Telangana

News May 19, 2024

HYD: ఇక నుంచి TSSPDCL కాదు..TGSPDCL..!

image

తెలంగాణ రాష్ట్ర సౌతెర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ సంస్థ X వేదికగా ఓ ట్వీట్ చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు TS బదులుగా TG జోడించినట్లు తెలిపింది.ఇక నుంచి TSSPDCL కాదు..TGSPDCL అని పేర్కొంది. HYD,RR, VKB,MDCL మల్కాజ్గిరి జిల్లాలకు చెందిన దాదాపు అన్ని సెక్షన్ల విద్యుత్ శాఖ అధికారులు X వేదికగా ప్రొఫైల్ ఫోటోను మార్చి ప్రజలకు తెలియజేశారు.

News May 19, 2024

KNR: తల్లి మందలించిందని యువతి ఆత్మహత్య

image

తల్లి మందలించిందని ఓ యువతి గడ్డి మందు తాగి మృతి చెందింది. స్థానికుల వివరాలు.. కమాన్పూర్ మం. బురకాయ పల్లె గ్రామానికి చెందిన బొడ్డుపల్లె సింధు(19)ను ఈ నెల 14న ఇంట్లో చెప్పిన పని చేయడం లేదని తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లో ఉన్న గడ్డి మందు తాగింది. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News May 19, 2024

యాదగిరిగుట్టలో ఆర్జిత సేవలకు డ్రెస్‌‌‌‌‌‌‌‌ కోడ్‌‌‌‌‌‌‌‌

image

యాదాద్రి ఆలయంలో నిత్య కళ్యాణం, బ్రేక్‌‌‌‌‌‌‌‌ దర్శనాలు, ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు తప్పని సరిగా సంప్రదాయ దుస్తులు ధరించాలని ఆలయ ఈవో భాస్కరరావు ఆదేశాలు జారీ చేశారు. ఆలయంలో జూన్ 1 నుంచి నియమాలు కచ్చితంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు. మగవారు తెల్లటి దుస్తులు, మహిళలు చున్నీతో కూడిన పంజాబీ డ్రెస్‌‌‌‌‌‌‌‌, చీర, లంగా వోణి వంటి దుస్తులు ధరించాలని చెప్పారు.

News May 19, 2024

HYD నగరంలో కుక్కలకు వ్యాక్సినేషన్

image

గ్రేటర్ HYD పరిధిలో 2022-23 ఆర్థిక సంవత్సరంలో 73,969 కుక్కలకు, 2023-24 ఆర్థిక సంవత్సరంలో 94,500 కుక్కలకు రాబిస్ టీకాలు వేసినట్లుగా అధికారులు తెలియజేశారు. కుక్కల నియంత్రణ కోసం ఎక్కడికక్కడ చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. కుక్కల బెడద ఉన్న ప్రతి ప్రాంతంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని, గత నెల రోజుల్లో 1,000 కుక్కలకు పైగా వ్యాక్సినేషన్ అందించినట్లు తెలిపారు.

మెదక్: ఇంట్లో నుంచి వెళ్లిన మహిళ ఆత్మహత్య

image

మనస్తాపం చెందిన ఓ మహిళ ఇంట్లో నుంచి వెళ్లి మృతదేహంగా లభ్యమైంది. కొల్చారం ఎస్ఐ మహ్మద్‌గౌస్ తెలిపిన వివరాలు.. మెదక్ పట్టణం నవాబుపేటకు చెందిన మల్లయ్య, రాజమ్మ దంపతులకు ఒక్క కుమార్తె సుజాతను రాజయ్య అనే వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేశారు. ఈనెల 16న తల్లి రాజమ్మ, సుజాతలకు గొడవ పెట్టుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మంజీరా నదిలో శవం లభ్యమైంది. భర్త రాజయ్య ఫిర్యాదుతో కేసు నమోదైందని ఎస్సై తెలిపారు.

News May 19, 2024

HYD: రియల్ ఎస్టేట్ దందా.. ముగ్గురు అరెస్ట్

image

మేడ్చల్ జిల్లా కొంపల్లి పరిధిలో భారతి బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన శివరామకృష్ణ, నాగరాజు, నరసింహరావును పోలీసులు అరెస్టు చేశారు. వీరు అమాయక ప్రజల నుంచి రూ.60 కోట్ల డబ్బు వసూలు చేసి మోసం చేయటంతో సైబరాబాద్ పోలీసులు రిమాండ్ చేసినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News May 19, 2024

NTRను కలిసేందుకు ఖమ్మం నుంచి HYDకి నడక

image

హీరో జూనియర్ NTRను కలవాలనే కోరికతో ఓ అభిమాని పాదయాత్ర చేసుకుంటూ హైదరాబాద్‌కు వచ్చాడు. ఖమ్మం జిల్లాలోని తిరుమలాయపాలెం మండలం గోపాయిగూడెం గ్రామానికి చెందిన నాగేంద్రబాబు చెప్పుల్లేకుండా 300 కిలోమీటర్లు నడిచాడు. తనను చూసేందుకు ఎంతో శ్రమించి ఇంటికి వచ్చిన నాగేంద్రను కలిసిన ఎన్టీఆర్ అతడితో ఫొటో దిగాడు. అభిమాన హీరో కలవడంతో అతడు తెగ సంబరపడుతున్నాడు.

News May 19, 2024

HYD: రియల్ ఎస్టేట్ దందా.. ముగ్గురు అరెస్ట్

image

మేడ్చల్ జిల్లా కొంపల్లి పరిధిలో భారతి బిల్డర్స్ పేరుతో ప్రీ లాంచ్ ఆఫర్స్ అంటూ మాయమాటలు చెప్పి మోసం చేసిన శివరామకృష్ణ, నాగరాజు, నరసింహరావును పోలీసులు అరెస్టు చేశారు. వీరు అమాయక ప్రజల నుంచి రూ.60 కోట్ల డబ్బు వసూలు చేసి మోసం చేయటంతో సైబరాబాద్ పోలీసులు రిమాండ్ చేసినట్లు తెలిపారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

News May 19, 2024

దుబ్బాక: అప్పులు చేసి ఆన్‌లైన్‌ గేమ్స్‌

image

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌లతో యువత ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలకు తీరని మనోవ్యధకు మిగులుస్తోంది. ఈ విషపు క్రీడ గ్రామాల్లోకి పాకింది. గ్రామీణ యువకులు కూడా ఆన్‌లైన్‌ గేమ్స్‌, బెట్టింగ్‌లు కాస్తూ అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు. సిద్దిపేట జిల్లాలో నెలకు సుమారు 15 వరకు ఆత్మహత్యల కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో సుమారు 22 శాతం మంది యువత ఆన్‌లైన్‌ గేమింగ్‌కు బానిసలవుతున్నట్లు ఇటీవల జరిగిన ఓ సర్వేలో తేలింది.