Telangana

News May 18, 2024

ఇంటి నుండి వెళ్లి.. శవమైన మౌనిక

image

నిజాంపేట మండలం కొత్తపల్లి శివారు పంట పొలంలో మహిళా మృతదేహాన్ని శనివారం పోలీసులు గుర్తించారు. కల్హేర్ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని బాచేపల్లి చెందిన కురుమ మౌనికగా గుర్తించారు. ఈనెల 10న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆమె తల్లి లచ్చవ్వ ఫిర్యాదు చేయగా పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. పంట పొలాల్లో మౌనిక మృతదేహం లభ్యం పట్ల పోలీసులు అనుమానిస్తూ హత్య కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

News May 18, 2024

కల్వకుర్తిలో రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక

image

కల్వకుర్తి పట్టణంలోని సీబీఎం కళాశాల మైదానంలో రేపు జిల్లా స్థాయి అథ్లెటిక్స్ క్రీడాకారుల ఎంపిక ఉంటుందని అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి స్వాములు తెలిపారు. రేపు ఉదయం 9 గంటలకు క్రీడాకారుల ఎంపిక ప్రారంభమవుతుందని తెలిపారు. వచ్చేనెల 6, 7 తేదీలలో హనుమకొండలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో జిల్లా నుంచి పాల్గొంటారని తెలిపారు. అండర్ 18 బాలురు బాలికలు, క్రీడలలో పాల్గొంటారని వివరించారు.

News May 18, 2024

ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. కాంగ్రెస్ కు CPI(M) మద్దతు!

image

ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి CPI(M) పార్టీ మద్దతు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ కార్యదర్శి తమ్మినేని వీరభద్రం శనివారం అధికారిక ప్రకటన చేశారు. WGL-NLG-KMM ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెసుకు మద్దతు ఇవ్వాలని CPI(M) నిర్ణయించిందని తెలిపారు. బిజెపిని ఓడించడం కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మద్దతు ప్రకటించారు.

News May 18, 2024

పిట్లం: విద్యుత్ షాక్‌తో మహిళ మృతి

image

కామారెడ్డి మండలం గౌరారం తండాకి చెందిన కేతావత్ మంజుల (38) శనివారం విద్యుదాఘాతంతో మృతి చెందారు. కుటుంబీకుల వివరాల ప్రకారం.. మంజుల తన ఇంటి ముందు బట్టలు ఆరేస్తుండగా ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి మృతి చెందింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 18, 2024

మెదక్‌లో 4 పాలిసెట్ పరీక్ష కేంద్రాలు

image

పాలిసెట్- 2024 ప్రవేశ పరీక్ష ఈనెల 24న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు మెదక్ జిల్లా కేంద్రంలో 4 పరీక్ష కేంద్రాలలో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సువర్ణలత తెలిపారు. ప్రభుత్వ బాలికల పాఠశాల, ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సిద్ధార్థ ఆదర్శ జూనియర్ కళాశాల, సిద్ధార్థ మోడల్ హై స్కూల్‌లో ఏర్పాటు చేశామన్నారు. విద్యార్థులు సమయానికి హాజరు కావాలని సూచించారు.

News May 18, 2024

దామెరవాయిలో అరుదైన ముద్ర లభ్యం

image

తాడ్వాయి మండలం దామెరవాయి రాక్షసగుహలు సమీపంలోని ఊర చెరువులో ఉపాధిహామీ పనులు చేపట్టారు. చెరువుల మట్టిని తవ్వుతున్న క్రమంలో విలేజ్ అన్వేషకుడు కార్తీక్‌కు అరుదైన ముద్ర లభించింది. ఈముద్ర ఎరుపు వర్ణంలో 5 రేకులతో కూడిన పువ్వు గుర్తు ఉంది. లభించిన ముద్రను పరిశోధకుడు రత్నాకర్ రెడ్డికి అందజేయగా సుమారు 2500 సం. కాలం నాటిదై ఉండవచ్చని తెలిపారు. 

News May 18, 2024

ADB: టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో..!

image

ADB:టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయంలో రుసుము రూ.400 నుంచి 1000 పెంచగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు.ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులో సైతం సొంత జిల్లాలో కాకుండా దూరపు ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.దరఖాస్తుకు రూ.1000 తీసుకొని దూరపు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News May 18, 2024

త్వరలో ట్రయల్‌ రన్‌..

image

చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టు వద్ద ప్రత్యేక సాంకేతికత పనులు సాగుతున్నాయి. త్వరలో సాఫ్ట్‌వేర్‌ పనులను పూర్తిచేసి ట్రయల్‌ రన్‌ వేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈఎం బ్రేక్స్‌ వంటి పనులను అధికారులు పూర్తిచేశారు. ఈ లోగానే మెయింటెనెన్స్‌ , ఇతర మెకానికల్‌ పనులు ముగిస్తామని తెలిపారు.

News May 18, 2024

NZB: టెట్ అభ్యర్థులకు ఎన్ని కష్టాలో..!

image

టెట్ అభ్యర్థులకు ఈసారి కష్టాలు తప్పడం లేదు. దరఖాస్తుల సమయంలో రుసుము రూ.400 నుంచి 1000 పెంచగా అనేకమంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. ఇదిలా ఉంటే పరీక్షా కేంద్రాల కేటాయింపులో సైతం సొంత జిల్లాలో కాకుండా దూరపు ప్రాంతాల్లో కేంద్రాలు కేటాయించడంతో అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దరఖాస్తుకు రూ.1000 తీసుకొని దూరపు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

News May 18, 2024

MBNR: రూ. 60 వేలు కాజేసిన సైబర్ దుండగుడు

image

అచ్చంపేటకి చెందిన ఓ వ్యక్తి సైబర్ వలలో చిక్కి రూ. 60 వేలు పోగొట్టుకున్నాడు. SI రాము తెలిపిన వివరాలు.. పట్టణంలోని మహేంద్ర కాలనీకి చెందన అష్రఫ్ ఫోన్‌కు ఈ నెల 2న ఓ లింక్ వచ్చింది. దానిని క్లిక్ చేయగా వెంటనే ఫోన్ హ్యాక్ అయ్యి తన బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 60 వేలు విత్‌డ్రా అయినట్లు మిసేజ్ వచ్చింది. వెంటనే తేరుకున్న అష్రఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.