Telangana

News May 19, 2024

ఆత్మహత్యలకు అడ్డాగా నిజామాబాద్ మెడికల్ కళాశాల?

image

ఆత్మహత్యలకు నిజామాబాద్ మెడికల్ కళాశాల అడ్డాగా నిలుస్తోంది. ప్రాణాలు కాపాడాల్సిన జూనియర్ డాక్టర్లు తనువులు చాలిస్తున్నారు. తాజాగా జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన కలకలం రేపింది. అయితే మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ ఇతర పర్యవేక్షణ అధికారుల పర్యవేక్షణ లోపం మూలంగానే తరచుగా ఇలాంటి ఘటనలు కళాశాలలో పునరావృతం అవుతున్నాయనే విమర్శలు తలెత్తుతున్నాయి.

News May 19, 2024

WGL: తల్లిపై కుమారుడి దాడి

image

భూమి పట్టాచేయాలని కుమారుడు తల్లిపై దాడి చేసిన ఘటన ఎల్కతుర్తి మండలంలో జరిగింది. ఎస్సై రాజు తెలిపిన వివరాలు.. పెంచికల్పేట్ గ్రామానికి చెందిన చిలుముల లక్ష్మికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. కుమారుడు రఘుపతి ఈ నెల 17న తన భాగానికి వచ్చిన భూమి తోపాటు తల్లి దగ్గరున్న 20 గుంటలు కూడా తన పేరున పట్టా చేయాలని లక్ష్మిని తీవ్రంగా కొట్టాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం నిందితుడిపై కేసు నమోదు చేశారు.

News May 19, 2024

అడ్డాకుల: ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య

image

ఇంట్లో ఉరి వేసుకుని ఓ యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన అడ్డాకుల మండల కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్సై శ్రీనివాసులు తెలిపిన వివరాలు.. కుటుంబ సభ్యులు చర్చిలో జరిగిన ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొనేందుకు వెళ్లగా యువతి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని MBNR ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

News May 19, 2024

KNR: ప్రేమ పేరుతో మోసం..

image

ప్రేమ పేరుతో డబ్బులు దండుకొని ఆస్ట్రేలియాకు వెళ్లిన ఓ యువతిపై LMD పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. పోలీసుల వివరాలు.. తిమ్మాపూర్‌కు చెందిన నాగరాజు యోగ నిమిత్తం ఈశా ఫౌండేషన్‌కు వెళ్లగా అక్కడ వైజాగ్‌కు చెందిన సంధ్య ప్రియాంకతో పరిచయం ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి నుంచి రూ. 16లక్షలు యువతి తన బంధువుల ఖాతాలోకి బదిలీ చేయించుకుంది. యువకుడు ఫినాయిల్ తాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

News May 19, 2024

మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

image

మందమర్రి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలకు చెందిన కుర్మ రాధమ్మ అల్లుడి దశదిన కర్మ కోసం శనివారం మందమర్రికి వచ్చింది. స్థానిక ఇల్లందు క్లబ్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

News May 19, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ కు మద్దతు:తమ్మినేని

image

KMM-NLG-WGL పట్టభద్రుల MLC స్థానానికి జరిగే ఉపఎన్నికకు కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. ఇప్పుడూ BJPని ఓడించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. పట్టభద్రులైన ఓటర్లు మల్లన్నను గెలిపించాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

News May 19, 2024

ముస్తాబవుతున్న నల్గొండ మెడికల్‌ కళాశాల

image

నల్గొండ మెడికల్‌ కళాశాల భవనాల సమూదాయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీలో 42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కళాశాల త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కళాశాల భవన సమదాయం నిర్మాణాలు 85 శాతం వరకు పూర్తి కావచ్చాయి. భవన సమూదాయాన్ని అక్టోబర్‌ చివరినాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ అధికారులు సెప్టెంబర్‌లోగా అన్ని పనులను పూర్తి చేసి అప్పగించాలన్న లక్ష్యంతో ఉన్నారు.

News May 19, 2024

మెదక్: ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటి వరకు 44,685 మంది రైతుల నుంచి 1,94,666 టన్నులు సేకరించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 34 బాయిల్డ్, 23రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించినట్లు తెలిపారు. కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు సిద్దిపేట జిల్లాకు 10 వేల టన్నులు పంపినట్లు తెలిపారు. రానున్న 5 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 19, 2024

ఆదిలాబాద్: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2024 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 10వ/8వ తరగతులు ఉత్తీర్ణులై 14 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు జూన్ 10లోగా మొదటి దఫా ప్రవేశాల కోసం https:///iti. telangana. gov. in దరఖాస్తు  చేసుకోవాలని సూచించారు.

News May 19, 2024

డిచ్‌పల్లి: రేపటి నుంచి హౌజ్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ

image

SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజాంబాద్ గ్రామీణ ప్రాంత యువకులకు హౌజ్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. శిక్షణ పొందేందుకు 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, ఈనెల 20 నుంచి 30 రోజులపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. శిక్షణ పొందే వారికి ఉచిత భోజన వసతి కల్పిస్తామని వెల్లడించారు.