Telangana

News May 18, 2024

ఖమ్మం: RTC బస్సు కిందపడి మహిళ దుర్మరణం

image

కొణిజర్ల ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు ఫుట్ బోర్డులో ప్రయాణం చేస్తున్న సదరు మహిళ ఫుట్ బోర్డు నుంచి జారి అదే బస్సు వెనక టైర్ కిందపడి దుర్మరణం చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనతో రాకపోకలు నిలిచిపోయాయి.

News May 18, 2024

ఆదిలాబాద్ పార్లమెంట్‌లో ఎవరు గెలిచిన చరిత్రే..!

image

ADB పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు ఈసారి చరిత్రలో నిలిచిపోనున్నాయి. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణ గెలిస్తే ADB స్థానంలో MP అయినా మొదటి మహిళగా, పోటీచేసిన మొదటిసారే గెలిచిన నేతగా చరిత్ర సృష్టిస్తారు. 20 ఏళ్ల నుంచి అక్కడ ఏ పార్టీకి వరుసగా రెండోసారి గెలవలేదు. BJP అభ్యర్థి నగేశ్ గెలిస్తే ఆ రికార్డు బ్రేక్ అవుతుంది. BRS అభ్యర్థి గెలిస్తే 2 సార్లు MLAగా గెలిచి MP అయిన వ్యక్తిగా ఆత్రం సక్కు నిలుస్తారు.

News May 18, 2024

నిజామాబాద్ జిల్లాలోని పర్యాటక ప్రాంతాలు

image

నిజామాబాద్ జిల్లాలో పర్యాటక ప్రాంతాలకు కొదువ లేదు. ఏటా వేసవిలో ఇతర జిల్లాల నుంచి వందలాది మంది వస్తుంటారు. జిల్లాలో ప్రధానంగా డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, శ్రీ రఘునాథాలయం కోట, అలీసాగర్, అశోక్ సాగర్, నిజాంసాగర్, నీలకంఠేశ్వర ఆలయం, మల్లారం అడవి, మ్యూజియం, దోమకొండ కోట, ఆర్మూర్ రాక్ ఫార్మేషన్స్, పోచారం అభయారణ్యం వంటి అద్భుతమైన ప్రాంతాలున్నాయి.
– ఇంకా మీకు తెలిసిన.. మీకు నచ్చిన ప్లేస్ ఏంటో కామెంట్ చేయండి.

News May 18, 2024

నల్గొండ: ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక సూసైడ్

image

బాలిక ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యుల, ఎస్ఐ కథనం ప్రకారం.. మిర్యాలగూడ మండలానికి చెందిన బాలిక(17) పారామెడికల్ కోర్స్ చదువుతోంది. తక్కెళ్ళపాడుకి చెందిన ఓ యువకుడు ప్రేమ పేరుతో బాలికను వేధిస్తున్నట్లు తెలిపారు. శుక్రవారం బాలిక ఇంట్లో ఒంటరిగా ఉండగా నిందితుడు ప్రేమ పేరుతో వేధించడంతో పాటు, ఫోన్ తీసుకొని దాడి చేసినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఉరేసుకున్నట్లు తెలిపారు.

News May 18, 2024

ఖమ్మం: ఇంకా ఎనిమిది రోజులే!

image

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి మే 27న పోలింగ్‌ జరగనుంది. రాకేశ్ రెడ్డి (BRS), తీన్మార్ మల్లన్న (INC), ప్రేమెందర్ రెడ్డి (BJP)తో పాటు మరో 49 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. 3 ఉమ్మడి జిల్లాల్లో కలిపి పట్టభద్రుల ఓటర్ల సంఖ్య 4,61,806. పోలింగ్‌కు ఎనిమిది రోజులే ఉండటంతో బరిలో ఉన్న అభ్యర్థులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

News May 18, 2024

ఉమ్మడి వరంగల్‌: 1,67,853 మంది ఓటర్లు

image

వరంగల్‌-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల స్థానానికి మే 27న పోలింగ్‌ జరగనుంది. రాకేశ్ రెడ్డి (BRS), తీన్మార్ మల్లన్న (INC), ప్రేమెందర్ రెడ్డి (BJP)తో పాటు మరో 49 మంది స్వతంత్రులు బరిలో ఉన్నారు. ఉమ్మడి వరంగల్‌లోని 6 జిల్లాల వ్యాప్తంగా 1,67,853 మంది ఓటు హక్కు పొందారు. అత్యధికంగా WGL జిల్లాలో 43,594, HNKలో 43,383, MHBD 34,759, జనగామ 23,320, భూపాలపల్లి 12,460, ములుగులో అతి తక్కువగా 10,237 మంది ఓటర్లు ఉన్నారు.

News May 18, 2024

హత్నూర: బైక్‌ను ఢీ కొట్టిన డీసీఎం.. వ్యక్తి మృతి

image

హత్నూర మండలం సిరిపుర గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ప్రియా తాండకు చెందిన గుగులోత్ పప్యా తన బైక్‌పై పని నిమిత్తం సంగారెడ్డికి వెళ్తుండగా, సిరిపురం గ్రామ శివారులో వెనక నుండి వచ్చిన డీసీఎం బైకును ఢీ కొట్టింది. దీంతో పప్యా తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య శ్యామల ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

News May 18, 2024

NGKL: పోలీసుల భయంతో ఆటో డ్రైవర్ ఆత్మహత్య

image

పోలీసులు కొడతారనే భయంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన NGKLజిల్లా తెల్కపల్లి మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు వివరాలు ప్రకారం.. వెంకటయ్య (43) ఆటో నడుపుతూండేవాడు. ఈనెల 14న ఓ మహిళ ఆటోలో ఎక్కింది బంగారు గొలుసు చోరైనట్లు PSలో ఫిర్యాదు చేసింది. వెంకటయ్యను విచారించారు. మరుసటి రోజు PSకు రమ్మనగా జ్వరంతో వెళ్లలేకపోయాడు. పోలీసులు కొడతారేమోనని భయంతో శుక్రవారం ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు అతడి భార్య ఆరోపించారు.

News May 18, 2024

HYD: ఏకంగా విగ్రహాలనే దొంగలించిన దొంగలు!

image

హైదరాబాద్‌లో ఏకంగా ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు మాయం చేశారు. జూబ్లీహిల్స్ నర్నే రోడ్డులో జీహెచ్ఎంసీ వాళ్లు 2021లో ఒక ఫ్యామిలీ విగ్రహాలు పెట్టారు. అయితే దొంగలు ఆ ఫ్యామిలీలోని తండ్రిని వదిలి భార్య, కూతురు, కొడుకు విగ్రహాలు దొంగిలించారు. సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన విగ్రహాలను కూడా దొంగలు వదలడం లేదు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

News May 18, 2024

జూబ్లీహిల్స్: నర్నే రోడ్డులో ఫ్యామిలీ విగ్రహాలు మాయం

image

హైదరాబాద్‌లో ఏకంగా ఫ్యామిలీ విగ్రహాలను దొంగలు మాయం చేశారు. జూబ్లీహిల్స్ నర్నే రోడ్డులో జీహెచ్ఎంసీ వాళ్లు 2021లో ఒక ఫ్యామిలీ విగ్రహాలు పెట్టారు. అయితే దొంగలు ఆ ఫ్యామిలీలోని తండ్రిని వదిలి భార్య, కూతురు, కొడుకు విగ్రహాలు దొంగిలించారు. సుందరీకరణ కోసం ఏర్పాటు చేసిన విగ్రహాలను కూడా దొంగలు వదలడం లేదు. దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.