Telangana

News May 18, 2024

కరీంనగర్: ముగ్గురు టీచర్ల సస్పెన్షన్.!

image

కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబుపేట ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు మంగ, సైదాపూర్ మండలం నల్లోనితండా పాఠశాల ఉపాధ్యాయురాలు సునీతలను డీఈవో జనార్దన్‌రావు సస్పెండ్ చేశారు. ఆయా పాఠశాలల్లో అనధికారిక వ్యక్తులు నివాసం ఉంటున్నారనే సమాచారం తెలియజేయకపోవడంతో విధుల నుంచి తొలగించారు. అదేవిధంగా కరీంనగర్ పట్టణం ఫకీర్ నగర్ స్కూల్ టీచర్ మంజులను విధులకు గైర్హాజరు కారణంగా సస్పెండ్ చేశారు.

News May 18, 2024

KMR: వ్యక్తి ప్రాణం తీసిన వడ్ల కుప్ప

image

రోడ్డు పై ఉంచిన వడ్ల కుప్ప ఓ వ్యక్తి ప్రాణం తీసింది. ఈ ఘటన పిట్లం పోలీస్ స్టేషన్ పరిధిలోశనివారం రాత్రి జరిగింది. వివరాల్లోకెళితే.. కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలానికి చెందిన సురేందర్ గొండ బైక్ పై మాసాన్ పల్లి వెళ్లాడు. తిరిగి తన స్వగ్రామానికి వస్తున్న ఈ క్రమంలో రోడ్డుపై ఉన్న ధాన్యం కుప్పను గమనించకుండా కుప్ప పైకి బైకు ఎక్కించడంతో అదుపు తప్పి కిందపడి అక్కడిక్కడే మృతి చెందాడు.

News May 18, 2024

NLG: ఐటిఐలలో ప్రవేశానికి నోటిఫికేషన్ జారీ

image

నల్గొండ జిల్లాలోని 4 ప్రభుత్వ, 10 ప్రైవేట్ ఐటిఐలలో 2024-25/26 సంవత్సరం (ఒకటి, రెండు సంవత్సరాల కోర్సులకు) అడ్మిషన్ల కొరకు నోటిఫికేషన్ జారీ చేసినట్లు నల్గొండ జిల్లా ఐటిఐల కన్వీనర్/ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ ఉత్తీర్ణత లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు http://iti.telangana.gov.in వెబ్ సైట్ లో నమోదు చేసుకోవాలన్నారు.

News May 18, 2024

MDK: TS స్థానంలో TGగా మార్చాలి: కలెక్టర్

image

ప్రభుత్వ రంగ సంస్థలు, ఏజెన్సీలు పేర్లలో TS బదులుగా TGగా మార్చాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర అబ్రియేషన్స్ సూచించే TS స్థానంలో TGని వినియోగించేందుకు కేంద్రం అనుమతిస్తూ గెజిట్ జారీ చేసినట్లు తెలిపారు. మార్చి నెలలో వాహనాల రిజిస్ట్రేషన్‌కు అనుమతులు రాగా, తాజాగా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో TGని వినియోగించేందుకు అనుమతి లభించిందన్నారు.

News May 18, 2024

స్వర్ణం సాధించిన నిఖత్ జరీన్

image

నిజామాబాద్‌కు చెందిన స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ ఫైనల్‌లో సత్తా చాటింది. ఎలోర్డా కప్ బాక్సింగ్ టోర్నిలో నిఖత్ (52 కేజీలు) అద్భుత విజయంతో బంగారు పతకం కైవసం చేసుకుంది. నిఖత్ తన ప్రత్యర్థి కజకిస్తాన్‌కు చెందిన ఝహిరా ఒరక్‌బయవా పై 5-0తో నెగ్గింది. బౌట్ ఆరంభం నుంచే ప్రత్యర్థిపై పదునైన పంచ్లతో విరుచుకుపడ్డ నిఖత్.. అలవోకగా విజయం సాధించింది. 

News May 18, 2024

MBNR: 3,21,523 ఎకరాల్లో పంటలు సాగు

image

వానాకాలంలో జిల్లావ్యాప్తంగా 3,21,523 ఎకరాల్లో పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి నివేదించింది. వరి 1,70,445 ఎకరాల్లో సాగు కానుండగా.. 42,612 క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉంచనున్నారు. అదేవిధంగా పత్తి 85,379 ఎకరాల్లో సాగు కానుండగా.. 853.79 క్వింటాళ్ల విత్తనాలు సిద్ధంగా ఉంచాలని ప్రణాళిక రూపొందించారు. ఇతర పంటలకు సంబంధించిన విత్తనాలు అందుబాటులో ఉంచాలని వ్యవసాయ శాఖ అధికారులు నిర్ణయించారు.

News May 18, 2024

ఇంటి నుండి వెళ్లి.. శవమైన మౌనిక

image

నిజాంపేట మండలం కొత్తపల్లి శివారు పంట పొలంలో మహిళా మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. కల్హేర్ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని బాచేపల్లి చెందిన కురుమ మౌనికగా గుర్తించారు. ఈనెల 10న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి లచ్చవ్వ ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పంట పొలాల్లో మౌనిక మృతదేహం లభ్యం పట్ల పోలీసులు అనుమానిస్తూ హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News May 18, 2024

కల్వకుర్తిలో రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక

image

కల్వకుర్తి పట్టణంలోని సీబీఎం కళాశాల మైదానంలో రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక ఉంటుందని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి స్వాములు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఎంపిక ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చేనెల 6, 7 తేదీలలో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా నుంచి పాల్గొంటారని తెలిపారు. అండర్ 18 బాలురు బాలికలు, క్రీడలలో పాల్గొంటారని వివరించారు.

News May 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ కు CPI(M) మద్దతు!

image

ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి CPI(M) పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం అధికారిక ప్రకటన చేశారు. WGL-NLG-KMM ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతు ఇవ్వాలని CPI(M) నిర్ణయించిందని తెలిపారు. బిజెపిని ఓడించడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించారు.

News May 18, 2024

పిట్లం: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

కామారెడ్డి మండలం గౌరారం తండాకి చెందిన కేతావత్ మంజుల (38) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. మంజుల తన ఇంటి ముందు బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.