధ్య కాల్పులు

image

చర్ల సరిహద్దులోని అడవుల్లో మరోసారి కాల్పుల మోత మోగింది. పూర్వాతి గ్రామంలో పోలీసుల బేస్ క్యాంపుపై మావోయిస్టులు దాడులు చేశారు. భద్రతా బలగాలపై మావోయిస్టులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. దీన్ని భద్రతా బలగాలు గట్టిగా తిప్పికొట్టాయి. ఈ క్రమంలో జరిగిన ఎన్కౌంటర్లో ఓ మావోయిస్టు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు.

News September 14, 2024

అలజడి సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయండి: మంత్రి పొన్నం

image

ఐక్యతకు హైదరాబాద్‌ ప్రతీకగా నిలుస్తోందని, ఎక్కడైనా అలజడులు సృష్టిస్తే కఠినంగా వ్యవహరించాలని అధికారులను మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశించారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా వర్గవిభేదాలు సృష్టిస్తూ సోషల్‌ మీడియా ద్వారా రెచ్చగొట్టే, అపోహలు సృష్టించే వారిని ఉక్కుపాదంతో అణిచి వేయాలన్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో జీహెచ్‌ఎంసీ మేయర్‌ గద్వాల విజయలక్ష్మి, కలెక్టర్‌, సీపీతో కలిసి మాట్లాడారు.

News September 14, 2024

వరద నష్టం వివరాలు నమోదు చేయాలి: మంత్రి పొంగులేటి

image

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలంలోని ములకలపల్లిలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శనివారం సందర్శించారు. ఈ నేపథ్యంలో ప్రధాన రహదారి, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో కొట్టుకుపోయిన వంతెనను పరిశీలించారు. అనంతరం సంబంధిత అధికారులను వరద నష్టం వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు.

News September 14, 2024

నర్సాపూర్: చెరువులో ట్రాక్టర్ కడగడానికి వెళ్లి యువకుడు మృతి

image

వినాయక నిమజ్జనం కోసం ట్రాక్టర్ కడగడానికి చెరువు వద్దకు వెళ్లిన ఓ యువకుడు చెరువులో పడి మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన నర్సాపూర్‌లో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిమజ్జనం వేడుకల సందర్భంగా మండలంలోని ఆవంచ గ్రామానికి చెందిన గంట శ్రీను తన స్నేహితులతో కలిసి చెరువు వద్దకు ట్రాక్టర్ కడగడానికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందగా ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.