Telangana

News May 18, 2024

UPDATE జగిత్యాల: ఇంటి స్థలం విషయంలో ఇద్దరి హత్య

image

ఇంటి స్థలం విషయంలో జరిగిన గొడవలో ఇద్దరు అన్నదమ్ముల కుమారులు <<13261896>>హత్య<<>>కు గురయ్యారు. బుగ్గారం పోలీసుల వివరాలు.. గోపులాపూర్‌కు చెందిన శ్రీనివాస్‌ ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. దాని పక్కనే అదే గ్రామానికి చెందిన నవీన్‌ ఇల్లు ఉంది. రోడ్డు విషయంలో వీరికి గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో శ్రీనివాస్‌‌(36)తో పాటు అతడి పెద్దనాన్న కొడుకైన మహేశ్‌‌(38)పై నవీన్‌ కొంతమంది యువకులతో కలిసి దాడి చేయగా.. ఇద్దరు మృతి చెందారు.

News May 18, 2024

HYD: నేడు TS EAPCET 2024 పరీక్ష ఫలితాలు

image

నేడు కూకట్ పల్లి JNTU యూనివర్సిటీలో TS EAPCET 2024 పరీక్షకు సంబంధించి ఫలితాలను అధికారులు విడుదల చేయనున్నారు. ఉదయం 11 గంటలకు వర్సిటీలోని గోల్డెన్ జూబ్లీ కాన్ఫరెన్స్ హాల్లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరానికి గాను ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మాసిటికల్ విభాగాలలో సీట్ల భర్తీ కొరకు విద్యార్థులకు కంప్యూటర్ బేస్డ్ విధానంలో మే7 నుండి మే 9వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించారు.

News May 18, 2024

నల్గొండ జిల్లాలో విజృంభిస్తున్న వైరస్

image

క్షయ వ్యాధి కలవరపెడుతోంది. జిల్లాలో ప్రతి సంవత్సరం వ్యాధి బారినపడేవారు సంఖ్య పెరుగుతోంది. బాధితులు నయమయ్యే వరకు ఔషధాలు వాడకుండా మధ్యలోనే ఆపేయడం, వ్యాధిపై అవగాహన లేకపోవడంతో తిరిగి వ్యాధి తిరగపెడుతోంది. క్షయ ఒకరి నుంచి మరొకరికి సోకే అంటు వ్యాధి కావడంతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిలో ఎక్కువగా వ్యాధి వ్యాప్తి జరుగుతోంది. జిల్లాలో మూడు నెలల్లో 282 కేసులు నమోదు అయ్యాయి.

News May 18, 2024

ఆసిఫాబాద్: ‘ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య’

image

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిందో భార్య. ఈ ఘటన ASFలోని రహాపెల్లిలో జరిగింది. చునార్కర్ రవీందర్(38), కళావతి భార్యభర్తలు. కళావతి అదే గ్రామానికి చెందిన అక్కపెల్లి రవీందర్‌తో తరచూ ఫోన్ మాట్లాతుందన్న అనుమానంతో భార్యభర్తల మధ్య గొడవ జరుగుతుండేది. గురువారం ప్రియుడితో కలిసి భర్తను ఇంట్లో ఉరేసి చంపేసిందన్న అనుమానంతో రవీందర్ అన్న ఆనందరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై SI రాజేశ్వర్ కేసు నమోదు చేశారు.

News May 18, 2024

ఖమ్మం జిల్లాలో దారుణం.. తల్లి, పిల్లలను చంపిన వ్యక్తి

image

ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. ఓ వ్యక్తి తన తల్లి, ఇద్దరు పిల్లలను చంపేశాడు. మృతులు తల్లి పిచ్చిమ్మ(60), కుమార్తెలు నీరజ (10), ఝాన్సీ (6). పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 18, 2024

వరంగల్: విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుత్ షాక్‌తో ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. స్థానికుల కథనం ప్రకారం..  నల్లగొండ జిల్లాకి చెందిన రాఘవేంద్ర (23) శంభునిపేట విశ్వనాథ రాఘవేంద్ర కాలనీలో ఉంటున్న అత్తగారింటికి వచ్చాడు. సాయంత్రం కురిసిన వర్షానికి తడిసి ఇంటికి వచ్చిన ఆయన గుడిసెలోకి వెళ్తున్న క్రమంలో ఫ్యాన్‌కు చేయి తగిలింది. దీంతో కరెంట్ షాక్‌కి  గురయ్యాడు. అపస్మారక స్థితికి చేరుకున్న అతడిని MGMకి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News May 18, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఎమ్మెల్సీ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కొత్తగూడెం పట్టణంలో జడ్పీ సర్వసభ్య సమావేశం
∆} వివిధ శాఖలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
∆} ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} జూలూరుపాడు మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News May 18, 2024

HYD: ఆర్టీసీకి ఒకేరోజు రూ.26 కోట్ల ఆదాయం

image

పోలింగ్ మరుసటి రోజు ఆర్టీసీకి రూ.26 కోట్ల ఆదాయం చేకూరిందని ఆ సంస్థ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం జేబీయస్‌‌లోని పుష్పక్ బస్ షెల్టర్ సందర్శియిర్ పోర్ట్‌కు వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పుష్పక్ AC బస్సులను 24 గంటల పాటు నడుపుతున్నామని, గ్రేటర్ పరిధిలో మరో 125 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

News May 18, 2024

HYD: ఆర్టీసీకి ఒకేరోజు రూ.26 కోట్ల ఆదాయం

image

పోలింగ్ మరుసటి రోజు ఆర్టీసీకి రూ.26 కోట్ల ఆదాయం చేకూరిందని ఆ సంస్థ గ్రేటర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం జేబీయస్‌‌లోని పుష్పక్ బస్ షెల్టర్ సందర్శియిర్ పోర్ట్‌కు వెళ్తున్న ప్రయాణికులతో మాట్లాడారు. శంషాబాద్ ఎయిర్ పోర్టుకు పుష్పక్ AC బస్సులను 24 గంటల పాటు నడుపుతున్నామని, గ్రేటర్ పరిధిలో మరో 125 కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

News May 18, 2024

REWIND-2019: చేవెళ్లలో కాంగ్రెస్ ఓటమి!

image

చేవెళ్లలో విజయం ఎవరిదనేది హాట్‌ టాపిక్‌గా మారింది. 2019‌లోనూ రసవత్తర పోరు సాగింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి(INC)పై రంజిత్ రెడ్డి (BRS) 14,317 ఓట్ల మెజార్టీతో‌ గెలిచారు. జనార్థన్ రెడ్డి(BJP) 3వ స్థానంలో నిలిచారు. ఎన్నికల‌కు ముందు విశ్వేశ్వర్ రెడ్డి(BJP), రంజిత్ రెడ్డి (INC), జ్ఞానేశ్వర్(BRS) నువ్వానేనా అన్నట్లు ప్రచారం చేశారు. పోలింగ్ ముగిశాక ఎవరికి వారు‌ తమదే మెజార్టీ‌ అంటున్నారు. మీ కామెంట్?