Telangana

News May 19, 2024

మంచిర్యాల: రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి

image

మందమర్రి పట్టణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వృద్ధురాలు మృతి చెందింది. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం వావిలాలకు చెందిన కుర్మ రాధమ్మ అల్లుడి దశదిన కర్మ కోసం శనివారం మందమర్రికి వచ్చింది. స్థానిక ఇల్లందు క్లబ్ వద్ద బస్సు దిగి రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు.

News May 19, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ కు మద్దతు:తమ్మినేని

image

KMM-NLG-WGL పట్టభద్రుల MLC స్థానానికి జరిగే ఉపఎన్నికకు కాంగ్రెస్‌కి మద్దతు ఇవ్వాలని నిర్ణయించినట్లు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమిలో భాగస్వామి అయిన కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చామన్నారు. ఇప్పుడూ BJPని ఓడించేందుకు కాంగ్రెస్‌ అభ్యర్థి మల్లన్నకు మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. పట్టభద్రులైన ఓటర్లు మల్లన్నను గెలిపించాలని తమ్మినేని పిలుపునిచ్చారు.

News May 19, 2024

ముస్తాబవుతున్న నల్గొండ మెడికల్‌ కళాశాల

image

నల్గొండ మెడికల్‌ కళాశాల భవనాల సమూదాయం నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ఎస్‌ఎల్‌బీసీలో 42 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న కళాశాల త్వరలోనే విద్యార్థులకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం కళాశాల భవన సమదాయం నిర్మాణాలు 85 శాతం వరకు పూర్తి కావచ్చాయి. భవన సమూదాయాన్ని అక్టోబర్‌ చివరినాటికి పూర్తి చేయాల్సి ఉంది. కానీ అధికారులు సెప్టెంబర్‌లోగా అన్ని పనులను పూర్తి చేసి అప్పగించాలన్న లక్ష్యంతో ఉన్నారు.

News May 19, 2024

మెదక్: ధాన్యం కొనుగోళ్లు ముమ్మరం

image

మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్నాయని, ఇప్పటి వరకు 44,685 మంది రైతుల నుంచి 1,94,666 టన్నులు సేకరించినట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 34 బాయిల్డ్, 23రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించినట్లు తెలిపారు. కొనుగోళ్లను వేగవంతం చేసేందుకు సిద్దిపేట జిల్లాకు 10 వేల టన్నులు పంపినట్లు తెలిపారు. రానున్న 5 రోజులు వర్షాలు ఉన్నందున రైతులు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

News May 19, 2024

ఆదిలాబాద్: ఐటీఐ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 2024 విద్యాసంవత్సరానికి మొదటి సంవత్సరం ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ పేర్కొన్నారు. ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు 10వ/8వ తరగతులు ఉత్తీర్ణులై 14 సంవత్సరాలు నిండిన అభ్యర్థులు జూన్ 10లోగా మొదటి దఫా ప్రవేశాల కోసం https:///iti. telangana. gov. in దరఖాస్తు  చేసుకోవాలని సూచించారు.

News May 19, 2024

డిచ్‌పల్లి: రేపటి నుంచి హౌజ్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ

image

SBI గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి నిజాంబాద్ గ్రామీణ ప్రాంత యువకులకు హౌజ్ వైరింగ్‌లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రతినిధులు తెలిపారు. శిక్షణ పొందేందుకు 19 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉండాలని, ఈనెల 20 నుంచి 30 రోజులపాటు శిక్షణ ఉంటుందని చెప్పారు. శిక్షణ పొందే వారికి ఉచిత భోజన వసతి కల్పిస్తామని వెల్లడించారు.

News May 19, 2024

BRS, కాంగ్రెస్‌ DNAలు ఒక్కటే: కిషన్ రెడ్డి

image

BRS, కాంగ్రెస్‌ DNAలు ఒక్కటేనని BJP రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో BRS నుంచి గెలిచిన MLAలు కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని.. 20 రోజుల్లో 25 మంది చేరుతారని వార్తలు వస్తున్నాయని అన్నారు. ప్రజల తరఫున పోరాటం చేయాలని ప్రజలు ఓటు వేసి గెలిపిస్తే ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా మారుతున్నారని పేర్కొన్నారు. HNKలో శనివారం MLC ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

News May 19, 2024

ఉప్పల్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం SRH- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ CP తరుణ్ జోషి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10:30 గంటల వరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్‌కు వచ్చే వాహనాలు HMDA భగాయత్ రోడ్డు వైపు దారి మళ్లిస్తామన్నారు.

News May 19, 2024

ఉప్పల్‌లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు

image

ఉప్పల్ స్టేడియంలో ఆదివారం SRH- కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ జరగనున్న నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ CP తరుణ్ జోషి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 10:30 గంటల వరకు స్టేడియం పరిసర ప్రాంతాల్లో వాహనాలను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొన్నారు. చెంగిచెర్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ నుంచి ఉప్పల్‌కు వచ్చే వాహనాలు HMDA భగాయత్ రోడ్డు వైపు దారి మళ్లిస్తామన్నారు.

News May 19, 2024

MBNR: ‘రుణమాఫీ.. వారికి డబుల్ ధమాకా.?’

image

ఉమ్మడి జిల్లాలో గతంలో అప్పులు తీసుకున్న రైతులకు అప్పటి BRS ప్రభుత్వం తొలి విడతలో రూ.50వేలు రుణం ఉన్నవారికి, 2వ విడతలో రూ.99 వేల వరకు రుణం ఉన్నవారికి రుణమాఫీని వర్తింప చేసింది. పాత రుణం రద్దు చేసి వారికి తిరిగి కొత్త పంట రుణం మంజూరు చేశారు బ్యాంకర్లు. రుణమాఫీ వారికి మినహాయించి మిగతా వారికి ఇస్తారా లేక అందరికీ ఇస్తారా అనేది తేలియాలి. అందరికీ మాత్రం 2023లో రుణమాఫీ పొందిన రైతులకు డబుల్ ధమాకా తగలనుంది.