Telangana

News May 19, 2024

పీడీఎస్‌ బియ్యందందా.. 9మందిపై కేసు

image

పెద్దవూర సమీపంలో పీడీఎస్‌ బియ్యందందా వ్యవహారంలో 9మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వీరబాబు తెలిపారు. వీరిలో నలుగురిని అరెస్టు చేసినట్లు, మిగతా వారు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఈ నెల 16న మధ్యాహ్నం పోలీసులకు అందిన సమాచారం మేరకు తెప్పలమడుగు పరిధిలోని అమ్మ రైస్‌మిల్‌లో తనిఖీ చేశారు. ఒక లారీలో 550 బస్తాల పీడీఎస్‌ బియ్యం కలిగి ఉండటం గుర్తించి కేసు నమోదు చేశామన్నారు.

News May 19, 2024

కరీంనగర్: ఎప్‌సెట్‌లో మెరిశారు

image

ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్ష (ఎప్‌సెట్‌) ఫలితాల్లో జిల్లాకు చెందిన విద్యార్థులు మెరిశారు. కరీంనగర్‌కు చెందిన మునీశ్వరి-చంద్రశేఖర్ రెడ్డిల కూతురు వి.హాసిని 144 ర్యాంకు, రజిని-శ్రీనివాస్‌ల కుమారుడు ఎన్. హేమంత్ 157వ ర్యాంకు, గంగాధరకు చెందిన ధనలక్ష్మి-పవన్‌ల కూతురు బొడ్ల ఆశ్రిత 220 ర్యాంకు సాధించారు. ఉన్నత విద్య అభ్యసించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

News May 19, 2024

ఖమ్మం: గ్రూప్‌-1 ప్రిలిమినరీకి 27,475 మంది

image

జూన్‌ 9న జరిగే గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్షలపై టీజీపీఎస్సీ ఛైర్మన్‌ మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌ నుంచి నిర్వహించిన కాన్ఫరెన్స్‌కు ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు హాజరయ్యారు. మొత్తం 27,475 మంది 73 కేంద్రాలలో పరీక్ష రాయనున్నట్లు వివరించారు. జూన్‌ 9న ఉదయం 10-30నుండి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఛైర్మన్‌ తెలిపారు.

News May 19, 2024

అధికారులు బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి: కలెక్టర్

image

ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకై వనపర్తి జిల్లా కలెక్టర్ తేజస్ నంద లాల్ పవార్ శనివారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 24 నుంచి ప్రారంభమయ్యే అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు సంబంధిత అధికారులు తమ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలని ఆదేశించారు. జిల్లా నుంచి 6134 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు.

News May 19, 2024

సిద్దిపేట: గ్రూప్-1 అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులు

image

సిద్దిపేటలోని BC స్టడీ సర్కిల్ కేంద్రంలో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు సన్నద్ధం అయ్యే అభ్యర్థులకు గ్రాండ్ టెస్టులను చేపట్టనున్నట్లు డైరెక్టర్ కృష్ణ దయాసాగర్ పేర్కొన్నారు. గ్రూప్-1కి సంబంధించిన పరీక్షలు ఈ నెల 18న ప్రారంభమై 20, 22, 25, 27, 29, 31 జూన్ 1, 3వ తేదీల్లో నిర్వహిస్తామని తెలిపారు. శిక్షణార్థులు మినహాయిస్తే మిగిలిన అభ్యర్థులు WWW.tsbcstudycircle.cgg.gov.inలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News May 19, 2024

NLG: అదే ఉత్సాహంతో పని చేయాలి: కలెక్టర్

image

పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ లో అధికారులు, సిబ్బంది బాగా పనిచేశారని, ఇదే ఉత్సాహంతో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియలో పాల్గొని విజయవంతం చేయాలని కలెక్టర్ హరిచందన సూచించారు. ఎంపీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియపై శనివారం కలెక్టరేట్ లో కౌంటింగ్ సూపర్వైజర్లు, అసిస్టెంట్లు, మైక్రో అబ్జర్వర్లకు శిక్షణ ఇచ్చారు. కౌంటింగ్ టేబుల్ వద్ద పాటించాల్సిన నియమాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అలర్ట్ గా ఉండాలన్నారు .

News May 19, 2024

మంచిర్యాల: ‘CBSE సిలబస్ ప్రవేశపెట్టాలి’

image

సింగరేణి పరిశ్రమలో పనిచేస్తున్న ఉద్యోగుల పిల్లలకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్ ప్రవేశపెట్టాలని BMSనాయకులు C&MDబలరాం నాయక్ కు విజ్ఞప్తి చేశారు. యూనియన్ అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య మాట్లాడుతూ.. సింగరేణి కార్మికుల వేతనాల నుండి కార్పోరేట్ పాఠశాలలు దోపిడీ చేస్తున్నాయన్నారు. క్రమశిక్షణ కలిగిన సెంటర్ సిలబస్ ద్వారా మంచి నైపుణ్యత సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు.

News May 19, 2024

KTR‌ను ఎర్రగడ్డలో అడ్మిట్ చేయాలి: కాంగ్రెస్ నేతలు

image

BRS అధికారం కోల్పోయిన తర్వాత KTR మతిభ్రమించి మాట్లాడుతున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిరెడ్డి విజితా రెడ్డి, హరినాథ్ రెడ్డి, ఎడ్ల నరేందర్ రెడ్డి ఎద్దేవా చేశారు. నల్లకుంటలో వారు సమావేశమయ్యారు. తెలంగాణలో INCకి ఒక్క MP సీటు కూడా రాదని KTR వ్యాఖ్యానించడం సరికాదన్నారు. ఆయన్ని ఎర్రగడ్డ ఆస్పత్రిలో అడ్మిట్ చేసి, మానసిక వైద్య చికిత్సలు చేయించాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు.

News May 19, 2024

PDPL: స్ట్రాంగ్‌రూంలను తనిఖీ చేసిన స్టేట్ డిప్యూటీ ఎన్నికల ప్రధానాధికారి

image

ఈవీఎంను భద్రపర్చిన స్ట్రాంగ్‌రూం లను రాష్ట్ర ఎన్నికల డిప్యూటీ ప్రధాన అధికారి మురళీ మోహన్ రావు పరిశీలించారు. శనివారం రామగిరిలోని సెంటినరీకాలనీలో ఉన్న జేఎన్టీయూ మంథని కళాశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణశ్రీతో కలిసి తనిఖీ చేశారు. రామగుండం, మంథని, ధర్మపురి, పెద్దపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించిన స్ట్రాంగ్ రూంలకు వేసిన సీల్‌లను పరిశీలించి సంబంధిత రిజిస్టర్‌లో సంతకం చేశారు.

News May 19, 2024

WGL: గ్రూప్1 పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలి: TSPSC ఛైర్మన్

image

జూన్ 9న జరగనున్న గ్రూప్ -1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని TSPSC ఛైర్మన్ మహేందర్ రెడ్డి ఆదేశించారు. గ్రూప్-1 ప్రిలిమినరీ ఎగ్జామ్‌కు సంబంధించిన ఏర్పాట్లపై శనివారం వరంగల్ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, అదనపు కలెక్టర్ సంధ్యారాణి, సీపీలు, ఎస్పీ, డీసీపీలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు.